అవతారిక
అట్టి దివ్య ప్రబంధములను భగవానుడు ఆళ్వార్లకు ఎలా ప్రసాదించారో మరియు ఆళ్వార్ల కృపా విశేషము చేత లోకములోని వారికి వారి మంచికోసము ఎలా అందాయో మరియు అట్టివారు ఆళ్వార్ల ద్వారా ఎలా గుర్తింపబడ్డారో ఉదాహరణతో నాయనార్లు కృప చేయుచున్నారు.
చూర్ణిక
ఉఱక్కమ్ తలైక్కొణ్ణ పిన్నై మఱైనాన్గుమ్ ఉణర్ న్ద తఙ్గళ్ అప్పనోడే
ఓతిన శన్దచ్చతుముకన్ శలఙ్గలన్ద వెణ్ పురినూల్ మానురి
తిరితందు ఉణ్ణుమ్ కామనుడల్ ఇరుక్కిలఙ్గ జ్యేష్ఠపుత్రాదికళుక్కు
మఱై పయంతాప్పోలే ఆతుమిల్ కాలత్తు ఎన్దైయాన వాయ్ ముతలప్పన్
పిరమకురువాయ్ ఇరాప్పకల్ మున్ శొల్ల కత్తనమే ఎన్ఱ యివరుం నావినాల్
నన్మైయాలెన్ఱు ఓతవల్ల పిరాక్కళై కన్మిన్గళెన్ఱు శొల్ ప్పయిత్త
వేదమ్ ఓతువార్ ఓత్తాకైయాలే అధర్వణాధికళ్ పోలే యితువుమ్ పేర్ పెత్తతు
సంక్షిప్త వివరణ
భగవానుడు తాను యోగనిద్ర నుంచి మేల్కొనిన తరువాత బ్రహ్మ భగవానుని నుంచి (ద్వారా) వేదమును నేర్చుకొనినాడు. బ్రహ్మ దానిని జ్ఞాని, విరాగి అయిన రుద్రునకు నేర్పెను. ఆ విధముగానే ఆళ్వారు కూడా దివ్య ప్రబంధములను భగవానుని నుంచి నేర్చుకొని తదనంతరం ఆ ప్రబంధములనే ఎంతో గొప్ప వారైన తనను అంటిపెట్టుకొని ఉన్న మధురకవి ఆళ్వార్లకు చెప్పెను. ఎలా అయితే వేదములు దానిని పఠించువారి ద్వారా తెలియవచ్చెనో ఈ ప్రబంధములు కూడా శఠకోపుల ద్వారా అధికరించినట్టు తెలియబడ్డాయి.
వ్యాఖ్యానము
అది ఏమి అనగా – పెఱియ తిరుమాడల్ “ఉన్నియ యోగత్తు ఉఴక్కమ్ తలైక్కొణ్డ పిన్నై” (యోగ నిద్రకి ఉపక్రమించిన తరువాత ప్రళయ కాలములో నామ రూపములు లేకుండా(కేవలము సత్ మాత్రమే) ఉండు ఈ జగత్తును రక్షించుటకు ఆలోచించు ఆ సర్వేశ్వరుడు సృష్టి సమయము ఆసన్నము కాగానే మహత్ మరియు అండములను మొదలగు వాటిని తాను సృజించి, చతుర్ముఖ బ్రహ్మను సృష్టించకముందు నీటి సముద్రమున “ఈ చేతనులను మంచి రీతిలో ఎలా ఉద్ధరించాలి?” అని యోగ నిద్రలో ఉండెను.
అది ఏమి అనగా – ఇరండామ్ తిరువందాది 48 “ఉణర్ న్దాయ్ మఱై నాన్గుమ్” (నాల్గు వేదములను ఆయన ఆలోచించినాడు) అని చెప్పినట్టు సుప్త ప్రబుద్ధ న్యాయము ప్రకారము(ఒకడు నిద్ర నుంచి లేవక మునుపు ఏది ఆలోచించెనో నిద్ర లేచినప్పుడు దానినే(ఆ ఆలోచననే) జ్ఞప్తికి తెచ్చుకొని మేల్కొనుట అను విధి ద్వారా) ఉన్న నాలుగు వేదములను తన మనస్సుయందు నిక్షిప్తము చేయబడి క్రమము తప్పకుండా యోచించినాడు. వేదము ద్వారా తెలియబడు బ్రహ్మ పెరియాళ్వార్ తిరుమొళి 2.5.8 “చన్ద చ్చతుర్ ముఖన్”(వేద రూపములగు నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ) అన్నట్టు వేదమును నేర్చుకొనెను. శ్వేతాశ్వతర ఉపనిషత్ 6-18 “యో బ్రహ్మణమ్ విద్ధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై| తమ్ హ దేవం ఆత్మబుద్ధి ప్రసాదం ముముక్షుర్వై శరణమ్ అహం ప్రపద్యే| | (మోక్షమును(శ్రీ వైకుంఠమును) పొందబోవు కోరిక గల నేను బ్రహ్మను మొదట సృజించి వేదములను బోధించిన పరాత్పరుడైన వాడికి శరణాగతి చేయుచున్నాను). బ్రహ్మకి తండ్రి అయిన ఆ సర్వేశ్వరుని నుంచి పెరియ తిరుమొళి 2.2.7 “తీసైమగనర్ తంగళ ప్పన్”(చతుర్ముఖ బ్రహ్మకు తండ్రి అయిన ఎమ్బెరుమానుడు). ఆ తరువాత బ్రహ్మ వేదములను నిత్యస్నానము చేత బ్రహ్మచర్య లక్షణములు గల, యజ్ఞోపవీతమును ధరించిన, జింక చర్మమును కలిగిన, భిక్ష ద్వారా భోజనం చేయు, జితేంద్రియుడు మరియు వేదాధ్యయనము ఎల్లప్పుడూ చేయు రుద్రునితో సహా పలువురికి బోధించెను. తిరుచ్చంద విరుత్తమ్ 113 “సలం కళంద సెంజడై”(జలముతో కూడియున్న ఎర్రని జడలు కలిగిన) ముదల్ తిరువందాది 46 “వెణ్ పురినూల్ మార్బన్”(వక్షమున ధరించు తెల్లని యజ్ఞోపవీతము గలవాడైన రుద్రుడు) పెరియ తిరుమొళి 10.9.4 “మానురి అదళుమ్ ఉడైఎవర్”(జింక చర్మమును కలిగినవాడు) తిరుక్కురుందాండగం 19 “పిఱార్ మనై తిరిదన్ దుణ్ణుమ్”(ఇతరుల గృహముల నుంచి భిక్ష చేసి భుజించువాడు) నాన్ముగన్ తిరువందాది 78 “కామనుడల్ కొణ్డ తవత్తాఱ్కు”(తపమును ఆచరించు శివుడు మరియు మన్మధుని శరీరమును బూడిదగా మార్చినవాడు) మరియు పెరియ తిరుమొళి 6.6.8 “ఇరుక్కిలఙ్గ తిరుమొళివాయ్ ఎణ్డొళిసర్”(పురుష సూక్తమును పఠించు మరియు ఎనిమిది భుజములు కలిగిన రుద్రుడు) మరియు బ్రహ్మయొక్క జ్యేష్ఠ పుత్రుడిగా తెలిసినవాడు “బ్రహ్మణాః పుత్రాయ జ్యేష్ఠాయ”(బ్రహ్మ జ్యేష్ఠ పుత్రుని కొరకు). ముదల్ తిరువందాది 60 “చరణా మఱై పయంద”(వేదమును ఉపాయముగా చెప్పబడిన వాడు). వేదమే పురుషార్ధమునకు ఉపాయము మరియు ఉపేయము. అలానే ప్రళయ కాలమున ఏదియూ లేనప్పుడు తిరువాయిమొళి 4.10.1 “ఒన్ఱుమ్ దేవుమ్ ఉలగుమ్ ఉయిరుమ్ మట్ఱుమ్ యాదుమ్ ఇల్లా అన్ఱు నాన్ముగన్ తన్నోడు దేవర్ ఉలగోడు ఉయిర్పడైత్తాన్ కున్ఱమ్ పోల్ మణి మాడ నీడు తిరుక్కురుగూర్ అదనుళ్ నిన్ఱ ఆదిప్ పిరాన్ నిఱ్క మత్తైత్ తేవ్యమ్ నాడుదిరే” (ప్రళయ కాలమున దేవ జాతి, దేవతా లోకములు, ఇతర జీవరాశులు అన్నీ (నామ రూపములు లేకుండుట) ఆ భగవానునిలో చేరి ఉన్నాయి. అప్పుడు ఎమ్బెరుమానుడు సమష్ఠి పురుషుడైన బ్రహ్మ, దేవతలు, ఇతర జీవరాశులు మరియు వారి లోకములను సృజించాడు. అట్టి భగవానుడు ఎత్తైన భవనములు కలిగిన (ఆళ్వార్ తిరునగరి దివ్య దేశములో నిలబడి ఉండగా) మరియు అతనే అన్నిటికీ మూల కారకుడై గొప్ప ఉత్తారకుడై ఉండగా నీవు అట్టి సృష్ఠి,ప్రళయ కాలముల మార్పులకు లోబడి ఉండు ఇతర దేవతలను ఆశ్రయిస్తున్నావా? ఏదియూ లేనట్టి ప్రళయ కాలమున నామ రూపములను పోగొట్టుకొని ఉనికిని పోగొట్టుకొనకుండా తండ్రి అయిన సంబంధము వలన తిరువాయిమొళి 3.4.4 “ఆడుమిల్ కాలత్తేన్దాయ్”(ఏదియూ లేనప్పుడు భగవానుడే తండ్రిగా ఉండుట) తనమీద పెట్టుకొని రక్షించి, ఇంద్రియములను ఇచ్చి జ్ఞాన వికాసమును ప్రకాశింపజేసినవాడును. అట్టి ఆశ్రిత రక్షకుడు అన్నిటికీ కారణమైనవాడు తిరువాయిమొళి 7.9.3 “వాయ్ ముదల్ అప్పన్”(నా మాటకు కారకుడైన ఉత్తారకుడు(ఉపకారకుడు)) తానే ఆచార్యునిగా వేంచేసి ఉండి పెరియాళ్వార్ తిరుమొళి 5.2.8 “పీదగవాడైప్ పిరానార్ పిరమ గురువాయ్ వందు”(పసుపు పచ్చని వస్త్రమును ధరించిన భగవానుడు ప్రధమాచార్యునిగా వేంచేసినాడు) పగలు రాత్రి తేడా లేకుండా తానే నాకు నిరంతరము ఉపదేశమును చేసినాడు అని చెప్పినట్టు పెరియాళ్వార్ తిరుమొళి 5.2.3 “ఇరాప్పగల్ ఓదువిత్తు”(పగలు, రాత్రి తేడా లేకుండా తానే నాకు నిరంతరము ఉపదేశమును చేసినాడు అని చెప్పినట్టు పెరియాళ్వార్ తిరుమొళి 5.2.3 “ఇరాప్పగల్ ఓదిఎత్తు”(పగలు, రాత్రి రెండు పూట్లా ఉపదేశించుట) అనియు తిరువాయిమొళి 7.9.2 “ఎన్ మున్ సొల్లుమ్”(నాకు ముందుగా చెప్పువాడు) అన్నట్లు ఆయన చెప్పగా నేను ఆయన చెప్పినది పలికినాను(సంతై) అనియు తిరువిరుత్తమ్ 64 “తిరునామచ్చోలే కత్తనమే”(ఆయన దివ్య నామములను మేము నేర్చుకొంటిమి). అట్టి ఆళ్వారు భగవానుని నుంచి ప్రత్యక్షముగా నేర్చుకొని(మధురకవి ఆళ్వార్ మొదలగువారు) ప్రేమతో ఆళ్వార్లు తమకు నేర్పించగల సామర్ధ్యమును కలిగివున్నవారని ప్రకటించి మరియు తమ ఆచార్యుల పట్ల అత్యంత ప్రేమను చూపిన కణ్ణినుణ్ చిరుత్ తాంబు 2 “నావినాల్ నవిత్తు ఇన్బమ్ ఎయిదినేన్ … కురుగూర్ నంబి పావిన్ ఇన్నిశై పాడిత్ తిరివనే”(నేను అత్యంత ఆనందమును నమ్మాళ్వార్ల పాశురములను నా నాలుకతో పాడి పొందితిని. నేను ఆళ్వార్ల దివ్యమైన బంగారు శ్రీచరణములకు మనసారా నిత్యముగా శరణాగతి చేసితిని. ఆళ్వార్ తిరునగరి నాయకుడు మరియు కళ్యాణ గుణములను కలిగిన నమ్మాళ్వార్లను తప్ప వేరొక దైవమును నేను ఎఱుగను. నేను అట్టి మధురమైన పాశురములను పాడుతూ అటూ ఇటూ తిరుగుతూ నా కాలము గడిపెదను) అని తమ కృతజ్ఞతను తెలిపే కణ్ణినుణ్ చిరుత్ తాంబు 4 “నన్మెయాల్ మిక్క నాన్మఱైయాల్ ర్గలళ్ పున్మమైగాక్ కరుదవర్ ఆదలిల్ అన్నైయామ్ అత్తనాయ్ ఎన్నై ఆణ్ డిడుమ్ తన్మైయాన్ శడగోపన్ ఎన్ నంబియే”(తక్కువ వాడినైన నన్ను చూసి గొప్పతనము కలిగి నాల్గు వేదములను అభ్యసించి నిష్ణాతులైన వైదికులు నన్ను నిర్లక్ష్యము చేశారు, ఒక తల్లి తండ్రి లాగా, దాసునిగా నన్ను అంగీకరించదలచిన గొప్ప గుణములు కలిగిన నమ్మాళ్వారులు నాకు ఆచార్యులు) అనియు ఆళ్వార్లు తానే చెప్పినట్టు వారు నేర్చుకొన సామర్ధ్యమును కలిగినవారు తిరువాయిమొళి 9.1.11 “ఓదవల్ల పిరాక్కళ్” (ఈ పత్తును అధ్యయనము చేయునట్టి ఉపకారకులు). ఆళ్వార్లు అభ్యసించు కోరికగల వారైన మధురకవి ఆళ్వార్లు మొదలగువారు ఈ పాశురములను అభ్యసించిరి. తిరువాయిమొళి 9.5.8 “సోల్ పయిత్తియ”(ఆయన దివ్య నామములను తెలుపు పదములను నేర్పితిని.
ఎలా అయితే వేదములు అవలంబించు వారిచే అవి గుర్తింపబడ్డట్టు తిరువాయిమొళి 3.1.6 “ఓదువార్ ఓత్తు”(ఆయా వేదం శాఖలకు చెందిన అర్హత కలిగిన వారిచే అభ్యసించతగినవైన ఋగ్, యజుర్, సామ మొదలగు విభాగములను కలిగిన వేదములు) వాటికి అధర్వణమ్, తైత్తి రీయం, కాణ్వం అని నామములు కలిగినవి. అలానే తిరువాయిమొళిని నేర్చినవారిలో ప్రధములు నమ్మాళ్వార్లు కావడము చేత అని తిరువాయిమొళి 1.2.11 “సడగోపన్ సొల్”(ఆళ్వార్ల వాక్కులు). అందుచేత తిరువాయిమొళి వేదము అని చెప్పబడిన చూర్ణిక 37 “సందజ్గళ్ ఆయిరమ్” అనునది చూర్ణిక 39 నుంచి ఇక్కడ వరకు వివరింపబడినది.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-49-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org