కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 19 – ఋషి పత్నులు పొందిన వరం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 18 – గోపికా వస్త్రాపహరణం ఒక రోజు కృష్ణుడు, బలరాముడు మరియు వారి తోటి గోప బాలురు బృందావనంలోని అరణ్యంలో కూర్చున్నారు. గోప బాలులకు ఆకలి వేయడం ప్రారంభమైంది. వారు కృష్ణుడిని, బలరాముడిని వారికి ఆహారం ఏర్పాట‍ు చెయ్యమని ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు వారితో “ఇప్పుడు మనకు ఎక్కడి నుండి భోజనం దొరకుతుంది? మన ఇళ్లకు చాలా దూరంగా ఉన్నాం. … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 18 – వస్త్ర అపహరణం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 17 – వేణు గానం కృష్ణలీలల్లో, ప్రధానమైనది, గోపికా వస్త్ర అపహరణం. ఈ లీలను అంతరార్థంతో పాటుగా చూద్దాం. కృష్ణుడు, గోపికల పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉండేవాడు. వారికీ కృష్ణుడు అంటే ప్రేమ ఉండేది. అయినప్పటికీ, అతను వారిని, జుట్టు లాగుతూ, వస్త్రాలు లాగుతూ ఆటపటించేవాడు. అవి తట్టుకోలేక వారు వెళ్లి యశోదమ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకునే వారు. … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 17 – వేణు గానం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 16 – ఆవులు మరియు దూడలను మేపటం కృష్ణుని ప్రసిద్ధమైన లీలలలో ఒకటి వేణు గానం. కృష్ణుడు ఎప్పుడూ తన చేతిలో గానీ, నడుము వద్ద గానీ వేణువును ధరించేవాడు. అందువల్ల ఎవరైనా కృష్ణుణ్ణి స్మరించినప్పుడు వెంటనే వేణువు కూడా గుర్తుకు వచ్చేలా చేసేవాడు. సాధారణంగా గొర్రెల కాపరుల పిల్లలు కూడా వేణువును తమ దగ్గర ఉంచుకునేవారు. కృష్ణుడు వేణు … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 16 – ఆవులు మరియు దూడలను మేపుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 15 – ప్రలంబాసుర వధ శ్రీకృష్ణుడు తన చిన్నవయసులో చేసిన లీలలో ఎంతో ఇష్టమైనది—ఆవులను మేపడం. నమ్మాళ్వార్ తన తిరువాయ్మొలిలో “తివత్తిలుం పసు నిరై మేప్పువత్తి” అని, పరమపదంలో ఉన్నదానికంటే గోవులను మేపడమే కృష్ణునికి ఎక్కువ ఇష్టమని చెబుతారు. తిరుమంగై ఆళ్వార్ కూడా తిరునెడుంతాండగంలో “కన్ మేయుత్తు ఇనిదుగన్ద కలాయ్” అంటూ చిన్ని కృష్ణుడికి పశువులను మేపుతూ పరవశించడాన్ని ఆస్వాదించారు. … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 15 – ప్రలంబాసుర వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 14 – కళింగ నర్తనం కృష్ణుడు మరియు బలరాముడు వారి స్నేహితులతో కలిసి బృందావనంలో ఆనందంగా ఆడుకుంటున్నారు. ఒక రోజు, ప్రలంబాసురుడు అనే రాక్షసుడు, గోపబాలుడు రూపంలో వారి మధ్యలో చేరాడు. అతడు ఎలా అయినా కృష్ణుణ్ణి చంపాలని ఆలోచించాడు. ఆయనను చూసిన బలరాముడు, అతనిని సంహరించాలనుకున్నాడు. ఆ సమయంలో, వారు ఒక ఆట ఆడడం ప్రారంభించారు. ఆ ఆటలో … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 14 – కాళింగ నర్తనం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 13 – దేనుకాసుర వధ యమునా నది తీరంలో ఒక చెరువులో కాళీయ అనే పాము తన కుటుంబంతో కలిసి నివసించేది. అది దుష్ట మనసు కలిగినది. ఎప్పటికప్పుడు విషాన్ని ఉమ్మడం వల్ల, ఎవరూ ఆ చెరువు దగ్గరికి రాకుండా అడ్డుకుంది. ఎవరు దగ్గరికి వచ్చినా, వారు ఆ విష వాయువును పీల్చి మూర్చిపోయేవారు. పశువులకూ అలానే జరిగింది. అంతేకాక, ఆ … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 13 – ధేనుకాసుర వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 12 – బ్రహ్మా గర్వ భంగం కృష్ణుడు మరియు బలరాముడు తమ స్నేహితులతో అరణ్యంలో ఆనందంగా ఆటలాడుతూ ఉండేవారు. ఒకసారి ఆటలాడుతున్న సమయంలో, కృష్ణబలరాముల స్నేహితులైన గోపకుమారులు, తాళవనం (ఈతచెట్లతో నిండిన తోట) అనే స్థలంలో తీయని ఫలాలు చాలా ఉంటాయని, కానీ అక్కడ గాడిద రూపంలోనున్న ధేనుకాసురుడు భయపెడుతున్నాడని చెప్పారు. ఆ ధేనుకాసురుడు కూడా కంసుడు పంపిన రాక్షసుడే; … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 12 – బ్రహ్మా గర్వ భంగం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి  << 11 – అఘాసుర వధ  దేవతలు అందరూ సంతోషముగా కృష్ణుడు చేసిన అఘాసుర వధను కీర్తించాక, అది విన్న బ్రహ్మా కూడా చేరి, అంతటిని చూసి ఆశ్చర్యపోయాడు. భగవానుడికి విధేయుడు అయిన బ్రహ్మాకి తమో గుణం (అజ్ఞానం) వృద్ధి అయ్యి కృష్ణుడి పట్ల అసూయతో, “ఇంత చిన్న పిల్లాడికి ఇంత వైభవం ఎందుకు?” అని కృష్ణుడిని ఎలా అయినా ఇబ్బంది … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 11 – అఘాసుర వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి  << 10 – దధిపాండుడు పొందిన వరం కృష్ణుడికి అయిదు సంవత్సరాలు వయసులో, గోప బాలురతో చేరి అడవుల్లోకి వెళ్లి, గోవులు కాస్తున్న సమయంలో, బృందావనంలోని పచ్చని పొలాలు దాటి, అడవులల్లో సంతోషముగా ఆడుతూ పాడుతూ, తిరిగి ఇల్లు చేరే వారు, యశోధమ్మ మరియు ఇతర గోపస్త్రీలు వారికి పెరుగన్నం, పచ్చళ్లు, ఇతర ప్రసాదాలు ఇచ్చి పంపేవారు. మధ్యానం, పిల్లలు అందరూ … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 10 – దదిపాండుడు పొందిన వరం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి  << 9 – బృందావనం తరలి వెళ్లుట, ఇంకొందరు అసురుల సంహారం కృష్ణ లీలల్లో, అనేక ఆహ్లాదకరమైన అనుభవాలు మరియు ఆశ్చర్యకరమైన తత్వాలు చెప్పబడ్డాయి. వీటిల్లో ఒక అద్భుతమైన లీలే, కృష్ణుడు, ఒక కుమ్మరివాని కుండకు మోక్షం ఇవ్వటం. దీని మూలం, ఇతిహాస, పురాణాల్లో కనపడనప్పటికీ, కొన్ని ముఖ్యమైన పూర్వాచార్య గ్రంథాల్లో చెప్పబడింది. మొదట ఈ సన్నివేశాన్ని చూద్దాం. బృందావనంలో, ఒక … Read more