యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 70
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 69 తిరువాలి తిరునగరిలో తిరుమంగై ఆళ్వార్ను దర్శించుకున్న జీయర్ అనంతరం, ఈ శ్లోకంలో చెప్పబడినట్లు అహిరాజశైలమపితో నిరంతరం బృతనాశతేనసవిలోకయన్ తతః అవరుహ్య దివ్యనగరం రమాస్పదం భుజగేశయం పునరుపేత్యపూరుషం (ఆ మణవాళ మాముణులు తమ శిష్య బృందంతో తిరుమల నలువైపులా రెప్పార్చకుండా ఆర్తిగా చూస్తూ, కొండ దిగి తిరుపతి దివ్య పట్టణానికి చేరుకున్నారు. ఆదిశేషునిపై శయనించి ఉన్న గోవిందరాజుని … Read more