వార్తామాలై – ఆరవ భాగం (వార్తై 17)

శ్రీ:     శ్రీమతే శఠకోపాయ నమః    శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః    

పూర్తి శ్రేణి

<< పూర్వపు భాగం 

శ్రీ నంపిళ్ళై కాలక్షేప గోష్ఠి – శ్రీ పిన్బళగియ పెరుమాళ్ జీయర్ (ఎడమ ప్రక్క నుండి రెండవ వారు)

పిన్బళగియ పెరుమాళ్ జీయర్, ఒక సన్యాసి మరియు  నంపిళ్ళై యొక్క సత్‌శిష్యులు. ఆయన తమ ఆచార్యులకి అత్యంత భక్తిశ్రద్ధలతో సేవ చేస్తూ, ఆచార్యుని తిరుమేని కైంకర్యంలో నిమగ్నమై ఉండేవారు. ఆయనకు ఉన్న ఆచార్య భక్తి, మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్ పట్ల చూపిన భక్తికి, అలాగే వడుగ నంబి ఎంబెరుమానార్ పట్ల చూపిన భక్తికి సమానమైనది.

నంపిళ్ళై వరకు వచ్చిన పూర్వాచార్యుల జీవిత చరిత్రలను ఆయన రచించిన 6000 పడి గురుపరంపరా ప్రభావం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. నంపిళ్ళై తరువాత వచ్చిన ఆచార్యులకు సంబంధించిన వివరాలను యతీంద్ర ప్రవణ ప్రభావం అందిస్తుంది. అంతేకాకుండా, అనేక పూర్వాచార్యులు అనుగ్రహించిన ఉపదేశాలను ఆయన ఈ వార్తామాలై అనే గ్రంథంలో సంకలనం చేశారు. ప్రస్తుతం మనం ఈ గ్రంథంలోని ఆ ఉపదేశాలను అనుభవిస్తున్నాము.

ఒక వార్తై కొన్నిసార్లు ఒక చిన్న పదబంధంగా ఉండవచ్చు; కొన్ని వాక్యాలుగా ఉండవచ్చు; లేదా అనేక పేజీల వరకు కూడా ఉండవచ్చు. ప్రతి వార్తైలో మన పూర్వాచార్యులు విపులంగా వివరించిన ఒక తత్త్వం, సిద్ధాంత విషయము లేదా ఒక అంశానికి సంబంధించిన (ఉదాహరణకు అర్థ పంచకం మొదలైనవి) లోతైన అర్థం మరియు వివరణ ఉంటుంది.

ఈ వ్యాస పరంపరలో ఇప్పటివరకు 16వ వార్తై వరకు చూశాము. ఇప్పుడు ఈ వ్యాసంలో తదుపరి వార్తైను కొనసాగిద్దాం.

ముందుగా, ఈ అమూల్యమైన గ్రంథాన్ని మనకు అనుగ్రహించిన పిన్బళగియ పెరుమాళ్ జీయర్ వారి కృపకు మన కృతజ్ఞతలను సమర్పించుకుందాం. వార్తామాలైలో చెప్పబడిన అనేక లోతైన సిద్ధాంత విషయాలు మరియు తత్త్వాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సంస్కృత జ్ఞానం మరియు లోతైన వేదాంత పరిజ్ఞానం అవసరం. అయితే, ఈ గ్రంథాన్ని ప్రచురించిన పుత్తూర్ స్వామి, వాటికి ఎంతో సరళమైన మరియు స్పష్టమైన వివరణను కూడా అందించారు. పుత్తూర్ స్వామి వారి వివరణల వల్లనే మనం ఈ క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోగలుగుతున్నాము.

అందువల్ల, పుత్తూర్ స్వామి వారికి కూడా  కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము.

చివరగా, ఈ గ్రంథంలోని ఉపదేశాలను తమ తమిళ్ కాలక్షేప పరంపర ద్వారా నేర్చుకునే అవకాశాన్ని మనకు కల్పించిన శ్రీ ఉ.వే. సారథి తొతాద్రి స్వామి వారికి  కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము. ఈ వ్యాసం స్వామి వారి కాలక్షేపానికి అనువాదం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, అలాగే ఈ పరంపరను ప్రచురించడంలో నిరంతరం సహాయం చేస్తున్నందుకు స్వామి వారికి ధన్యవాదాలు.

ఇది ఒక దీర్ఘమైన వార్తై. ఇది ఎంగళాళ్వాన్ వారి వార్తైగా పరిగణించబడుతుంది.

అమ్మంగి అమ్మాళ్ అని పిలువబడే ఒక ఆచార్యులు ఉండేవారు. మన సంప్రదాయంలో కొంతమంది ఆచార్యులకు “అమ్మాళ్” అనే విశేషణం ఉంది. వారు స్త్రీలు కాదు; ఎంబెరుమాన్ పట్ల తల్లివంటి అపారమైన ప్రేమను కలిగిన పురుష ఆచార్యులు. అందువల్ల, “అమ్మాళ్” అనునది వారికి గౌరవసూచకమైన బిరుదు.

ఎంగళాళ్వాన్ తిరువెళ్ళరై అనే క్షేత్రానికి చెందినవారు. ఆయన ఆచార్యులు తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్. వారి వద్ద నుండి మన సంప్రదాయాన్ని విస్తృతంగా అభ్యసించారు. అలాగే ఎంబెరుమానార్‌తో కూడా ఆయనకు సన్నిహితమైన సంబంధం ఉండేది.

ఆయనకు మరొక వైభవం  కూడా ఉంది ,  ఆయన నడాదూర్ అమ్మాళ్ వారి ఆచార్యులు. ఈ కారణంగా ఆయనను “అమ్మాళ్ ఆచార్యన్” అని కూడా పిలిచేవారు.

క్రింద 17వ వార్తై మొత్తాన్ని అందిస్తున్నాము. అయితే,  సులభంగా అవగాహన చేసుకోవడానికి వీలుగా దీనిని చిన్న చిన్న భాగాలుగా విభజించాము.

ఎన్గళాళ్వాన్  శ్రీపాదత్తిలే అమ్మంగి అమ్మాళ్‌ చెన్ఱు  దణ్డనిట్టు, ‘అడియేనుక్కు దర్శనమిరుక్కుమ్ పడి అరులిచ్ చేయ ’ ఎన్టు విణ్ణప్పమ్ శెయ్య, ఎన్గళాళ్వాన్నుమ్, ‘దర్శనాన్తరిగళై నిరసిక్కవో? స్వదర్శన స్థాపనమ్ పణ్ణవో? దర్శన మిరుక్కుమ్ పడి కేట్కవో?’ ఎన్టు అరులిచ్ చేయ; ఇవారుమ్ ‘దర్శనాన్తరిగళై నిరసిక్కవుమ్, స్వదర్శన స్థాపనమ్ పణ్ణవుమ్ దేవరీర్ ఎళున్దరుళి ఇరున్దీర్; అదియేనుక్కు దర్శన మిరుక్కుమ్ పడి అరులిచ్ చేయవేశుమ్’ ఎన్నా; ఎంగళాళ్వాన్ అమ్మంగి అమ్మాలుక్కు అరులిచ్‌ చేయ్ధ సారార్థ చతుష్టయమ్.

ఎమ్పెరుమానార్ తిరువడిగళే తన్జమ్ ఎన్టిరుక్కుమ్ నమ్ పూర్వాచార్యర్గళ్, తఙ్గలుక్కుత్ తన్జమాగవుమ్ ఉత్థార్గమాగవుమ్ భోగ్యమాగవుమ్ అనుసన్ధిత్తుమ్, ఉపదేశిత్తుమ్ పోరువదు నాలిరణ్డు అర్థముణ్డు. అవైయావన – స్వరూప జ్ఞానమ్ ఎన్టుమ్, స్వరూప యాథాత్మ్య జ్ఞానమ్ ఎన్టుమ్, విరోధి జ్ఞానమ్ ఎన్టుమ్, విరోధి యాథాత్మ్య జ్ఞానమ్ ఎన్టుమ్, ఫల జ్ఞానమ్ ఎన్టుమ్, ఫల యాథాత్మ్య జ్ఞానమ్ ఎన్టుమ్, ఉపాయ జ్ఞానమ్ ఎన్టుమ్, ఉపాయ యాథాత్మ్య జ్ఞానమ్ ఎన్టుమ్.

ఇదిల్, స్వరూప జ్ఞానమావదు – జ్ఞానానన్ధఙ్గలుమ్ పురవిదళ్ ఎన్నుమ్బడి భగవధనన్యార్హ శేషత్వమే స్వరూపమ్ ఎన్టిరుక్కై. స్వరూప యాథాత్మ్య జ్ఞానమావదు – భగవత్ శేషత్వముమ్ పురవిదళ్ ఎన్నుమ్బడి భాగవత శేషత్వమే స్వరూపమ్ ఎన్టిరుక్కై.

విరోధి జ్ఞానమావదు -పరమభాగవత విశేషత్తిలే నెఞ్జళియాద నినైవు.  విరోధి యాథాత్మ్య జ్ఞానమావదు – వరున్ది ఒరు భాగవదనోడే సమశ్లేషిక్క  త్తొడఙ్గి,  అవన్ పక్కల్ దోష దర్శనమ్ పణ్ణుగై.

ఫల జ్ఞానమావదు – ఒరు భాగవతన్ నియమనత్తై వెఱుత్తల్ పొఱుత్తల్ శెయ్ కైయన్ఱిక్కే , విషయప్రవణనుక్కు పడుక్కైతలైయిల్ విషయపారుష్యమ్ భోగ్యమామాపోలే ఆగిలుమ్ భోగ్యమ్ ఎన్ఱిరుక్కై. ఫలయాథాత్మ్య జ్ఞానమావదు – ఆర్తప్రపత్తియై ప్పణ్ణి అక్కరైప్పడ. ఒరుప్పట్టిరుక్కై చ్చెయ్ తే మాతా పితాక్కళుఙ్గూడ అనాదరిక్కమ్బడియాన ఆర్తియై ఉడైయ శ్రీ వైష్ణవర్గళైక్కణ్డాల్, అవర్గళుడైయ రక్షణత్తుక్కు ఉఱుప్పాక ఇఙ్గే యిరుక్కైయిలే యొరుప్పడుక్కై.

ఉపాయ జ్ఞానమావదు – సమ్బన్ధఙ్ఞానమ్. సమ్బన్ధఙ్ఞానన్దాన్ – సమ్బన్ధఙ్ఞానమెన్ఱుమ్, సమ్బన్ధయాథాత్మ్య ఙ్ఞానమెన్ఱుమ్, సమ్బన్ధ స్వరూపఙ్ఞాన మెన్ఱుమ్, సమ్బన్ధ స్వరూపయాథాత్మ్యఙ్ఞాన మెన్ఱుమ్ నాలువకైయా యరుక్కుమ్. ఇతిల్ సమ్బన్ధఙ్ఞానమావతు – అవనుడైయ నిరుపాధిక శేషిత్వత్తైయుమ్, తన్నుడైయ నిరుపాధిక శేషత్వత్తైయుమ్ తెళియ వఱికై. సమ్బన్ధయాథాత్మ్య ఙ్ఞానమావతు – అవనుడైయ నిరుపాధిక శరీరిత్వత్తైయుమ్ తన్నుడైయ నిరుపాధిక శరీరత్వత్తైయుమ్ తెళియ వఱికై.  సంబంధ స్వరూపజ్ఞానమావదు – అవనుడైయ నిరుపాధిక ధర్మిత్వత్తైయుమ్ తన్నుడైయ నిరుపాధిక ధర్మత్వత్తైయుమ్ తెలియ అరిగై. సంబంధ స్వరూప యాథాత్మ్య జ్ఞానమావదు – ధర్మి  ధర్మఙ్గళినుడైయ  ఐక్యత్తై తెలియ అరిగై; అదావదు – విశిష్ట వేషత్తిలే అవన్ ఒరువనుమేయాయ్ థాన్ ఇల్లైయెన్లలామ్ పడి ఇరుక్కుమ్.

ఉపాయ యాథాత్మ్య ఙ్ఞానమావతు-తన్నిష్ఠై అతావతు – శేషత్వత్తిల్ కర్తృత్వ నివృత్తియుమ్, ఙ్ఞాతృత్వత్తిల్ కర్తృత్వ నివృత్తియుమ్, కర్తృత్వత్తిల్ కర్తృత్వ నివృత్తియుమ్, భోక్తృత్వత్తిల్ కర్తృత్వ నివృత్తియుమ్ పిఱక్కై. శేషత్వత్తిల్ కర్తృత్వమావదు – రాజాశ్రయత్తైయిట్టుజగత్తైప్పీడిక్కుమ్ మన్త్రికళైప్పోలే, భగవదాసక్తియైయిట్టు సదాచారత్తై నెకిళుకై. అదావదు – శబ్దాది విషయస్పర్శత్తిల్ అచ్చముమ్, భగవద్భాగవతకైఙ్కర్య విశ్లేషత్తిల్ ఆర్త్తియుమ్విళైయాతొళుకై; తన్నివృత్తియావదు – ప్రమాధికమాన విషయత్తిలే అచ్చముమ్, ప్రామాదికమాన కైఙ్కర్య విశ్లేషత్తిల్ ఆర్త్తియుమ్ విళైకై. ఙ్ఞాతృత్వత్తిల్ కర్తృత్వమావతు – నామ్ జ్ఞాతావగైయాలే యన్ఱో నమ్మై అవన్ అఙ్గీకరిత్తతెన్ఱు ఎన్టు తన్ జ్ఞానత్తైయిట్టు ఇరుమాక్కై; తన్నివృత్తియావదు – దేహాత్మాభిమానిగళిలుమ్ కడైయాయ్, అచిత్కల్పనాయ్, ముదలళిత్తుక్కొణ్డు అసత్కల్పనాయ్ కిడన్ద ఎన్నై, ఇరుమ్బైప్పొన్నాక్కువారైప్పోలే, కరున్దఱైయిలే పుకున్దు, ఆత్మ ఙ్ఞానత్తై ప్పిఱప్పిత్తు అఙ్గీకరిప్పదే! ఎన్టు కృతజ్ఞనాయ్ పోరుగై.

కర్తృత్వత్తిల్ కర్తృత్వమావదు – నామ్ నిషిద్ధఙ్గళై విట్టు విహితఙ్గళై ప్పత్తుకైయాలేయన్ఱో నమ్మై అవన్ అఙ్గీకరిత్తాన్ ఎన్టు తన్ ప్రవృత్తి నివృత్తియైయిట్టు ఇరుమాక్కై; తన్నివృత్తియావదు – నమ్ వ్యాపారఙ్గళ్ ఒన్ఱుమ్ ఇల్లై, మరప్పావైయైయాట్టువారై ప్పోలే, తానే నిషిద్ధఙ్గళినిన్రుమ్ విడువిత్తు విహితఙ్గళై పత్తువిత్తా నెన్ఱిరుక్కై. భోక్తృత్వత్తిల్ కర్తృత్వమావదు – నామ్ అవనుక్కు అడిమై శెయ్ కిఱో మెన్ఱిరుక్కై; తన్నివృత్తియావదు – తన్ కైయాలే తన్ మయిరైవకిర్ న్దాల్ అన్యోన్యమ్ ఉపకార స్మృతి పణ్ణాతాప్పోలే, అవయవ భూతనాన ఆత్మా అవయవియాన ఎమ్పెరుమానుక్కు అడిమై శెయ్ కిఱాన్ ఎన్ఱిరుక్కై. ఇవర్తఙ్గళ్ ఓరాచార్యన్ అఙ్గీకరిత్త ముముక్షువుక్కు ఙ్ఞాతవ్యఙ్గళ్.

ఇప్పుడు అర్థాన్ని అనుసందానం చేద్దాము.

అమ్మంగి అమ్మాళ్‌ ఎంగాళ్వాన్ శ్రీపాదత్తిలే చెన్ఱు దణ్డనిట్టు, ‘అడియేనుక్కు దర్శనమిరుక్కుమ్ పడి అరులిచ్ చేయ వేశుమ్’ ఎన్టు విణ్ణప్పమ్ శెయ్య,

అమ్మంగి అమ్మాళ్, ఎంగాళ్వాన్ దివ్యచరణాల వద్దకు వెళ్లి నమస్కరించి, “అడియేన్  కు శ్రీవైష్ణవ దర్శన (సిద్ధాంత) విశేషాలు అనుగ్రహించవలసిందిగా” ప్రార్థించారు.

ఎంగళాళ్వాన్నుమ్, ‘దర్శ నాన్తరిగళై నిరసిక్కవో? స్వదర్శన స్థాపనమ్ పణ్ణవో? దర్శన మిరుక్కుమ్ పడి కేట్కవో?’ ఎన్టు అరులిచ్ చేయ;

దానికి ఎంగళాళ్వాన్ కృపతో, “ఇది ఇతర సిద్ధాంతాలను ఓడించడానికా? మన సంప్రదాయాన్ని స్థాపించడానికా? లేక మన స్వంత సంప్రదాయాన్ని గూర్చి వివరంగా తెలుసుకోవడానికా?” అని అడిగారు.

ఇవారుమ్ ‘దర్శనాన్తరిగళై నిరసిక్కవుమ్, స్వదర్శన స్థాపనమ్ పణ్ణవుమ్ దేవరీర్ ఎళున్దరుళి ఇరున్దీర్; అదియేనుక్కు దర్శన మిరుక్కుమ్ పడి అరులిచ్ చేయవేశుమ్’ ఎన్నా;

అప్పుడు అమ్మాళ్ భక్తితో, “దేవరీరులు ఇతర మతాలను నిరసించడానికి మరియు మన సంప్రదాయాన్ని స్థాపించడానికి ఇప్పటికే వేంచేసియున్నారు; అడియేన్ కోరుతున్నది కేవలం మన సంప్రదాయాన్ని గురించిన విశేషాలను తమ ద్వారా తెలుసుకోవడమే” అని బదులిచ్చారు.

ఎంగళాళ్వాన్, అమ్మంగి అమ్మాలుక్కు అరులిచ్‌ చేయ్ధ సారార్థ చతుష్టయమ్.

అప్పుడు ఎంగళాళ్వాన్ అమ్మంగి అమ్మాళ్‌కు అనుగ్రహించిన సారార్థ చతుష్టయము (సారమైన నాలుగు జంటల అర్థాలు). ఇక్కడ ‘సారం’ అనగా మన సంప్రదాయ సారం అని, ‘చతుష్టయం’ అనగా ఇది నాలుగు భాగాలుగా విభజింపబడిందని అర్థం.

ఎమ్పెరుమానార్ తిరువడిగళే తన్జమ్ ఎన్టిరుక్కుమ్ నమ్ పూర్వాచార్యర్గళ్,

ఎంపెరుమానార్‌ (శ్రీరామానుజులు) యొక్క దివ్యచరణాలనే ఎప్పుడూ రక్షణగా ఆశ్రయించియున్న మన పూర్వాచార్యులు…

(గమనిక: ఎమ్బార్ భట్టర్‌తో “నిన్ను నువ్వు గొప్ప విద్వాంసుడిగా భావించవద్దు; ఎప్పుడూ ఎమ్పెరుమానార్ తిరువడి నీడలోనే ఉండు” అని చెప్పారు. భట్టర్ నంజియర్‌తో ఇదే చెప్పారు. ఈ విధంగా అందరు  ఆచార్యులు తమ శిష్యులకు ఎంపెరుమానార్‌ చరణాలనే ఆశ్రయించమని ఉపదేశించారు. అందుకనే ఎంగళాళ్వాన్  “ఎంపెరుమానార్‌ తిరువడియే శరణమనియున్న మన పూర్వాచార్యులు” అని సాయించారు)

తఙ్గలుక్కుత్ తన్జమాగవుమ్ ఉత్థార్గమాగవుమ్ భోగ్యమాగవుమ్ అనుసన్ధిత్తుమ్, ఉపదేశిత్తుమ్ పోరువదు నాలిరణ్డు అర్థముణ్డు.

తమకు రక్షణగా, ఉద్ధరణకు మార్గంగా, మరియు అనుభవించడానికి ఆనందదాయకంగా భావించి, అనుసంధానించి, ఉపదేశించిన ఎనిమిది (నాలారిండు – 4 *2) అర్థాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి.

అవైయావన – స్వరూప జ్ఞానమ్ ఎన్టుమ్, స్వరూప యాథాత్మ్య జ్ఞానమ్ ఎన్టుమ్, విరోధి జ్ఞానమ్ ఎన్టుమ్, విరోధి యాథాత్మ్య జ్ఞానమ్ ఎన్టుమ్, ఫల జ్ఞానమ్ ఎన్టుమ్, ఫల యాథాత్మ్య జ్ఞానమ్ ఎన్టుమ్, ఉపాయ జ్ఞానమ్ ఎన్టుమ్, ఉపాయ యాథాత్మ్య జ్ఞానమ్ ఎన్టుమ్.

అవేవనగా, స్వరూప జ్ఞానం, స్వరూప యాథాత్మ్య జ్ఞానం, విరోధి జ్ఞానం, విరోధి యాథాత్మ్య జ్ఞానం, ఫల జ్ఞానం, ఫల యాథాత్మ్య జ్ఞానం, ఉపాయ జ్ఞానం, ఉపాయ యాథాత్మ్య జ్ఞానం.

ఇదిల్, స్వరూప జ్ఞానమావదు – జ్ఞానానన్ధఙ్గలుమ్ పురవిదళ్ ఎన్నుమ్బడి భగవధనన్యార్హ శేషత్వమే స్వరూపమ్ ఎన్టిరుక్కై.

ఇందులో స్వరూప జ్ఞానం అనగా – జ్ఞానానందాలు కేవలం బాహ్యమైన పొట్టు లాంటివని భావించి, భగవానుడికే ప్రత్యేకించబడిన ‘అనన్యార్హ శేషత్వం’ (భగవంతునికే పూర్తిగా దాసులమై యుండుట) మాత్రమే మన నిజమైన స్వరూపమని తెలుసుకోవడం. (ఇక్కడ ‘అనన్యార్హం’ అనగా కేవలం పెరుమాళ్‌కే చెందడం అని అర్థం).

స్వరూప యాథాత్మ్య జ్ఞానమావదు – భగవత్ శేషత్వముమ్ పురవిదళ్ ఎన్నుమ్బడి భాగవత శేషత్వమే స్వరూపమ్ ఎన్టిరుక్కై.

స్వరూప యాథాత్మ్య జ్ఞానం అనగా – కేవలం భగవత్ శేషత్వం కూడా బాహ్యమైన పొట్టు వంటిదే అని భావించి, భగవద్భక్తులకు (భాగవతులకు) దాసులగుటయే (‘భాగవత శేషత్వమే’) మన నిజమైన పరమ స్వరూపమని లోతుగా గ్రహించడం. తిరుమంగై ఆళ్వార్లు పెరియ తిరుమొళి (8.10.3) లో “నిన్ తిరువెట్టెళుత్తుమ్ కఱ్ఱు – నాన్ ఉఱ్ఱదుమ్ ఉన్ అడియార్క్కు అడిమై”  (అష్టాక్షరీ మంత్రం నేర్చుకున్న తరువాత, నేను నీ భక్తులకే దాసుడనని తెలుసుకున్నాను) అని తెలిపినది దీనికే ఉదాహరణ.

పరమభాగవత విశేషత్తిలే నెఞ్జళియాద నినైవు.

విరోధి జ్ఞానం అనగా – పరమ భాగవతులైన భక్తులకు దూరమవడంలో కలిగే బాధతో మనసు కరిగిపోని స్థితిని కలిగియుండుటయే మనకు అతిపెద్ద ప్రతిబంధకం  (విరోధి) అని గ్రహించడం. (నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి 2.3.10 లో “అడియార్  కళ్ కుళాఙ్గళై – ఉడన్కూడువదు ఎన్ఱుకొలో” – నిత్యసూరుల సమూహంతో ఎప్పుడు కలుస్తానో అని తపించినట్లుగా ఉండాలి).

విరోధియాథాత్మ్య జ్ఞానమావదు – వరున్ది ఒరు భాగవదనోడే సమశ్లేషిక్క  త్తొడఙ్గి,  అవన్ పక్కల్ దోష దర్శనమ్ పణ్ణుగై.

విరోధి యాథాత్మ్య జ్ఞానం అనగా,  ఒక సదాచార సంపన్నులైన శ్రీవైష్ణవునితో స్నేహం సంపాదించుకున్న తర్వాత, ఆ భాగవతుని యందు దోషాలను వెదకడం ప్రారంభించడమే అసలైన శత్రు స్వభావమని (విరోధి అని) అర్థం చేసుకోవడం.

ఫల జ్ఞానమావదు – ఒరు భాగవతన్ నియమనత్తై వెఱుత్తల్ పొఱుత్తల్ శెయ్ కై యన్ఱిక్కే , విషయప్రవణనుక్కు పడుక్కైతలైయిల్ విషయపారుష్యమ్ భోగ్యమామాపోలే ఆగిలుమ్ భోగ్య మ్ ఎన్ఱిరుక్కై.

ఫల జ్ఞానం అనగా,   ఒక భాగవతుడు చెప్పిన ఆజ్ఞను (నియమనాన్ని) విముఖతతో కాకుండా, ఎటువంటి అసహనం లేకుండా స్వీకరించడం. సాధారణ విషయాలలో మునిగిపోయిన వాడికి కష్టమైనది కూడా ఇష్టంగా ఎలా మారుతుందో (ఉదాహరణకు: స్త్రీ-పురుషుల సంబంధంలో సాధారణంగా అసహ్యకరంగా అనిపించే చెమట కూడా ఆనందాన్ని ఇస్తుంది), అదేవిధంగా భగవద్భక్తులకు చేసే కైంకర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ అయిష్టత తో కాకుండా అత్యంత ఆనందదాయకంగా భావించి ఆచరించడమే పరమ పురుషార్థం (ఫలం).

ఫలయాథాత్మ్య జ్ఞానమావదు – ఆర్తప్రపత్తియై ప్పణ్ణి అక్కరైప్పడ. ఒరుప్పట్టిరుక్కై చ్చెయ్ తే మాతా పితాక్కళుఙ్గూడ అనాదరిక్కమ్బడియాన ఆర్తియై ఉడైయ శ్రీ వైష్ణవర్గళైక్కణ్డాల్, అవర్గళుడైయ రక్షణత్తుక్కుఉఱుప్పాక ఇఙ్గే యిరుక్కైయిలే యొరుప్పడుక్కై.

ఫల యాథాత్మ్య జ్ఞానం – ప్రపత్తి మార్గంలో రెండు విధానాలుంటాయి. అందులో ‘ఆర్త ప్రపత్తి’ చేసుకుని, భగవంతుని శరణాగతి పొంది మోక్షం కోసం ఎదురుచూసే సమయంలో, తల్లిదండ్రులు కూడా ఉపేక్షించేంతటి తీవ్రమైన ఆర్తిని (దుఃఖాన్ని/తాపాన్ని) కలిగిన శ్రీవైష్ణవులను ఎవరైనా చూస్తే, వారి రక్షణ కొరకు అవసరమైన సేవలు చేయడానికి ఇక్కడే (ఈ సంసారంలోనే) ఉండిపోవడానికి ఇష్టపడడం.

ఫలయాథాత్మ్య జ్ఞానం,  ప్రపత్తిలో రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి దృప్త ప్రపత్తి. ఇందులో ఒక వ్యక్తి పెరుమాళ్‌కు శరణాగతి చేసి, ఓర్పుతో ఎదురుచూస్తూ, భాగవతులకు కైంకర్యం చేస్తూ, వివిధ దివ్యదేశాలలో కైంకర్యాలను నిర్వహిస్తూ, మోక్షం ప్రసాదించబడే ఆ రోజు కోసం వేచి ఉంటాడు.

మరొకటి ఆర్త ప్రపత్తి. దీనికి నమ్మాళ్వార్ చేసిన ప్రార్థన ఒక ఉదాహరణ. “నేను ఒక్క క్షణం కూడా నీ నుండి విడిపోయి ఉండలేను; దయచేసి నాకు వెంటనే మోక్షాన్ని ప్రసాదించు” అని ఆయన ప్రార్థిస్తారు. 

పొయ్ నిన్ఱ జ్ఞానముమ్ పొల్లా ఒళుక్కుం అళుక్కుడంబుం ఇన్ని న్ఱ నీర్మై ఇనియామ్ ఉఱామై.” అనే పాశురంలో, నిత్యసూరుల స్వామీ! సత్యానికి విరుద్ధమైన జ్ఞానం, తప్పు ప్రవర్తన, అపవిత్రమైన శరీరం మొదలైనవి కలిగించే ఈ జన్మలను ఇక మేము అనుభవించకుండా ఉండాలి. అందువల్ల, నీ దాసుడనైన నా ప్రార్థనను దయచేసి స్వీకరించి, ఈ స్థితి నుండి మమ్మల్ని విముక్తులను చేయాలి అని ప్రార్థిస్తున్నారు.

ఒక శ్రీవైష్ణవుడు ఆర్త ప్రపత్తి చేసి, పెరుమాళ్ పట్ల నిరంతరమైన, తీవ్రమైన విరహ తాపంతో జీవిస్తున్నప్పుడు, అతని తల్లిదండ్రులు కూడా అతనికి సహకరించకపోవచ్చు. అలాంటి సమయంలో, కేవలం పెరుమాళ్ కోసమే జీవిస్తున్న ఆ శ్రీవైష్ణవుడిని రక్షించడం, అతనికి సహాయం చేయడం, అవసరమైతే అతని కోసం తన మోక్ష కోరికను కూడా వాయిదా వేసుకోవడం .  ఇదే ఫల యథాత్మ్య జ్ఞానం.

దీనికి ఉదాహరణ పిన్బళగియ పెరుమాళ్ జీయర్ జీవితంలో కనిపిస్తుంది. ఆయన నంపిళ్ళై శిష్యుడు మరియు సన్యాసి.

ఒకసారి ఆయన అనారోగ్యానికి గురై, మందుల కోసం స్థానిక వైద్యుని వద్దకు వెళ్ళారు. ఆ కాలంలో శ్రీవైష్ణవులు వైద్యుని వద్దకు వెళ్ళి మందులు తీసుకోవడం తక్కువ స్థాయి విషయంగా భావించేవారు. ప్రతి విషయంలోనూ పెరుమాళ్‌పై సంపూర్ణ ఆధారపడాలి, తన శరీరాన్ని తానే రక్షించుకోవడం కూడా ఒక విధంగా తక్కువ స్థాయి భావనగా పరిగణించబడేది.

ఈ విషయం నంపిళ్ళైకు తెలియజేశారు. కొందరు, “బహుశా నంపెరుమాళ్ దర్శనం చేసుకోవడానికి లేదా నంపిళ్ళై యొక్క కాలక్షేపాన్ని కొనసాగిస్తూ వినడానికి ఆయన ఇలా చేసి ఉండవచ్చు” అని అన్నారు.

పిన్బళగియ పెరుమాళ్ జీయర్ వచ్చినప్పుడు, నంపిళ్ళై నేరుగా ఈ విషయం గురించి ఆయనను అడిగారు. అప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు:

“నేను అలా ఎందుకు చేశానో మీకు ఇప్పటికే తెలుసు. అయినప్పటికీ, మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. మీరు, నా ఆచార్యులు, నదిలో స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు, మీ వీపుపై చిన్న చిన్న చెమట బిందువులు ఏర్పడతాయి. నేను మీ వెనుక నడుస్తూ, మీ వీపుకు విసనకర్రతో గాలి వేయడం నా కైంకర్యం. ఆ కైంకర్యాన్ని నిరంతరం కొనసాగించడానికి, నేను వైద్యుని వద్దకు వెళ్లి మందులు తీసుకున్నాను.”

ఆచార్యునికి ఆయన చూపిన భక్తి మరియు కైంకర్య నిష్ఠను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

మణవాళ మామునిగళ్ కూడా ఉపదేశ రత్నమాలైలోని రెండు పాశురాలలో ఇలాంటి ఆచార్యభక్తిని ప్రత్యేకంగా వివరిస్తారు.

ఉపదేశ రత్నమాలై 65వ  పాశురం 

ఆశారియన్ శిచ్చనారుయిరై ప్పేణుమవన్! తేశారుమ్ శిచ్చన్ అవన్ శీర్ వడివై* ఆశైయుడన్ నోక్కుమవనెన్నుమ్ నుణ్ణరివై క్కేట్టువైత్తుమ్! ఆర్కుమ్ అన్నేర్ నిఱ్కై అరిదామ్!! 

మామునులు ఆచార్యుల పట్ల కృతజ్ఞత , ఆధారము వలన శిష్యులు వారిని ఏ విధంగా వదిలి ఉండలేరో సాయించారు..  ఆచార్యుడు శిష్యుని యొక్క విలువైన ఆత్మను తమ ఉపదేశము,అనుష్ఠానముల ద్వారా రక్షిస్తాడు. ఆచార్యుని చేత జ్ఞాన తేజస్సును పొందిన శిష్యుడు తమ ఆచార్యులు “ఎంబెరుమానుచే అభిమానింప బడిన వారని” సర్వదా భావించి ఆచార్యుని తిరుమేని/శరీరమును తన కైంకర్యములచే రక్షింపవలెను. ఈ విశేష విషయము అర్థసహితముగా పెద్దల వద్ద ఉపదేశ పరంపరగా వినినప్పటికినీ, వినుటకు మంచిగా ఉన్నప్పటికినీ, దీని ప్రకారము నడుచుకొనుట చాలా అరుదు. 

పాశురము 64

ఈ పాశురములో ఆచార్యులే ప్రాప్యమని వారిని పొంది వారితో సహవాసము చేస్తూ ఉజ్జీవింపదలచినచో వారిరువురినీ విడదీయు వారెవరూ ఉండరనీ కృపచేయు చున్నారు.

తన్నారియనుక్కు త్తాన్ అడిమై శెయ్ వదు* అవన్ ఇన్నాడుదన్నిల్ ఇరుక్కుమ్ నాళ్! అన్నేర్ అఱిన్దుం అదిలాశై యిన్ఱి ఆశారియనై ప్పిఱిన్దిరుప్పారార్?* మనమే పేశు!!

ఓ మనసా! శిష్యుడు తమ ఆచార్యునికి కైంకర్యములు చేయగలిగిన భాగ్యము ఆచార్యులు ఈ లోకములో ఉన్నంతవరకే అనేది బాగుగా తెలుసుకొనిన మీదట దానియందు ఆశ లేకుండా ఏ శిష్యుడు తమ ఆచార్యుని విడిచి ఉండగలడు? నీవే చెప్పు!

ఆచార్యుడు ఈ లోకములో ఉన్నంత కాలము వరకే ఏ శిష్యుడైనా తన ఆచార్యునికి ప్రత్యక్షముగా/నేరుగా కైంకర్యములు చేయగలడు. ఆచార్యుడు పరమపదము చేరినచో శిష్యుడు నేరుగా తన ఆచార్యునికి కైంకర్యములు చేయు భాగ్యమును కోల్పోతాడు. అందువలన ఆచార్యుడు ఈ లోకములో ఉన్నంత కాలము ఆచార్య కైంకర్యమునందే శిష్యుడు అభినివేశము కలిగి ఉండాలి. మునుపటి పాశురముల వివరణములలో చూపిన ప్రకారముగా మణవాళమామునులు దీనిని సంపూర్ణముగా అనుష్ఠించినారు. మన పూర్వచార్యులందరూ ఆచార్య కైంకర్యము నందు నిష్ఠకలిగినవారే.

పాశురము 66

క్రిందటి పాశురములలోని విషయములకు ఉదాహరణముగా ఎవరైనా ఉన్నారా అని తన మనస్సు అడిగినట్లుగా భావించి దానికి సమాధానము చెప్పుచున్నారు.

పిన్బళగియ పెరుమాళ్ జీయర్ పెరున్దివత్తిల్! అన్బదువు మత్తు మిక్క ఆశైయినాల్* నమ్బిళ్ళైక్కు ఆన అడిమైగళ్ శెయ్ అన్నిలైయై నన్నెజ్ఞే! ఊనమఱ ఎప్పొళుదుమ్ ఓర్!!

పిన్బళగియ పెరుమాళ్ జీయర్ ఆనందదాయకమైన పరమపదము పొందుటకు ఏ మాత్రము కోరుకోక తన ఆచార్యులైన నంబిళ్ళైతోనే ఉంటూ పరమ ప్రీతితో వారికి తగిన కైంకర్యములు చేస్తూ వచ్చారు. విలక్షణమైన ఓ మనసా నీవు అటువంటి స్థితిని ఎటువంటి దోషము లేకుండా తలచుమా!

పిన్బళగియ జీయర్ నంబిళ్ళె ప్రియశిష్యులు. నంబిళ్ళై శిష్యులుగా ఉన్న కాలములోనే వీరు జీయరుగా ఉండి, నంబిళ్ళై తిరుమేని కైంకర్యములు చేస్తుండేవారు. ఒకసారి వీరికి శరీరమునందు ఏదో అస్వస్థత కలుగుటచే వైద్యుని వద్దకు వెళ్ళి ఔషధమును సేవించి, అస్వస్థతను నయము చేసుకున్నారు. శ్రీవైష్ణవులు, అదీకాక సన్యాసి, ఈ విధముగా ఔషధము తీసుకొని శరీరమును బాగు చేసుకొనవచ్చునా అని ఒకరు ప్రశ్నించగా, ఆ సమయమున చాలామంది అనేక కారణములను చెప్పినారు. ఒకరు, వీరికి నంబెరుమాళ్ నందు మనస్సు లేదని; ఇంకొకరు, వీరికి శ్రీరంగమును విడుచుటకు ఇష్టము లేదని; వేరొకరు, వీరికి నంబిళ్ళై కాలక్షేప గోష్ఠిని విడుచుటకు మనస్సు అంగీకరించుట లేదని పలికినారు. నంబిళ్ళై జీయరును పిలిపించి కారణము అడుగగా, వీరు ఇలా చెప్పినారు: “తమ ఆచార్యులైన నంబిళ్ళై కావేరీలో స్నానమాచరించి వచ్చు సమయములో, వారి తిరుమేని నుండి కారే స్వేదబిందువులను సేవించు భాగ్యము ఇక్కడనే కదా ఉన్నది! దానిని విడుచుటకు నా మనస్సు అంగీకరించకనే నేను ఔషధమును సేవించినాను” అని చెప్పి, తమ ఆచార్యుల తిరుమేని యందుగల అభిమానమును, భక్తిని తెలియచేసినారు. దీనినే ఇక్కడ మామునులు కీర్తిస్తున్నారు. నమ్మాళ్వార్లకు మధురకవి ఆళ్వార్ల వలె, ఎంబెరుమానారునకు వడుగ నంబి వలె, వీరు కూడా ఎంతో ఆచార్యనిష్ఠ కలవారు.

ఉపాయ జ్ఞానమావదు 

సంబంధం (భగవంతుడు శేషి – స్వామి, జీవాత్మ శేషభూతుడు – దాసుడు) గురించిన జ్ఞానమే ఉపాయ జ్ఞానము. భగవంతుడే రక్షకుడు, మనం రక్షించబడవలసిన వారము. ఈ సంబంధాన్ని అవగాహన చేసుకోవడమే ఉపాయ జ్ఞానము.

సంబంధ జ్ఞానము నాలుగు విధాలుగా వివరించబడింది:

  1. సంబంధ జ్ఞానమ్ 
  2. సంబంధ యాథాత్మ్య జ్ఞానమ్ 
  3. సంబంధ స్వరూప జ్ఞానమ్ 
  4. సంబంధ స్వరూప యాథాత్మ్య జ్ఞానమ్

1. సంబంధ జ్ఞానమ్ 

సమ్బన్ధఙ్ఞానమ్. సమ్బన్ధఙ్ఞానన్దాన్ – సమ్బన్ధఙ్ఞానమెన్ఱుమ్, సమ్బన్ధయాథాత్మ్య ఙ్ఞానమెన్ఱుమ్, సమ్బన్ధ స్వరూపఙ్ఞాన మెన్ఱుమ్, సమ్బన్ధ స్వరూపయాథాత్మ్యఙ్ఞాన మెన్ఱుమ్ నాలువకైయా యరుక్కుమ్. ఇతిల్ సమ్బన్ధఙ్ఞానమావతు – అవనుడైయ నిరుపాధిక శేషిత్వత్తైయుమ్, తన్నుడైయ నిరుపాధిక శేషత్వత్తైయుమ్ తెళియ వఱికై.

ఇది భగవంతునితో మనకు గల సహజమైన, ఎలాంటి కారణాలు లేని సంబంధం గురించిన జ్ఞానం. ఇతరులతో మనకు గల సంబంధాలు గత జన్మల కర్మల ద్వారా ఏర్పడతాయి కాబట్టి అవి సోపాధికం (కొన్ని నిబంధనలు/కారణాలతో కూడినవి). అయితే, రక్షకుడిగా మనతో భగవంతునికి ఉన్న సంబంధం మాత్రం ఎలాంటి కారణం లేకుండా సహజంగా ఏర్పడినది. “నిరుపాధికం” అనగా ఎలాంటి కారణం లేనిది అని అర్థం. అందువల్ల ఆయన పట్ల మనకు గల దాస్యము కూడా సహజమైనదే, నిర్హేతుకమైనదే.

2. సంబంధయాథాత్మ్య జ్ఞానమ్

సమ్బన్ధయాథాత్మ్య ఙ్ఞానమావతు – అవనుడైయ నిరుపాధిక శరీరిత్వత్తైయుమ్ తన్నుడైయ నిరుపాధిక శరీరత్వత్తైయుమ్ తెళియ వఱికై

భగవంతుడు ఆత్మ, మనం ఆయన శరీరం అనే శరీరి-శరీర సంబంధం గురించిన  యథార్థ జ్ఞానమే ఇది. మన భౌతిక శరీరంతో మనకు గల సంబంధం కర్మ వల్ల ఏర్పడినది, కానీ భగవంతునితో మనకు గల మనకు గల శరీరి-శరీర సంబంధం అలాంటిది కాదు; అది సహజమైనది, నిత్యమైనది. ఈ సంబంధం ఉన్నందువల్లే భగవంతుడికి మనం పరతంత్రులము. ఇది కూడా నిరుపాధిక సంబంధమే,  ఆయన నిరుపాధిక శరీరి, మనం ఆయన నిరుపాధిక శరీరము.

శేషి-శేష, శరీరి-శరీర, ధర్మి-ధర్మ సంబంధాలు

ఆత్మకి, ఎమ్పెరుమాన్ కి ఉన్న వివిధ సంబంధములను, వేరు-వేరు స్థాయిలను వివరంగా, ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. శేషీ- శేషుడు, శరీరీ- శరీరము, ధర్మీ- ధర్మము గురించి వివరిస్తున్నారు.   

ఆత్మకు మరియు ఎమ్పెరుమానుకు మధ్య గల ఈ సంబంధాలన్నీ వివిధ స్థాయిలలో క్రమంగా వివరించబడ్డాయి. మొదట శేషి-శేష, తరువాత శరీరి-శరీర, తదుపరి ధర్మి-ధర్మ సంబంధాలు వివరించబడతాయి.

3. సమ్బన్ధ స్వరూపజ్ఞానమ్

సమ్బన్ధ స్వరూపజ్ఞానమావతు – అవనుడైయ నిరుపాధిక ధర్మిత్వత్తైయుమ్,తన్నుడైయ నిరుపాధిక ధర్మత్వత్తైయుమ్ తెళియవఱికై.

ఇది ధర్మి-ధర్మ సంబంధం గురించిన జ్ఞానం. పువ్వుకు దాని సువాసనకు, వస్త్రానికి దాని తెలుపు ధర్మానికి ఉన్నటువంటి వేరు పరచలేని, విడదీయరాని సంబంధం లాంటిది జీవాత్మకు భగవంతునికి మధ్య గల సంబంధం. ఈ విడదీయరాని తత్త్వాన్ని మన సంప్రదాయంలో  “అపృథక్ సిద్ధం” అంటారు.

తిరుమళిశై ఆళ్వార్లు తమ ”నాన్ముగన్ తిరువన్దాది’7వ పాశురంలో ఈ సంబంధాన్ని ఇలా వర్ణించారు:

“నారణనే నీయెన్నై యన్ఱియిలై / నాన్ఉన్నై యన్ఱి యిలేన్” (ఓ నారాయణా! నీకు కాక నాకు వేరే రక్షకుడు లేడు, నీకు కూడా నన్ను కాక రక్షించుకోవడానికి వేరే వాడు లేడు).

4. సమ్బన్ధ స్వరూపయాథాత్మ్య జ్ఞానమ్ 

సమ్బన్ధ స్వరూప యథాత్మ్యఙ్ఞానమావతు – ధర్మి ధర్మఙ్గళినుడైయ ఐక్యత త్తెళియవఱికై, అతావతు విశిష్ట వేషత్తిలే అవనొరువనుమేయాయ్ తాన్ ఇల్లై యెన్నలామ్బడి యిరుక్కై. 

వివిధ దర్శనములు ఈ సంబంధాన్ని వివిధ విధములుగా వివరించినప్పటికీ, వాస్తవానికి ఇది ధర్మి–ధర్మ సంబంధాన్ని మరింత స్పష్టంగా, గంభీరంగా తెలియజేసే విధానమే. భగవంతునితో అవినాభావ సంబంధమును అనుభవించే స్థితిలో, భగవంతుడే సర్వస్వముగా ప్రకాశిస్తాడు; జీవుని స్వతంత్ర అస్తిత్వ భావనకు అక్కడ తావుండదు. ఎందుకంటే అక్కడ సర్వమూ భగవంతునికే చెందినదిగా, ఆయన అధీనములోనే ఉన్నదిగా అనుభవింపబడుతుంది; జీవునికి స్వతంత్రమైన ప్రాధాన్యము ఉండదు.

[ఈ భావన కొంచెం క్లిష్టమైనది అయినప్పటికీ, క్రింది ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు].

నమ్మాళ్వార్లు తమ తిరువాయ్మొళి (2-9-9)  పాశురంలో మొదట ఇలా అంటారు:

జ్ఞానలేమి వల్ల నేను నాలోనే భ్రమపడ్డాను. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత, నేను కూడా ‘నీవే’ అని, నాదైన సమస్తం (శరీరం మొదలైనవి) కూడా ‘నీవే’ అని తెలుసుకున్నాను.

ఇది చూసి ఆళ్వార్లు అద్వైతం గురించి మాట్లాడుతున్నారేమోనని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆ సందేహం చివరి వాక్యంతో తొలగిపోతుంది, ఎందుకంటే ఆళ్వార్లు పరమపదంలో అందరిచేత కీర్తించబడే స్వామిని సంబోధిస్తున్నారు:

“యానే యెన్నై అఱియకిలాదే యానే యెన్ఱనదే ఎన్ఱు ఇరున్దేన్| యానే నీ యెన్నుడైమైయుమ్ నీయే వానే యేత్తుమ్ ఎమ్ వానవర్ ఏఱే||”

మరొక పాశురంలో (తిరువాయ్మొళి 4-9-10) నమ్మాళ్వార్లు ఇలా అంటారు:

“ఒణ్డొడియాళ్ తిరుమగళుమ్ నీయమే నిలానిఱ్ప| కణ్డ శదిర్ కణ్డు ఒళిన్దేన్ అడైన్దేన్ ఉన్ తిరువడియే||”

ఇక్కడ ఆళ్వార్లు నిత్యవిభూతిలో పిరాట్టి (మహాలక్ష్మి) మరియు ఎమ్పెరుమాన్ మాత్రమే ఒంటరిగా ఉన్న సహచర్యం గురించి మాట్లాడుతున్నారు. దీని అర్థం కూడా ముందు పాశురంలోనిదే. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన సారం ఏమిటంటే, భగవంతుడు సమస్త జీవాత్మలను మరియు అచిత్ పదార్థాలను తన శరీరంగా, తన ప్రకారాలుగా కలిగి ఉన్నాడు. ఈ కోణంలో చూసినప్పుడు ఆయన ఒక్కడే కనిపిస్తాడు. మనం ఆయనను సమీపించి, ఆయన స్వరూపాన్ని బాగా అర్థం చేసుకున్న కొద్దీ, సమస్త జీవాత్మలు మరియు జడ పదార్థాలన్నీ ఆయన శరీరాలే అని గ్రహిస్తాం. కాబట్టి ఆళ్వార్లు నిత్యవిభూతిలో పిరాట్టి మరియు ఎమ్పెరుమాన్ మాత్రమే ఉన్నారని చెప్పినప్పుడు, దాని అర్థం అక్కడ మిగతావారు లేరని కాదు. అక్కడ ఉన్న మిగతావారందరూ వారికి దాసులుగా, నిత్య కైంకర్యంలో నిమగ్నమై ఉన్నారని అర్థం. అనగా, భగవత్ పిరాట్టిల దివ్య ముఖాలపై వికసించే ఆనందాన్ని, తృప్తిని సాక్షాత్కరించుకోవడానికే వారు తమ ఉనికిని కలిగి ఉన్నారు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక లౌకిక ఉదాహరణ తీసుకోవచ్చు. ప్రజలు ఒక రాజుతో “మీరే ఈ రాజ్యము” అని అన్నప్పుడు, రాజు ఒక్కడే రాజ్యమని అర్థం కాదు. ఆ రాజ్యంలో రాజును మించిన ముఖ్యమైన వేరొక వ్యక్తి లేడని, రాజే సమస్త రాజ్యానికి ప్రతినిధిగా నిలుస్తాడని అర్థం. అందువల్ల, ఆళ్వార్లు “యానై నీ, ఎన్ ఉడైయుమ్ నీయే” అన్నప్పుడు, ఆళ్వార్ (ఆత్మ) భగవంతుని శరీరం అని, ఆళ్వార్‌కు చెందిన వస్తువులైన శరీరం, ఇల్లు మొదలైనవి కూడా భగవంతుని శరీరాలే అని అర్థం. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎమ్పెరుమాన్ విశేష్యుడు; సమస్త చిత్–అచిత్ ఆయనకు విశేషణాలు, ప్రకారాలు. ఈ విధమైన విడదీయరాని సంబంధమే ప్రకారమైన జీవాత్మలకు మరియు ప్రకారియైన ఎమ్పెరుమానుకు మధ్య గల ఐక్యత. ఇదే సంబంధ స్వరూప యాథాత్మ్య జ్ఞానము.

5. ఉపాయ యాథాత్మ్య జ్ఞానమ్ 

మూలం:

ఉపాయ యాథాత్మ్య జ్ఞానమావదు – తన్ నిష్ఠై. అదావదు – శేషత్వత్తిల్ కర్తృత్వ నివృత్తియుం, ఙ్ఞాతృత్వత్తిల్ కర్తృత్వ నివృత్తి తుమ్, కర్తృత్వత్తిల్ కర్తృత్వ నివృత్తియుం, భోక్తృత్వత్తిల్ కర్తృత్వ నివృత్తియుం పిఱక్కై.

అర్థం: ఉపాయ యాథాత్మ్య జ్ఞానము అనగా తన నిష్ఠ. అనగా శేషత్వంలో కర్తృత్వ నివృత్తి, జ్ఞాతృత్వంలో కర్తృత్వ నివృత్తి, కర్తృత్వంలో కర్తృత్వ నివృత్తి, భోక్తృత్వంలో కర్తృత్వ నివృత్తి కలగడము.

వివరణ: పైన తెలిపిన విషయాలను అర్ధం చేసుకున్న తరువాత భగవంతుని పట్ల ఏర్పడే చలించని, స్థిరమైన భక్తే ఉపాయ యాథాత్మ్య జ్ఞానము.

కర్త అనగా చేసేవాడు, మరియు “కర్తృత్వం” అనగా “నేనే చేసేవాడిని” అనే అహంభావన. ఈ భావన క్రింది నాలుగు అంశాలలో ఉండకూడదు. ఈ జ్ఞానం నాలుగు రూపాలుగా విభజించబడింది:

  1. శేషత్వంలో కర్తృత్వ నివృత్తి
  2. జ్ఞాతృత్వంలో కర్తృత్వ నివృత్తి
  3. కర్తృత్వంలో కర్తృత్వ నివృత్తి
  4. భోక్తృత్వంలో కర్తృత్వ నివృత్తి

తిరుమళిశై ఆళ్వార్లు తమ నాన్ముగన్ తిరువందాది (23) లో భగవంతుని “పత్తి ఉళవన్” (భక్తులనే పంటను పండించే రైతు) అని సంబోధించారు. ఒక రైతు పొలాన్ని ఏ విధంగా అయితే పొలం దున్ని, విత్తనాలు చల్లి, పంటను పోషించి, కలుపు మొక్కలను తొలగించి, తన ప్రయోజనం కోసం పంటను  కోస్తాడో, అలాగే ఎమ్పెరుమాన్ జీవాత్మను మొదలు నుండి అంతిమ దశ వరకు ఉద్ధరించడానికి అన్నీ తానే చేస్తాడు. ఆయన మనకు ఈ విశ్వంలో జన్మను ప్రసాదిస్తాడు, భక్తిని కలిగిస్తాడు, మన అడ్డంకులను, దోషాలను తొలగిస్తాడు మరియు చివరికి కైంకర్య మార్గంలో నిలబెడతాడు.

అందువల్ల, జీవాత్మ చేసే ప్రతి పనీ పూర్తిగా భగవంతుని కృపపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం స్వతంత్ర కర్తృత్వాన్ని (స్వయంశక్తిని) విడిచిపెట్టి, పూర్తిగా ఆయనపై ఆధారపడి జీవించాలి; మన సొంత ప్రయత్నాలపై ఆధారపడకుండా నిరంతరం ఆయన కృప కై వేచి చూడాలి.

శేషత్వంలో కర్తృత్వ నివృత్తి 

మూలం:

శేషత్వత్తిల్ కర్తృత్వమావదు – రాజాశ్రయత్తైయిట్టు జగత్తైప్పీడిక్కుమ్ మన్త్రీగళైప్పోలే, భగవదాశత్తియైయిట్టు సదాచారత్తై నెకిళుళ్కై.

అర్థం: రాజాశ్రయాన్ని అడ్డంపెట్టుకుని ప్రజలను పీడించే మంత్రుల వలె, భగవదాసక్తిని (భగవంతునితో గల సాన్నిధ్యాన్ని) అడ్డంపెట్టుకుని సదాచారాన్ని (శాస్త్ర మర్యాదలను) కోల్పోవడమే శేషత్వంలో కర్తృత్వం.

వివరణ: భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడని బాగా తెలిసిన తరువాత, ప్రపత్తి (శరణాగతి) ఆచరించిన తరువాత కూడా, మన పూర్వాచార్యులు ఆచరించిన సదాచారాలను, నియమాలను ఎవరైనా విడిచిపెడితే అది శేషత్వంలో కర్తృత్వం అవుతుంది. మనకు భగవంతునితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి మనం ఏమైనా చేయవచ్చు, మనల్ని ఎవరూ ప్రశ్నించలేరు అనే పొరపాటు అభిప్రాయానికి ఇది దారితీస్తుంది. శరణాగతి చేసినవారిని భగవానుడు రాజపుత్రుని వలె చూస్తాడు అని చెబుతారు. అయితే ఈ భావంతో  చేయవలసిన కర్మలను విడిచి పెట్టడం కర్తృత్వం .

అయినప్పటికీ, రాజు తన మంత్రుల తప్పులను తెలుసుకున్న క్షణంలో వారిని శిక్షించడం ఖాయం. అదేవిధంగా, ఒకరు “నేనే ఈ పని చేస్తున్నాను” అనే కర్తృత్వ భావంతో పనులను చేయడం ప్రారంభిస్తే, వారు తమ చర్యలకు తగిన ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. అందువల్ల, శరణాగతి చేసిన తరువాత కూడా మనం శాస్త్రానికి అనుగుణంగా ప్రవర్తించకపోతే, జీవాత్మ తప్పులకు తగిన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శేషత్వంలో కర్తృత్వానికి దూరంగా ఉండాలి (నివృత్తి).

భయము

మూలం:

అదావదు, శబ్దాది విషయస్పర్శత్తిల్ అచ్చముమ్,

అర్థం: శబ్దాది విషయ స్పర్శయందు భయము కలిగియుండుట.

వివరణ: అచమమ్ అనగా భయము. ఇంద్రియ విషయాలైన చూపు, స్పర్శ మొదలైన లౌకిక భోగముల యందు భయము కలిగియుండాలి.

తిరువాయ్‌మొళి  (6-10-10) లో ఆళ్వార్లు తిరువేంకటముడైయాన్ దివ్య తిరువడిలో శరణాగతి చేస్తూ ఇలా ప్రార్థిస్తారు:

“అగలగిల్లెన్ ఇరైయుమ్ ఎన్ఱు అలర్ మేల్ మంగై ఉఱై మార్బా!” (ఓ తిరుమల వాసా! క్షణకాలమైనా నిన్ను విడిచి ఉండలేను).

తనకు మోక్షం లభించిందని భావించి కళ్ళు తెరిస్తే మళ్లీ అదే సంసారం కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఇంద్రియాల పట్ల భయంతో ఇలా రోదిస్తాడు:

“ఉన్నిలావియ ఐవరాళ్ కుమై తిఱ్ఱి” (లోపల శాశ్వతంగా నివసించి అంతర్గత శత్రువులైన ఇంద్రియాలు నన్ను చిత్రహింస పెడుతున్నాయి) – తిరువాయ్‌మొళి  (7-1-1).

అందువల్ల మనకు ఇంద్రియ విషయాల పట్ల ఈ భయం ఉండడం చాలా ముఖ్యం. ఈ భయాన్ని పెంపొందించుకోవడమే సదాచారము. లౌకిక భోగాలకు దూరంగా ఉండడమే మన పూర్వాచార్యులు పాటించిన మతపరమైన నియమం.

భగవత్ భాగవత కైంకర్య విశ్లేషంలో ఆర్తి

మూలం:

భగవత్ భాగవత కైఙ్కర్య  విశ్లేషత్తిల్ ఆర్తియుం విళైయాడొళిగై.

అర్థం: భగవత్ మరియు భాగవత కైంకర్యాలు కలగనప్పుడు  బాధ పడకపోవటం తప్పు.

వివరణ: భగవంతునికి మరియు భాగవతోత్తములకు చేసే కైంకర్యాలకు ఏవైనా ఆటంకాలు కలిగినప్పుడు ఆ బాధను అనుభవించడం మరొక ముఖ్యమైన అంశం. ఈ భావన లేకపోవడం అనేది ఉపాయ యాథాత్మ్య జ్ఞానం లోపించిందని సూచిస్తుంది.

తన్నివృత్తి 

మూలం:

తన్నివృత్తియావదు – ప్రామాదికమాన విషయత్తిలే అచ్చముమ్, ప్రామాదికమాన కైఙ్కర్య విశ్లేషత్తిల్ ఆర్తియుం విళైగై.

అర్థం: ప్రమాద వశాత్తు జరిగే విషయాల పట్ల భయము, మరియు ప్రమాదవశాత్తు జరిగే కైంకర్య విశ్లేషం (కైంకర్య భంగం) పట్ల ఆర్తి (బాధ) కలగడమే తన్నివృత్తి.

వివరణ: ప్రమాదికం అనగా నిర్లక్ష్యం లేదా పొరపాటు. విశ్లేషం అనగా వియోగం/తప్పిపోవడం. దీని అర్థం ఏమిటంటే, అనుకోకుండా పొరపాటున ఏవైనా తప్పులు జరిగినా వ్యక్తిలో భయము కలుగుతుంది. అదేవిధంగా, మన కోరికతో కాకపోయినా కైంకర్యాలకు అంతరాయం ఏర్పడినప్పుడు మనం చింతించాలి.  గత కర్మల కారణంగానే ఆ అంతరాయం జరిగిందని ఇక్కడ మనం గ్రహించాలి. ఈ భావన ఉండడం చాలా ముఖ్యం. మనకు ఈ భావన ఉన్నప్పుడు, శేషత్వంలో కర్తృత్వ నివృత్తి (అహంకార కర్తృత్వ భావన తొలగిపోవడం) మనలో ఉందని అర్థమవుతుంది.

జ్ఞాతృత్వంలో కర్తృత్వ నివృత్తి 

జ్ఞాతృత్వత్తిల్ కర్తృత్వమావదు – నామ్ జ్ఞాతావగైయాలే యన్ఱో నమ్మై అవన్ అఙ్గీకరిత్తతెన్ఱు తన్ జ్ఞానత్తైయిట్టు యిఱుమాక్కై;

అర్థం: “నేను వివిధ శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా భగవంతుని గురించిన జ్ఞానాన్ని సంపాదించాను కాబట్టే భగవంతుడు నన్ను ఆమోదించాడు” అనే గర్వమే జ్ఞాతృత్వంలో కర్తృత్వము.

తన్నివృత్తి 

తన్నివృత్తియావతు, దేహాత్మాభిమానిగళిలుమ్ కడైయాయ్, అచిత్కల్పనాయ్, మొదలళిత్తుక్కొణ్డు అసత్కల్పనాయ్ క్కిడన్దవెన్నై ఇరుమ్బై పొన్నాక్కువారైప్పోలే, కరున్దఱైయిలే పుగున్దు, ఆత్మ ఙ్ఞానత్తై ప్పిఱప్పిత్తు అఙ్గీకరిప్పతే! ఎన్ఱు కృతజ్ఞనాయ్ పోరుగై.

అర్థం: దేహాత్మాభిమానులలో అన్నిటికంటే కడపటివాడిగా, ప్రళయ కాలంలో జడ పదార్థంతో సమానంగా అచిత్ కల్పనగా పడియున్న నన్ను – ఒక రసాయన శాస్త్రవేత్త ఇనుమును బంగారంగా మార్చినట్లు లేదా ఒక రైతు బంజరు భూమిని సారవంతమైన నేలగా మార్చినట్లు – ఎమ్పెరుమాన్ వచ్చి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి అనుగ్రహించాడే! అని కృతజ్ఞతా భావంతో జీవించడమే తన్నివృత్తి.

వివరణ: ఈ కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నప్పుడు, జ్ఞాతృత్వంలో కర్తృత్వం తొలగిపోతుంది.

తిరువాయ్మొళి (5-7-3)  లో ఆళ్వార్లు ఇలా అంటారు:

“పొరుళ్ అల్లాద ఎన్నై పొరుళ్ ఆక్కి అడిమై కొణ్డాయ్” (అసన్నేవ – జడ పదార్థం వలె ఏ విలువ లేని నన్ను “ ఆసన్నేవ” అన్నట్టుగా (అచిత్తు వలె)  మార్చి నీకు దాసునిగా స్వీకరించావు).

కర్తృత్వంలో కర్తృత్వ నివృత్తి 

మూలం:

కర్తృత్వత్తిల్ కర్తృత్వమావదు – నామ్ నిషిద్ధఙ్గళైవిట్టు విహితఙ్గళై ప్పత్తుకైయాలేయన్ఱో నమ్మై అవనఙ్గీకరిత్తానెన్ఱు తన్ ప్రవృత్తి నివృత్తియైయిట్టు ఇఱుమాక్కై.

అర్థం: మనం శాస్త్రాలు నిషేధించినవాటిని విడిచిపెట్టి, విహితమైనవాటిని (ఆచరించవలసినవాటిని) ఆచరించడం వల్లే భగవంతుడు మనల్ని ఆమోదించాడని భావిస్తూ తన ప్రవృత్తి నివృత్తిని బట్టి గర్వపడడమే కర్తృత్వంలో కర్తృత్వము.

తన్నివృత్తి 

మూలం:

తన్నివృత్తియావతు, నమ్ వ్యాపారఙ్గళ్ ఒన్ఱుమ్ ఇల్లై, మరప్పావైయై యాట్టువారై ప్పోలే, తానే నిషిద్ధఙ్గళి నిన్ఱుమ్ విడువిత్తు విహితఙ్గళై పత్తువిత్తా నెన్ఱిరుక్కై.

అర్థం: మన వ్యాపారాలు (ప్రయత్నాలు) ఏవీ లేవు, చెక్క బొమ్మను ఆడించే వాని వలె తానే స్వయంగా మమ్మల్ని నిషిద్ధముల నుండి విడిపించి, విహితమైన వాటిని ఆచరింపజేశాడు అని భావించడమే తన్నివృత్తి.

వివరణ: దీనిని విడిచిపెట్టడానికి, మన చర్యలు మనవి కావు, మనం ఆయన చేతిలోని బొమ్మలమని, ఆయనే మన లోపాలను తొలగించి తన కృపను ప్రసాదిస్తున్నాడని భావించాలి. ఈ వైఖరి స్వయ కర్తృత్వ భావనను తగ్గిస్తుంది.

భోక్తృత్వంలో కర్తృత్వ నివృత్తి 

మూలం:

భోక్తృత్వత్తిల్ కర్తృత్వమావదు, నామ్ అవనుక్కు అడిమై శెయ్ కిఱో మెన్ఱిరుక్కై.;

అర్థం: “నేను భగవంతునికి దాసుడనై కైంకర్యం చేస్తున్నాను” అనే భావన కలిగి ఉండడమే భోక్తృత్వంలో కర్తృత్వము.

తన్నివృత్తి 

మూలం:

తన్నివృత్తియావతు, తన్ కైయాలే తన్ మయిరైవకిర్ న్దాల్ అన్యోన్య ఉపకార స్మృతి పణ్ణాతాప్పోలే, అవయవ భూతనాన ఆత్మా అవయవియాన మ్బెరుమానుక్కు అడిమై శెయ్ కిఱాన్ ఎన్ఱిరుక్కై..

అర్థం: తన చేతితో తనే తన తలవెంట్రుకలను సరిచేసుకున్నప్పుడు వాటి మధ్య పరస్పర ఉపకార స్మృతి లేనట్లుగా, శరీరంలో భాగమైన ఆత్మ, శరీరైక యుక్తుడైన ఎమ్పెరుమానుకు దాస్యము చేస్తున్నాడని భావించడమే తన్నివృత్తి.

వివరణ: మనం జీవాత్మలము ఆయన శరీరము. ఎమ్పెరుమాన్ జీవాత్మల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తాడు. ఒక సరళమైన ఉదాహరణ: మనం మన చేత్తో మన తలవెంట్రుకలను దువ్వుకున్నప్పుడు, ఆ వెంట్రుకలు మనకు “ధన్యవాదాలు” అని చెప్పవు లేదా కృతజ్ఞతాభావంతో ఉండవు. అది ఎటువంటి గుర్తింపును ఆశించకుండా చేసే సహజమైన చర్య. అదేవిధంగా, ఎమ్పెరుమాన్ జీవాత్మలను సాధనాలుగా ఉపయోగించుకుని ఆనందిస్తాడు. అందువల్ల, మనం కైంకర్యం చేసి దానికి ప్రతిఫలంగా ఏదో ఆశించడం తగదు (ఉదాహరణకు: నేను ఇన్ని సేవలు చేసినప్పటికీ నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని ప్రశ్నించడం). బదులుగా, ఎమ్పెరుమాన్ కోరుకున్నాడు కాబట్టే, మనచేత ఆ కైంకర్యం చేయించుకుంటున్నాడని గ్రహించాలి. కాబట్టి ఇది సహజసిద్ధమైనదే తప్ప మనం గర్వపడవలసిన విషయం కాదని తెలుసుకోవాలి.

ముగింపు 

మూలం:

ఇవ్వర్థఙ్గళ్ ఓరాచార్యన్ అఙ్గీకరిత్త ముముక్షువుక్కు ఙ్ఞాతవ్యఙ్గళ్. 

అర్థం: ఈ గంభీరమైన అర్థాలను (సారార్థ చతుష్టయాన్ని) ఆచార్యుల చేత స్వీకరించబడిన ముముక్షువు తప్పక తెలుసుకోవాలి.

ఆళ్వార్ ఎమ్పెరుమానార్ జీయర్ తిరువడిగలే శరణం

జీయర్ తిరువడిగలే శరణం

పిన్భళగియ పెరుమాళ్ జీయర్ తిరువడిగలే శరణం

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్

మూలం – https://youtu.be/LWSRO6H_W1A
ఆడియో – https://1drv.ms/u/s!AnOSadexHn4jhGyqtgfBcJxHCZC2?e=P0dVse

ఆంగ్లంలో – https://granthams.koyil.org/2026/08/15/varthamalai-part-6-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.or

Leave a Comment