ఆచార్య హృదయం – 94

ఆచార్య హృదయం

<< చూర్ణిక 93

చూర్ణిక  94

అవతారిక
ఇక మీద “ఆళ్వార్ల ప్రభావమునకు గల కారణము ఏమి?” అన్న ప్రశ్నకు సమాధానముగా “దీనికి గల కారణము – భగవానుని నిర్హేతుక కృప” అని నాయనార్లు చెప్పుచున్నారు. ఈ చూర్ణికలో ఆళ్వార్ల పూర్వ స్థితి, ఈ విధముగా ఆళ్వారు ఈ లోకమును ఉద్ధరించుటకు ఏ విధముగా అనుగ్రహింపబడ్డారు మరియు భగవానుని వల్ల ఆళ్వారు ఎలా అనుగ్రహింపబడ్డారు అనునవి వివరింపబడ్డాయి.

చూర్ణిక
ఇతుక్కు హేతు ఊళితోఴుమ్ శోమ్బాతు ఒన్ఴి ప్పొరుళెన్ఴు అళిమకిళ్ న్దు ముత్తుమాయ్ నిన్ఴు నూలురైత్తు యోకుపుణర్ న్దు కణ్ కాణ వన్దు ఆళ్ పార్ క్కిఴవన్ ఉలకినతు ఇయర్వై నల్ వీడు శెయ్య ఇణక్కు ప్పార్వైత్తేడి కళఴల జ్ఞానమ్ ఉరువిన ముళుతుమ్ ఓట్టిన పెరున్గణ్ ఎన్గుమ్ ఇలక్కత్తు అన్బొడు నోక్కాన తిశైయిలే ఆక్కైయిల్ పుక్కు ఉళన్దు మాఴిప్పడన్దు తుళన్గుగిఴవర్ మేలే పడప్ పక్క నోక్కఴప్ పణ్ణిన విశేష కటాక్షమ్

సంక్షిప్త వ్యాఖ్యానము
దీనికి గల కారణము – ఇక మీద వివరింపబోవు అనేక పాశురములలో చెప్పబడిన భగవానుని విశేష కారుణిక కటాక్షము

వ్యాఖ్యానము

ఇతుక్కు హేతు –
ఆళ్వార్ల గొప్పతనమునకు గల కారణము

ఊళితోఴుమ్ శోమ్బాతు ఒన్ఴిప్ పొరుళ్ ఎన్ఴు అళి మకిళ్ న్దు –
తిరువాయిమొళి 10.7.9 “ఊళి తోరుమ్ తన్ ఉళ్ళే పడైత్తు” (లోకములను సృజించు వాడు) అనియు పెరియ తిరువందాది 18 “శోమ్బాతు ఇప్ పల్లురువై యెల్లామ్ పడర్విత్త”(వెనకడుగు వేయకుండా అనేక విధములగు దేవ, మనుష్యాది స్వరూపములను సృజించి) అనియు తిరువాయిమొళి 3.9.10 “ఒన్ఴి ఒన్ఴి ఉలగమ్ పడైత్తాన్” (ఎంతో జాగురూకుడై మనస్ఫూర్తిగా ప్రతి సృష్టిలోనూ ఈ లోకమును సృజించిన వాడైన) అనియు తిరువాయిమొళి 2.10.11 “పొరుళ్ ఎన్ఴు ఇవ్వులగమ్ పడైత్తవన్” (తన భక్తులతో చెలిమిని పొందు ఫలము కొరకు లోకమును సృజించిన ఎమ్పెరుమానుడు) అనియు తిరువాయిమొళి 3.4.8 “అళి మకిళ్ న్దులగమ్ ఎల్లామ్ పడైత్తు” (కాపాడుటకు అనుకూలముగా ఈ లోకములను సృజించెను) అని చెప్పినట్టు ఎలా అయితే ఒక రైతు తన శ్రమ వృధా అవుతుందని తెలిసినప్పటికీ వెనకడుగు వేయకుండా తన ప్రయత్నములను కొనసాగించునో అదే విధముగా భగవానుడు కూడా ప్రతీ కల్పములో తాను అనుకున్న ఫలమును పొందినప్పటికీ బాధ పడకుండా సృష్టి చేయుచూ తాను తదేకముగా సృష్టి కార్యమును కొనసాగిస్తూ గొప్ప ఆశతో “ఏదోక రోజు మేము పొందవలసిన ఫలితములను పొందెదము” అని తలచి తాను సంకల్పించి చేయు శ్రమకు తృప్తి పడును.

ముత్తుమాయ్ నిన్ఴు –
తిరువాయిమొళి 7.6.2 “నిల నీర్ ఎరి కాల్ విణ్ ఉయిర్ ఎన్ఴివై తామ్ ముదలా ముత్తుమాయ్ నిన్ఴ” (పంచ భూతములు అయిన పృధివి, జలము, అగ్ని, వాయువు మరియు ఆకాశముతో ఆరంభమగు అన్ని వస్తువులు మరియు ప్రాకృతిక శరీరములను కలిగిన అన్ని జీవరాశులను తన రూపముగా ఉన్న భగవానుడు అన్ని వస్తువులలో తాను ప్రవేశించి వాటి ఉనికిని కాపాడుటకై ఒక నామముని ధరించి(కలిగి), ప్రవ్రుత్తి, నివృత్తులను చేయు సత్తాని కలిగించి వాటిలో ఉంటూ ఆ వస్తువులను సూచించు నామములతో పిలువబడుతూ తానూ ప్రవేశించి తైత్తిరీయ ఉపనిషత్తు “తత్ సృష్ఠ్యా తదేవానుప్రావిశాత్” (అన్ని వస్తువులను తాను సృజించి వాటిలో తాను ప్రవేశించెను) అని చెప్పినట్టు

నూలురైత్తు –
పెరియ తిరుమొళి 11.4.8 “అన్నమదాయిరున్దు అన్గఴనూల్ ఉరైత్త” (హంస వలె భగవానుడు ధర్మ శాస్త్రమును ఉపదేశించెను) అని చెప్పినట్టు ఎమ్పెరుమానుడు తన గొప్పతనమును తగ్గించుకొని ఆచార్యుని ఆరాధించుటకు సంసిద్ధులుగా లేని వారిని కోల్పోకుండా ఉండేందుకు తెలియవలసిన ధర్మమును బయలుపరుచు శాస్త్రమును హంస వలె ఉపదేశించెను.

యోగు పుణర్న్దు-
తిరువాయిమొళి 3.10.2 “కుఴైవిల్ తడమ్ కడల్ కోల్ అరవేఴిత్ తన్ కోలచ్ చెన్దామరైక్కణ్ ఉఴైబవన్ పోల ఓర్ యోగు పుణర్ న్ద ఒళి మణి వణ్ణన్” (ఎమ్పెరుమానుడితో కలసి ఉండుట వలన పూర్ణత్వమును పొందిన విశాలమైన సముద్రమునందు (శయనించుటకు) బలిష్ఠుడైన ఆదిశేషుని పైన ఎక్కి తన యొక్క సుందరమైన ఎర్ర తామర వంటి నేత్రములను మూసుకొని నిద్రిస్తున్నట్లు నటిస్తూ తన అపారమైన దివ్య స్వభావమును మరియు జగద్రక్షణను ధ్యానిస్తూ (తలచి) ఉన్నట్టి ఎమ్పెరుమానుడు) అని చెప్పినట్టు తిరుప్పార్కడల్ (పాల సముద్రములో) ఆదిశేష అను శయ్య పైన ఎక్కి సౌఖ్యము వలన నిద్రపోవు వాడివలె జగద్రక్షణమునకు ఉపాయమును ఆలోచించుచూ,

కణ్ కాణ వన్దు –
ఆలోచించు పద్ధతుల ప్రకారము తిరువాయిమొళి 3.10.6 “తుయరిన్ మలియుమ్ మనిశర్ పిఴవియిల్ తోన్ఴిక్ కణ్ కాణ వన్దు” (దుఃఖభూయిష్టమైన మనుష్య జన్మమున కంటికి కనబడకుండా వచ్చి) అని చెప్పినట్టు కఠోపనిషత్తు “న చక్షుషా పశ్యతి కశ్చనైనమ్” (మాంసపు చక్షువులతో ఆ సర్వేశ్వరుని ఎవరూ చూడలేరు) అనియు “న మాంస చక్షుషాభివీక్షతే తమ్” (మాంసపు నేత్రములతో ఆ సర్వేశరుని చూడలేరు) అనియు పెరియ తిరువందాది 28 “కట్కణ్ణాల్ కాణాద అవ్వురవై” (మాంసపు నేత్రములతో చూడలేని రూపము) అని చెప్పినట్టుదుఃఖాదికమైన మానవ జన్మమున తాను అవతరించి వారి మాంసపు నేత్రములకు దర్శనము అయ్యేట్టు వేంచేసి

ఆళ్ పార్ క్కిఴవన్ –
ఈ విధముగా తన అవతారములు మొదలగు వాటితో నాన్ముగన్ తిరువన్దాది 60 “ఆళ్ పార్తు ఉళితరువాయ్” (నా అధీనములో ఉండు వాడు నాకు దొరకునా? అని వెతుకువాడు) అని చెప్పినట్టు “నాకు దాసుడు కాగలవాడు ఎవడైనా ఉన్నాడా? అని దీనినే ఉద్యోగముగా (ప్రధానమైన పనిగా) వెతుకుతూ తిరుగువాడు అయినట్టి ఎమ్పెరుమానుడు.

ఉలకినతు ఇయర్వై నల్ వీడు శెయ్య –
తిరువాశిరియమ్ 6 “ఓ ఓ ఉలగినదియల్వే” (లోకము యొక్క తీరు ఎంత చెడ్డది!) అని చెప్పినట్టు సత్యమును జయించినవాడు ఈ లోకము యొక్క తీరును చూసి సహించలేక వీటి వాలన దుఃఖమును పొందును –
– బిడ్డకి జన్మనిచ్చిన తల్లి ఉండగా పీటను బిడ్డగా భావించి స్నానము చేయించు వారి వలె సృజించి రక్షించు వాడైన ఆ సర్వేశ్వరుడు ఉండగా ఆతనిని మరచి మనుషులు మేక, బిడ్డ, మద్యము మొదలగు వాటిని క్షుద్ర దేవతలకు కానుకగా ఇచ్చి పూజించి తద్వారా ఇతర జీవులకు బాధను కలిగించెదరు.
– ఆ కారణము చేత అది దుఃఖముతో కూడిన సుఖమును ప్రసాదించి అనాదియై దాటుటకు సాధ్యము కానిదైనట్టి ప్రాకృతిక సంబంధము వలన సంసారమున జన్మ మృత్యువుల నుంచి ఉపశమనము కలిగించనిదై
– అనేక విధములుగా ఉంటూ తప్పించుకొనుటకు వీలు కానట్టిది అయిన శబ్ద సుఖముల వలన కలుగు దుఃఖములలో మునిగి

తిరువిరుత్తం 95 “యాదానుమ్ పత్తి నీన్గుమ్ విరదత్తై నల్ వీడు సెయ్యుమ్” (ఎదో ఒక విషయమును(ప్రాకృతిక) ఆశ్రయించి, భగవద్విషయమును విడిచిపెట్టు గట్టి సంకల్పమును విడిపించినట్టి వాడు) అని చెప్పినట్టు ప్రకృతిలో ఏదో ఒక దానిని ఆశ్రయించి తనను విడిచిపెట్టటమే స్వభావముగా కలిగిన సంసారి చేతనుడు ఆ పట్టుదలను విడిచేలా చేసి అన్నట్టు

ఇణక్కు ప్పార్వైత్తేడి –
జంతువులను పక్షులను వేటాడు వాడు ఎలా అయితే వాటిని వేటాడుటకు అవే జాతికి చెందిన బాగా నేర్చిన పక్షులు జంతువులను ఎరగా చూపించి వేటాడునో అదే విధముగా భగవానుడు కూడా ఆలా చేయుటకు తగిన వారు ఎవరైనా ఉన్నారా? అని వెతికి

కళఴల జ్ఞానమ్ ఉరువిన ముళుతుమ్ ఓట్టిన పెరున్గణ్ –
తిరువిరుత్తం 58 “కళఴలమ్…” (ఒక శ్రీపాదముతో కొలిచే సరికి లోకమంతా ఆ పాదము కిందకి వచ్చేసింది, ఇంకొక శ్రీపాదము పెరిగి ఆకాశమును చేరి ఊర్ధ్వ లోకాలకు వ్యాపించి క్రింద ఉన్న లోకాలకు, నీడను ఇచ్చింది. లోకమంతా సంచరిస్తూ తేజోమయమైన ప్రకాశించు జ్ఞానమును కలిగి బురదలో వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు కల కృష్ణుడు నా విషయములో కొలవడము ఏమిటి?) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుని ఒక శ్రీపాదమే భూమిని మొత్తము ఆవరించింది. ఇక భూమి మీద ఎంత మాత్రము చోటు లేక అనాదియైన సహజ సంబంధము ఆధారముగా అందరూ ఎల్లప్పుడూ ఆ శ్రీపాదము యొక్క ఆశ్రయమును పొంది దాని నీడను పొందేందుకు వీలుగా మరొక శ్రీపాదము ఊర్ధ్వ లోకములకు వ్యాపించినది. “విస్తృతమైనట్టి అంతటా ప్రవేశించి వికసించియున్నట్టి జ్ఞానము అనబడు ప్రకాశమానమగు దీపమును కలిగి ఉన్నవాడు” అని చెప్పినట్టు తామర వంటి పాదములు వికసించియున్నట్టి ప్రకాశించుచున్న తామర పువ్వు వంటి పెద్ద నేత్రములు అని చెప్పబడినట్టి తిరు నేత్రములు.

ఎన్గుమ్ ఇలక్కత్తు –
ఆ కంటికి సరితూగిన వారు ఎవ్వరూ కనిపించకపోవడము చేత అదే సమయములో ఎవరినైనా ఒకరిని ఆ కంటి చూపు పడుటకు లక్ష్యముగా అయ్యేట్టు చూడటము

అన్బొడు నోక్కాన తిశైయిలే ఆక్కైయిల్ పుక్కు ఉళన్దు మాఴిప్పడన్దు తుళన్గుగిఴవర్ మేలే పడ –
పెరుమాళ్ తిరుమొళి 1.10 “అన్బొడు తెన్ తిశై నోక్కిన పళ్ళి కొళ్ళుమ్” (దక్షిణ దిక్కుకేసి ప్రేమగా చూస్తూ శ్రీరంగము కోవెలలో ఎమ్పెరుమానుడు శయనించి ఉన్నాడు) అని చెప్పినట్టు ఎమ్పెరుమానుడు శయనించి విభీషణాళ్వానుని ప్రేమతో చూడటము వలన సహజముగా పల్లముగా ఉన్న దక్షిణ దిక్కున ఉన్న నమ్మాళ్వార్ల పైన ఆ కటాక్షము ప్రశరించినది. జాతి, కుల నియమములు ఏవి లేకుండా కర్మానుగుణముగా ఏదైనా ఒక శరీరమును పొంది ఆ శరీరము అనుసరించు దారిలో వెళ్లి జన్మపరంపరలో ఒకటి విడిచి మరొక దానిని స్వీకరించు క్రమములో కష్టమును లెక్కించక దానిలో మునిగి దరికి చేరనట్టి సంసార సాగర మధ్య ఉండి భయముతో నమ్మాళ్వార్లు వణికిపోతున్నారు. తిరువిరుత్తం 95 “యాదానుమ్ ఓర్ ఆక్కయిల్ పుక్కు” (ఏ శరీరమునైన స్వీకరించుట)అనియు తిరువాయిమొళి 3.2.1 “ఆక్కయిన్ వళి ఉళల్వేన్” (శరీరము పోవు మార్గములలో వెళ్లి నేను బాధపడుతున్నాను) అనియు తిరువాయిమొళి 2.6.8 “మాఴి మాఴిప్ పల పిఴప్పమ్ పిఴన్దు” (ఎన్నెనో విధములుగా జన్మించి) అనియు తిరువాయిమొళి 3.2.2 “పన్మా మాయప్ పిఴవియిల్ పడిగిన్ఴ యాన్” (అందమైన ఈ ప్రకృతిలో మనుష్య, దైవ వంటి అనేక రూపములను స్వీకరించి మంచి దశలో బతుకుతున్నాను) అనియు తిరువాయిమొళి 5.1.9 “పిఴవిక్ కడలుళ్ నిన్ఴు నాన్ తుళన్గ” (సంసార సాగరము మధ్యలో ఉండి నేను వణుకుచున్నాను).

పక్క నోక్కఴప్ పణ్ణిన విశేష కటాక్షమ్ –
ఈ విధముగా ఆళ్వార్ల పైన ప్రసరించిన కటాక్షము అంతయూ ఆళ్వార్ల వైపే పూర్తిగా చేరి తిరువిరుత్తం 45 “నమ్మేల్ ఒరున్గే పిఴళ వైత్తార్” (వరాహ పెరుమాళ్ళు తన దివ్య నేత్రములను పూర్తిగా నా మీదే ఉంచాడు) పిరాట్టిమార్లు తమ స్తనములతో హత్తుకొనిననూ తాను వారిని చూడకుండా తిరువాయిమొళి 2.6.2 “పక్కమ్ నోక్కు అఴియాన్” (ఇంక ఎటు వైపూ చూడక) అనగా తన యొక్క సంకల్పము చేత చూపబడిన విశేష నిర్హేతుక కృప శ్రీ పాంచరాత్రము “నాసౌ పురుషకారేణ నచాప్యన్యేన హేతునా కేవలమ్ స్వేచ్ఛయైవాహం ప్రేక్షేకంచిత్కదాచన”(నేను నా ఇష్టముతోనే ఒకరిని కటాక్షించుచున్నాను. ఈ విధముగా కటాక్షించుట అనునది పురుషకారము వలన కానీ వేరొక కారణము వలన కానీ కాదు) అనియు శ్రీ పాంచరాత్రము “నిర్హేతుక కటాక్షేణ మదీయేన మహామతే ఆచార్య విషయీకారాత్ ప్రాప్నువంతి పరమామ్ గతిమ్” (ఓ గొప్ప బుద్ధి కల వాడా! ఆచార్య స్వీకారము అను గొప్ప స్థితిని నా యొక్క నిర్హేతుక కటాక్షము వలన పొందుచున్నారు) అని చెప్పినట్టు

స్వేచ్ఛతో చూపినట్టు విశేష కటాక్షము “ఇదుక్కు హేతువు .. ఇప్పడిప్ పణ్ణిన విశేష కటాక్షం” అనునది పూర్వ వాక్యముతో అన్వయించుకొనాలి. అందుచేత ఇంతక ముందు చెప్పబడిన ఆళ్వార్ల వైభవము స్పష్టముగా బహిర్గతమైనది. దీనితో ఇంతక ముందు చూర్ణికలో పేర్కొనబడిన ఆళ్వార్ల స్వభావమునకు గల వివిధ కారణములు నివృత్తి కాబడి మరియు “అనన్తమేల్ పుణ్ణియన్గళ్ పలిత్తవర్” (భగవానుని కటాక్షము సిద్ధింపబడిన వారు) అను కారణమే అసలైన కారణము అని స్పష్టమైనది.

అడియేన్ పవన్ రామానుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-94-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment