ఆచార్య హ్రుదయం – 50

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 49

అవతారిక
తిరువాయిమొళి వేదములో ఒక విధము అని నాయనార్లు నిర్ధారణ చేసియున్నారు. కానీ ఇది ఆళ్వార్ల నాలుగు ప్రబంధములకు సమానము. అందుచేతనే 43వ చూర్ణికలో అట్టి ఆ నాలుగు ప్రబంధములు నాలుగు వేదములుగా కృప చేయబడినవి. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రబంధము ఏ వేదముతో సామ్యమో నాయనార్లు కృప చేయుచున్నారు.

చూర్ణిక
ఇయఴ్పామూన్ఴుమ్ వేదత్రయమ్బోలే పణ్ణార్ పాడల్ పణ్బురైయిశైకొళ్ వేదమ్బోలే

సంక్షిప్త వివరణ
నమ్మాళ్వార్లు కృప చేసిన ఇయఴ్పాలోని మూడు ప్రబంధములు వేదములలో ఋగ్, యజుర్ మరియు అధర్వణ వంటిది. శృతి మరియు రాగముతో నిండియున్న తిరువాయిమొళి గానరసము కలది అయిన సామ వేదము వంటిది.

వ్యాఖ్యానము
అనగా ఇయఴ్పాలోని భాగములు అయిన మూడు ప్రబంధములు అనగా తిరువిరుత్తం, తిరువాశిరియం మరియు పెఱియ తిరువందాది ఋగ్, యజుర్ మరియు అధర్వణ వేదముల వంటివి. తిరువాయిమొళి 10.7.5 “పణ్డార్ పాడల్” (రాగము, గానంతో నిండియున్న మధురమైన పద్యాలు) అని చెప్పినట్టు రాగము గానముతో ఉన్న తిరువాయిమొళి గానముతో ఉన్న సామ వేదము వంటిది. తిరువాయిమొళి 6.6.5 ” పణ్ పురై వేదమ్” (గానముతో నిండియున్న వేదము) అనియు పెఱియ తిరుమొళి 5.3.2 “ఇశైకొళ్ వేదమ్” (రాగముతో ఉన్న వేదము) వ్యాఖ్యానములలో “పణ్బుడై వేదమ్” అనియే కానీ “పణ్బురై వేదమ్” అని లేదు మరియు “ఇశైకొళ్ వేదమ్” అనుదానికి సామవేదము అని చెప్పియుండి లేదు. విశ్వసించతగ్గ వాక్కులను చెప్పు నాయనార్లు ఈ గ్రంధమున ఇలా ప్రసాదించినందున ఈ అర్థమును కూడా అంగీకరింపవలెను. ఈ వైలక్షణ్యము సామ వేదమును గ్రహించినట్టు తక్కిన వేదములకు కూడా ఈ వైలక్షణ్యమును గ్రహించవచ్చును.

“పణ్బురై వేదమ్” అనగా గానముతో నిండియున్న వేదము అని అర్ధము కనుక అట్టి గానమునకు ఆశ్రయమైనది వేదము. “ఇశైకొళ్ వేదమ్” అనగా మంచి నాదముతో  ఉండు వేదము. తిరువాయిమొళికి అట్టి గాన నాదము ఉండడము వలన “పణ్డార్ పాడల్” లో చెప్పినట్టు సామ వేదమునకు గాన రసము కలవని తెలుపుటకు సామ వేదమునకు తిరువాయిమొళికి సామ్యములను చెప్పు ఇతర ప్రమాణాలు ఉన్నప్పట్టికీ నాయనార్లు ఈ ప్రమాణములను చూపించినారు.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-50-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment