చూర్ణిక -99
అవతారిక
ఇక మీద ఆళ్వార్ల భక్తి, కర్మ మరియు జ్ఞాన యోగముల ద్వారా పొందు ఉపాసకుల సాధన భక్తి [భక్తి యోగము] మరియు ప్రపన్నులు భగవానుని ప్రార్ధించడము ద్వారా పొందినదై కైంకర్యమునకు ఉపకరణముగా ఉండు భక్తి కంటే విలక్షణమైనది అని వివరించుచూ మొదట సాధన భక్తి యొక్క స్వరూపమును నాయనార్లు తెలుపుచున్నారు.
చూర్ణిక
జన్మాన్తర సహస్ర నత్తవఙ్గళాలే ఖ్యాతకుళఙ్గళిలే పిఴన్దు ఎళుతి వాశిత్తు తత్త్వజ్ఞరాయ్ కుళిత్తు ఓతి ఉరువెణ్డుమ్ అన్ది ఐవేళ్వి ఆఴుతొళిల్ కళాల్ మిక్కు ఊన్ వాడ ప్పొరుప్పిడై త్తామ్ వరున్ది త్తున్బవినైకళై విడుత్తు వివేక శమాదికళ్ వళర ఎట్టు నీక్కి ఎట్టుమ్ ఇట్టు ఎట్టినాయ పేత పూవిల్ శాన్దొడు తేవకారియమ్ శెయ్ దు ఉళ్ళమ్ తూయరాయ్ వారి ప్పున్బుల అకత్తి నుళ్ ఇళైప్పినై అడైవే విళక్కినైక్కణ్డు యోకనీతి నణ్ణి అఴన్దికళు మఴైయోర్ మనన్ద న్నుళ్ అమర్ న్దుఴైయుమ్ అరుమ్బెరుమ్ శుడరై కణ్గళ్ శివన్దిల్ పడియే మనవుట్కొణ్డు నిరన్దరమ్ మఴవామై తుడక్కఴా స్మృతియాయ్ కనవిల్మిక్క దర్శనసమమాయ్ ఆకత్తుప్పుల్కుమ్ అత్యర్ధ ప్రియమాయ్ వైకుమ్ శిఴప్పువిట్టు కుత్తేవల్ ఎన్నాత అనన్యప్రయోజనమాయ్ వేదనోపాసన సేవాధ్యానాదికళెన్ఴు శొల్లుమతు సాధ్యసాధనభక్తియాక శాస్తృసిద్ధమ్
సంక్షిప్త వ్యాఖ్యానము
వేలకొలది జన్మలలో చేసిన మంచి తపము వలన గొప్ప వంశములలో జన్మించి వ్రాయడము, చదవడము ద్వారా సత్యము తెలిసినవారై పుణ్య స్నానములను ఆచరించి శాస్త్రమును నేర్చి మంత్రములను పఠించి సంధ్యావందమునులు, పంచాగ్నులు, ఆరు క్రతువులను(వేదాధ్యయనము మరియు అధ్యాపనము, తనకోసం ఇతరులకకోసం పూజ చేయడము, దానములు చేసి మరియు అంగీకరించి) చేసి మరియు శరీరమును శుష్కింప చేసి కఠోరమైన తపములను కొండలపైన చేసి పాపములను పోగొట్టుకొని; వివేకము(విచక్షణ) శమ(ఇంద్రియ నిగ్రహము) మొదలగు లక్షణములు వృద్ధి పొంది ఆత్మకు ఉన్న ఎనిమిది అశుభ విషయములను, పాపపు పనులను (ప్రతిచర్యలు) పోగొట్టి ఎనిమిది పుష్పములను సమర్పించి, ఆత్మ తాలూకు ఎనిమిది అంశములను ఆ సర్వేశ్వరుని విషయమున దృష్టి పెట్టి మంచి హృదయమును కలిగి ఇంద్రియములను నియంత్రించి ఆత్మ యొక్క చైతన్యమును దర్శించి యోగములో ఉండి దివ్య జ్యోతి అయిన భగవానుని బుద్ధితో చూసి తిరువాయిమొళి 10.9 “కణ్గళ్ సివన్దు” అన్నట్టు తదేక దృష్టి, స్మృతి, స్వప్నము కంటే స్పష్టముగా గోచరించు దృష్టి కలిగి భగవానునిచే స్వీకరింపబడి, భగవానుని పట్ల ప్రేమతో ఉండుట, భగవానుని కృప ద్వారా మరియు చేతనుని ప్రయత్నము ద్వారా పొందునట్టి ఇటువంటి ప్రక్రియ వేదాంత శాస్త్రమందు వేదన, ఉపాసన, సేవ, ధ్యానముగా చెప్పబడినది.
వ్యాఖ్యానము
జన్మాన్తర సహస్ర నల్ తవఙ్గళాలే –
లగ్వత్రి స్మృతి శ్లోకము “జన్మాన్తర సహస్రేషు తపోజ్ఞాన సమాధిభిః | నారాణామ్ క్షీణ పాపానామ్ కృష్ణే భక్తిః ప్రజాయతే||” (కొన్ని పదుల వేల జన్మలు కర్మ, జ్ఞాన యోగములు ఆచరించిన తరువాత కానీ కృష్ణుని పట్ల భక్తి కలుగదు) అనియు తిరుచ్ఛంద విరుత్తం 75 “ఒన్ఴి నిన్ఴు నత్తవమ్ సెయ్దు ఊళి ఊళి తోఴెల్లామ్” (వేరొక పని లేకుండా కల్పముల కొద్దీ ఎలాంటి ఫలము ఆశించకుండా తపమును ఆచరించుచూ బుద్ధిని మనస్సును లగ్నము చేసి ఆ సర్వేశ్వరుని కల్యాణ గుణములను ఉపాసించుచూ) అన్నట్టు మూడు త్యాగములు (కర్తృత్వ త్యాగము – కర్తను విడుచుట, మమతా త్యాగము – అధికారము విడుచుట, ఫల త్యాగము – ఫలితమును విడుచుట)తో కూడిన సత్కర్మలను భగవానుని ఆరాధనగా వేల కొలది జన్మములలో చేయుట చేత
క్యాతకులన్గళిలే పిఴన్దు –
శ్రీ భగవద్గీత 6.41 “శుచీనామ్ శ్రీమతామ్ గేహే యోగభ్రష్ఠోభిజాయతే” (అటు పిమ్మట గొప్ప కల్యాణ గుణాలను కలిగి స్వచ్ఛముగా ఉండు వారి ఇళ్లల్లో జన్మించి) అనియు శ్రీ భగవద్గీత 6.42 “అతా యోగినామేవ కులే మహతి [భవతి] ధీమతామ్” (అలా కాకుండా (యోగాభ్యాసములో నిష్ణాతులైన తరువాత ఒకడు జారిపోతే) గొప్ప యోగుల వంశములలో వాడు జన్మించును) అనియు స్తోత్ర రత్నము 61 “జనిత్వాహమ్ వంశే మహతి జగతి ఖ్యాతయశాసామ్ శుచీనామ్ యుక్తానామ్ గుణ పురుష తత్వస్తి తివిదామ్” (చిత్, అచిత్ పదార్థముల స్వరూప స్వభావములను బాగా తెలిసి నీతోనే కలిసి ఉండుటకు గల కోరిక కలిగి శుద్ధులై ఈ లోకములో ప్రసిద్ధులైనట్టి గొప్ప వారి తిరు వంశములలో నేను జన్మించినప్పటికినీ) అన్నట్టు సత్యమును మరియు లోకమును గూర్చి జ్ఞానమును కలిగిన పరమ యోగుల(గొప్ప యతుల)గా పేరు పొందిన వారి వంశములలో జన్మించి
ఎళుతి వాసిత్తు తత్త్వజ్ఞరాయ్ –
నాన్ముగన్ తిరువందాది 63 “తెరిత్తెళుది వాసిత్తుమ్ కేట్టుమ్” (నిన్ను ధ్యానించుచూ, వ్రాస్తూ, చదువుతూ(అంతక ముందు వ్రాసినది), వింటూ(అనేక మంది నుంచి) అన్నట్టు భగవద్విషయమును ధ్యానించుట, ఆ అంశము పైన వ్రాయడము, చదవడము, ఇతరుల నుండి వినడము ద్వారా శాస్త్రాన్ని అభ్యసించి సత్యమును గూర్చి జ్ఞానమును కలిగి ఉండుట
కుళిత్తు ఓతి ఊరువెణ్ణుమ్ అన్ది అయివేళ్వి అఴుతొళిల్ గళాల్ మిక్కు –
తిరుమాలై 25 “కుళిత్తు మూన్ఴు అనలై ఓమ్బుమ్” (స్నానము తరువాత మూడు అగ్నులను సమర్పిస్తూ అగ్ని ద్వారా కర్మలను అనుష్ఠించుటకు గల అర్హతను కలిగివుండి) అన్నట్టు ఉపాసనములో భాగము అయిన నిత్య కర్మానుష్ఠానము కొరకు తప్పనిసరైన శరీరమును శుద్ధి చేయు స్నానమును ఆచరించి అనియు ముదల్ తిరువందాది 33 “ఓది ఊరు ఎణ్ణుమ్” (పాశురములను/మంత్రములను పఠించి మరియు వాటిని లెక్కించుట) అనియు పెరియ తిరుమొళి 3.8.4 “అయివేళ్వి” (పంచాగ్నులు) అనియు తిరువేళుకూత్తిరుక్కై “అఴు తొళిల్” (ఆరు రకముల క్రియలు) అన్నట్టు సంధ్యావందనము, గాయత్రి జపము, దేవయజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము మరియు బ్రహ్మ యజ్ఞము అనబడు అయిదు విధముల గొప్ప యజ్ఞములు, అధ్యయనము(నేర్చుట), అధ్యాపనము(బోధించుట), యజన(తన కోసము యజ్ఞము చేయుట), యాజన(ఇతరుల కొరకు యజ్ఞమును చేయుట), దానము మరియు ప్రతిగ్రహము (దానము స్వీకరించుట) అనబడు ఆరు కృతువులు అయిన ఈ నిత్య మరియు నైమిత్తిక కర్మానుష్టానములతో పూర్ణముగా ఉండుట
ఉణ్వాడప్ పొరుప్పడైత్ తామ్ వరున్ది –
పెరియ తిరుమొళి 3.2.1 “ఊన్ వాడ ఉణ్ణాదు ఉయిర్ కావలిత్తు” (ఆహారము స్వీకరించకుండా శరీరమును శుష్కింపచేసి, ప్రాణ వాయువును బంధించి) అనియు మూన్ఴామ్ తిరువందాది 76 “పొరుప్పిడైయే నిన్ఴుమ్ పునల్ కుళిత్తుమ్ అయిన్దు నెరుప్పిడైయే నిఴ్కవుమ్” (మంచు కురువు శీతా కాలములో కొండల మధ్య నిలబడుట, శీతా కాలములో పుణ్య నదులలో స్నానము ఆచరించుట, పంచాగ్నుల మధ్య నిలబడుట) అనియు పెరియ తిరుమాడల్ “వీళ్ కానియమ్ ఊళిలైయుమ్ ఎన్నుమ్ ఇవైయే నుగర్ న్దులమ్ తామ్ వరున్ది” (శరీరమును మాడ్చి పండిపోయి వాటంతట అవే నేల పైన రాలిపోయిన మరియు ఎండిపోయిన ఆకులను తిని) అన్నట్టు నిత్య కర్మ మొదలైనవి ఏ విధమైన లోపము లేకుండా ఆచరించిన తరువాత ఒకడు తపస్సుకు అర్హతను పొంది శరీరాన్ని క్షీణింపచేయుటకు ఆహార వినియోగాన్ని తగ్గించి ప్రాణము నిలబడి ఉండుటకు మాత్రమే అవసరమైనంత స్వీకరించి వేసవి కాలములో కొండ పైన అగ్ని మధ్య నిలబడి శీతా కాలములో చల్లని కొలనులో మునిగి తపస్సు చేస్తూ ఎండిన ఆకులను తింటూ ఈ విధముగా శరీరమును క్షీణింపచేయడము.
తున్బ వినైగళై విడుత్తు –
పైన చెప్పిన కర్మానుష్ఠానములు తిరువాయిమొళి 3.2.8 “మేవు తున్బ వినైగళై విడుత్తు” (వేరు చేయుటకు వీలు కాని దుఃఖములను కలిగించు పాపములను తొలగించి) అన్నట్టు నువ్వు గింజలో ఉండు తైలము వలె ఆత్మకు అంటుకొని ఉండు క్లేశములకు కారణములగు పాపములను తొలగించి తైత్తిరీయ ఉపనిషత్తు “ధర్మేన పాపమపనుధతి” (కర్మానుష్ఠానముల ద్వారా పాపములను నివృత్తి చేసుకొనగలరు)
వివేక సమాధిగళ్ వళర –
ఈ విధముగా “శమధమ నియతాత్మా సర్వభూతానుకంపి” (అంతర్బాహ్య కరణములను అదుపులో ఉంచుకోగల బుద్ధిని కలవాడు అన్ని జీవరాశుల పట్ల దయతో ఉంటాడు) అన్నట్టు వివేక, శమ, ధమ మొదలగు ఏడు అంశములు మనోశుద్ధికి కారణమై విరోధములైన పాపములను తొలగించబడుట ద్వారా వృద్ధి చెందుతాయి.
ఈ ఏడు అంశములలో అనగా వివేక, విమోఖ, అభ్యాస, క్రియ, కల్యాణ, అనవసాధ మరియు అనుద్ధర్శ.
1. వివేకము : – బోధాయన వృత్తి గ్రంధమ జాత్యాశ్రయ నిమిత్త అదుష్టాన్నాత్ కాయ శుద్ధిః వివేకః” – వివేకము అనగా జాతి(రకము), ఆశ్రయ(వాటిని వృద్ధి చేయువారు) మరియు నిమిత్త (ఇతర కారణములు) దోషములు లేని ఆహారమును స్వీకరించుటచే కలుగు మానసిక శుద్ధి. జాతి చేత దోషము కలిగినవి – ఉల్లిపాయ, పుట్టగొడుగు మొదలగు; ఆశ్రయ దోషము కలిగినవి – నిందకు గురైన, పతితులైన మరియు చండాలులు మొదలైన వారి వస్తువులు; ఇక్కడ ఆశ్రయము అనగా ఆ వస్తువు యొక్క యజమానిని సూచించును. నిమిత్త దోషము కలిగినవి – ఇతరులు ఎంగిలి చేసినవి, జుట్టుతో అశుద్ధిని పొందినవి మొదలగు. వివేకము అను పదము పైన చెప్పిన త్రివిధ దోషములు లేని ఆహారమును స్వీకరించుట వలన మనస్సుకు కలిగే స్వచ్ఛతను(శుద్ధతను) పరోక్షంగా సూచించును. వేరొక విధముగా – రాజసిక, తామసిక ఆహారముతో కాకుండా సాత్విక ఆహారముతో వృద్ధి చెందిన శరీర విచక్షణను వివేకము అని అంటారు. శుద్ధి అనగా అశుద్ధము కానిది అని అర్థము. “కాయ్ శుద్ధి” అను పదములో కాయము అనగా బుద్ధి. శృతి(వేదము) అంటే ఛాందోగ్య ఉపనిషత్తు “ఆహార శుద్ధీ సత్త్వ శుద్ధిః” (సత్త్వ గుణమును కలిగిన ఆహారమును స్వీకరించినచో వారి సత్వము శుద్ధి కాబడును) అని ఉద్ఘాటించినది. ఇక్కడ సత్త్వమనగా మనస్సు. శ్రీ భగవద్గీత 16.1 “అభయమ్ సత్త్వ శుద్ధిః” (భయము లేకుండుట, స్వచ్ఛమైన మనస్సు) అనియు శ్రీ భగవద్గీత 17.3 “సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి” (అందరికీ వారి వారి కోరికలను అనుసరించి విశ్వాసము కలుగును) వివరించునప్పుడు సత్వ అనగా బుద్ధి అని శ్రీభాష్యకారులు అనుగ్రహించుయున్నారు. అందుకే ఆచ్చాన్ పిళ్ళై గారు వివేకము అనగా బుద్ధి శుద్ధతకు అన్న శుద్ధి అని కృప చేసినారు.
2. విమోఖము – బోధాయన వృత్తి గ్రంధము “విమోఖః కామానభిష్వింగః” విమోఖము అనగా కోరికల పట్ల అనురాగము లేకుండుట. అభిష్వంగము అనగా ఒకడు సుఖాలను అనుభవించలేనట్టుగా చేసే మార్పు. అది లేకుండా ఉండుటయే అనభిష్వంగము. శ్రీ భగవద్గీత 2.62 “కామాత్ క్రోధోభిజాయతే” (ఆ కోరిక చేత కోపము కలుగును)మొదలగు వాక్యములులో కోపము లేకుండా ఉండుట అనునది కూడా ఇక్కడ వర్తించును.
3. అభ్యాసము – బోధాయన వృత్తి గ్రంధము “ఆరంభణ సమ్ శీలనమ్ పునః పునరభ్యాసః” అన్నట్టు పదే పదే ధ్యానములో ఒక వస్తువును చూచుట. ఆరంభణ అనగా ఆలంబన(నిలుపుట). ఇక్కడ ఆలంబన అనగా శుభాశ్రయము(భగవానుని దివ్య రూపము).
4. క్రియా – బోధాయన వృత్తి గ్రంధము “పంచ మహా యజ్ఞాధి అనుష్టానమ్ శక్తితః క్రియా” , పంచ మహా యజ్ఞము వంటి నిత్య కర్మలు వీలు కుదిరినంత ఆచరించుట.
5. కళ్యాణము – బోధాయన వృత్తి గ్రంధము “సత్యార్జవ దయా దానఅహింసానభిద్యాః కళ్యాణాని”, సత్యము, ఆర్జవము, దయా, దానము, అహింస, అనభిద్య. వీటిలో సత్యము – చేతనుని మంచి కోసము చెప్పబడినది, ఆర్జవము – మనస్సు, వాక్కు, కాయము మంచిగా ఉండుట, దయా – తన పట్ల తనకి అభిమానము లేకుండుట మరియు ఇతరుల బాధను సహించకుండుట, దానము – అత్యాశ లేకుండుట, అహింస – మూడు రకాల ఇంద్రియముల ద్వారా ఇతరులను బాధింపకుండుట అభిద్య – పరుల సొమ్ము తనదిగా భావించుట, మరొక విధముగా ఫలము గూర్చిన ఆలోచన లేకుండుట; ఇతరులు తనకి చేసిన కీడు గురుంచి ఆలోచించుట. అనభిద్య – అట్టి అభిద్య లేకుండుట.
6. అనవసాదము – “దేశ కాల వైగుణ్యాత్ శోకవస్తు ఆది అనుస్మృతేశ్చ తజ్జమ్ దైన్యమ్ అభాస్వరత్వమ్ మనసో అవసాదః” అవసాదము అనగా మనస్సు యొక్క కల్లోల స్థితి, దీనిని దుస్థితి అని కూడా అంటారు. ఇది దెస కాలాల యొక్క చెడు స్వభావము వలన మరియు దుఃఖము, భయమును కలిగించే వస్తువుల స్మరణ వలన కలుగుతుంది. అనవసాదము అనగా అవసాదనమునకు వ్యతిరేకము. శోకవస్తు అనునది అంతక పూర్వము జరిగిన దుఃఖమును కలిగించు సందర్భములు అనగా పుత్రుని మరణము మొదలగు. ఇందులో ఇక ముందు జరగబోవు చెడు సందర్భముల వలన కలుగు భయము కూడా ఉన్నది. అభాస్వరత్వము – దైన్యము అను పదమునకు వివరణము. దైన్యము – కోరుకున్న పనులు చేయలేకపోవడము. భాస్వరత్వమునకు విరోధిగా దీనిని దైన్యమునకు ఒక గుణముగా కూడా చెప్పవచ్చు.
7. అనుద్ధర్ష – బోధాయన వృత్తి గ్రంధము “తద్విపర్యయజాతుష్టి రుద్ధర్షః” అనగా ఉద్ధర్ష లేకుండుట; ఉద్ధర్ష అనగా దేశ, కాల అనుకూలత వలన మరియు కొరతగిన వస్తువుల స్మరణ వలన కలిగినది. అనగా – ఆనందమునకు హేతువు అయినప్పటికీ ఆనందమును పొందకుండుట.
ఇప్పుడు శమము మరియు వివరింపబడుతున్నవి. శమము అనగా అంతరింద్రియములను(మనస్సు) అదుపులో ఉంచుకొనుట. దమము అనగా బాహ్యేంద్రియములను అదుపులో ఉంచుకొనుట. “శమశ్చిత్త ప్రశాంతిస్ స్యాత్ దమశ్చేన్ద్రియ నిగ్రహః” (శమము అనగా మనస్సుని అదుపులో ఉంచుకొనుట; దమము అనగా ఇంద్రియ నిగ్రహము). శ్రీ భగవద్గీత 10.4 “క్షమా సత్యం దమః శమః” (కోపము వచ్చినప్పటికీ క్షమించుట) సత్యమునే పలుకుట, బాహ్యేంద్రియ నిగ్రహము(తుచ్ఛమైన సుఖముల వలన) మనస్సును నిగ్రహించుకొనుట అని వివరించునప్పుడు శ్రీ భాష్యకారులు శ్రీ గీతా భాష్యము “దమో బాహ్య కరణానామ్ అన్తర విషయేభ్యో నియమనమ్ శమః అన్తః కరణస్య తధావిధ నియమనమ్” (ప్రాపంచిక సుఖములలో నిమగ్నులై ఉండకుండా బాహ్య ఇంద్రియములను నిగ్రహముతో ఉంచుకొనుట శమము). ఇవే ఆత్మ గుణములలో అత్యంత ప్రధానమైనవి. బృహదారణ్యక ఉపనిషత్తు 2.4 “తస్మాదేవమ్ విత్ శాంతో దాంతో ఉపరతస్ తితిక్షుః సమాహతో భూత్వా ఆత్మన్యేవాత్మనమ్ పశ్యేత్” (ఈ విధముగా అంతర్, బాహ్యేంద్రియములను నిగ్రహించుకొని అన్నిటి పట్లా విముఖులై, జాగురూకులై ఉన్నవాడు ఆత్మలో పరమాత్మను దర్శించగలడు) ఉపాసనము(భక్తి యోగము)లో ఉన్నవాడికి ఈ రెండే (శమము, దమము) ప్రధానములు అని శృతిలో చెప్పబడినది. ఇదే విధముగా ఇతర శీల గుణముల అర్థములను తెలుసుకొనగలరు. ఈ విధముగా వివేకా మొదలగు, మరియు శమము మొదలగు పెంపొందించుటకు
ఎట్టు నీక్కి –
తిరుచ్ఛన్ద విరుత్తం 114 “ఈనమాయ ఎట్టు నీక్కి” (జ్ఞానాలేమిని కలిగించు అయిదు అంశములు అవిద్యా(తమస్సు), కర్మ(పుణ్య మరియు పాప కర్మలు), వాసనా(ప్రాపంచిక విషయముల తాలూకు గుర్తులు), రుచి(పదే పదే ప్రాపంచిక విషయములలో మునుగుట) మరియు ప్రకృతి సంబంధము(ప్రకృతితో సంబంధము, మన భౌతిక శరీరములు) మరియు మూడు తాపములు(ఆధ్యాత్మికము, ఆది భౌతికము మరియు ఆది దైవికము) తొలగించి) అని చెప్పినట్టు జ్ఞాన సంకోచము ద్వారా ఆత్మలో లోపములను కలిగించు శరీర సంబంధము చేత కలుగు అవిద్య మొదలగు వాటిని తొలగించి. “తున్బ వినైగళై విడుత్తు ?” లో ఇంతక ముందే కర్మ నుండి విడువబడి అనునది చెప్పబడినది కదా? జ్ఞానమును ఆర్జించుటకు పూర్వ కర్మలు విరోధములు అని చెప్పడము చేత ఎటువంటి విరుద్ధమూ లేదు.
వేరొక విధముగా – ఇక్కడ ఆత్మకు హాని చేయు ఎనిమిది అంశములను తొలగించి అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అజ్ఞాన మరియు అసూయ.
– కామ – కోరుకున్న వస్తువును అనుభవించకుండా జీవించ లేని స్థితి
– క్రోధ – ఆ కోరిక నెరవేరకపోవడము వలన చుట్టూ పక్కల వారి పట్ల కలిగే కోపము.
– లోభ – దగ్గరగా ఉన్న వస్తువుపైన కలుగు అత్యాశ
– మోహ – ఏది చేయతగినది ఏది చేయతగనిది అను విచక్షణ లేకుండుట
– మద – కోరిన వస్తువు దక్కడము వలన కలుగు అతి సంతోషము
– మాత్సర్య – ఇతరులు బాగుండుటము చూసి కలుగు అత్యాశను బర్హిర్గతము చేయుట
– అజ్ఞాన – ఇవన్నీ చేయు హానిని ఆలోచించకుండుట
– అసూయ – ఇతరుల మంచి గుణములను దుర్గుణములుగా పరిగణించుట
ఎట్టుమ్ ఇట్టు –
పెరియ తిరుమొళి 1.2.7 “ఇనమలర ఎట్టుమిట్టు” (ఒకే జాతికి చెందిన ఎనిమిది వివిధ పుష్పములను సమర్పించు) అనియు పెరియ తిరుమొళి 3.5.6 “గన్ద మామలర్ ఎట్టుమ్ ఇట్టు”(ఎనిమిది రకాల గొప్ప సుగంధము కలిగిన గొప్ప పుష్పములను సమర్పిస్తాను)అని చెప్పినట్టు అష్టాక్షరిలో ఒక్కొక్క అక్షరము గొప్ప పరిమళమును కలిగిన ఒక్కొక్క పువ్వు వంటిది కావడము చేత ఎవరైతే ఎనిమిది రకాల పుష్పములను ఆయనకు సమర్పించెదరో అదే విధముగా ఒకరు తిరుమంత్రమును(అష్టాక్షరి) ధ్యానింపవలెను. తిరుచ్ఛన్ద విరుత్తం 77 “అవన్ పెయర్ ఎట్టెళుత్తుమ్ ఓదునార్గళ్ వల్లర్ వానమ్ ఆళవే” (ఎవరైతే వారి ఎనిమిది అవయవములతో ఆయనని నమస్కరించి పూజించి ఆతని దివ్యనామమైన తిరువష్టాక్షరిని జపిస్తారో అట్టి వారు పరమపదమును పాలించే సామర్ధ్యమును పొందుతారు) అనియు తిరుచ్ఛన్ద విరుత్తం 78 “ఆర్వమోదు ఇరైన్జి నిన్ఴవన్ పెయర్ ఎట్టెళుత్తుమ్ వారమాగ ఓదువార్గళ్ వల్లర్ వానమ్ ఆళవే”(ఎవరైతే ఆతని దివ్యమైన, ఉత్తరకములైన శ్రీ పాదములను ఎట్టి లోపమూ లేని అత్యంత ప్రేమతో ఆరాధించి, తమ మనస్సులలో ఎట్టి విఘాతమూ లేకుండా ఆ స్వామి యొక్క దివ్యమైన అష్టాక్షరమును పఠిస్తారో అట్టి వారు శ్రీ వైకుంఠమును పరిపాలించు సామర్ధ్యమును కలిగినవారు) అని చెప్పినట్టు
మరొక విధముగా, ఇది ఎనిమిది రకముల పుష్పములైనట్టి అహింసా మొదలగు వాటినిప్రస్తావిస్తున్నది “అహింసా ప్రధమమ్ పుష్పమ్ పుష్పమ్ ఇంద్రియ నిగ్రహః సరవ భూత దయా పుష్పమ్ క్షమా పుష్పమ్ విశేషతః జ్ఞానమ్ పుష్పమ్ తపః పుష్పమ్ ధ్యానమ్ పుష్పమ్ తధైవచ సత్యం అష్టవిధమ్ పుష్పమ్ విష్ణోః ప్రీతికరమ్ భవేత్” (మొట్టమొదటి పుష్పము ఇతర జీవులకి హాని కలిగించేది కాకుండా ఉండడానికి; రెండవ పుష్పము ఇంద్రియ నిగ్రహము కోసము; అన్ని జీవుల పట్ల దయతో ఉండుట మూడవ పుష్పము; ఓర్పు నాల్గవ పుష్పము మరియు శ్రేష్టమైనది; జ్ఞానము అయిదవ పుష్పము; తపము ఆరవ పుష్పము; ధ్యానము ఏడవ పుష్పము; సత్యము ఎనిమిదవ పుష్పము; ఈ ఎనిమిది పుష్పములు విష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రములైనవి) అని చెప్పినట్టు అహింసతో మొదలగు ఎనిమిది రకముల పుష్పములను సమర్పించడము. ఇంతకు ముందు ప్రస్తావించబడిన “వివేక శమాధికళ్” లో కూడి ఉన్నవి ఇక్కడ కూడా చెప్పబడినప్పటికీ, ఇవి ఈశ్వరుని భోగ్యము కొరకు ఆచరించబడుతాయి కాబట్టి (పునరావృత్తి కారణము చేత) ఎట్టి వైరుధ్యమూ లేదు. అందుచేత దీనిని పుష్పములను సమర్పించుట అని చెప్పబడినది.
ఎట్టినాయ్ భేదాప్ పూవిల్ సాందొడు దేవకారియమ్ సెయ్ దు –
తిరుచ్ఛన్ద విరుత్తం 77 “ఎట్టినాయ్ బేధమోడు ఇఴైన్జి”(అష్టాంగ ప్రణామము(ఎనిమిది అవయవములతో సాష్టాంగము చేయుట)తో ఆయనని ప్రార్ధించుట) అన్నట్టు గర్వము లేకుండా సాగిలపడటము, బుద్ధి మరియు మనస్సుకి ఈశ్వరుడినే విషయముగా ఉంచుకొనుట మరియు రెండు పాదములు, రెండు చేతులు తల నేలను తాకుట “మనో బుద్ధి అభిమానేన సహ న్యస్య తరాతలే కూర్మవచ్చతురః పాదాన్ చిరస్ తత్త్రైవ పంచమమ్” (బుద్ధి, మనస్సు, అహంకారము, శిరస్సు, రెండు పాదములు, హస్తములను తాబేలు వలె నేల పైన ఉంచుట) ఐ చెప్పినట్టు. తిరువాయిమొళి 5.2.9 “పూనిల్ పుగైయుమ్ విళక్కుమ్ సాందముమ్ నీరుమ్ మలిన్దు” (పువ్వులు, ధూపము, దీపము, గంధము మరియు నీరు కలిగి ఉండుట) అనియు తిరువాయిమొళి 10.2.10 “సాందొడు మలర్గళ్ నల్ల ఆయన్దు కొణ్డు” (మంచి గంధము, దీపము, ధూపము ఆ స్వామి ఆనందము కొరకే చేయుట) అని చెప్పినట్టు ఫల, సంగ, కర్త్రుత్వమును సూచించు తురై(దుమ్ము), మయిర్(జుట్టు), మరియు పుళు(కీటకం) అను త్రివిధ దోషములు లేకుండా తిరువారాధనమునకు మంచి వస్తువులను అధికముగా సేకరించుట; పెరియాళ్వార్ తిరుమొళి 4.5.1 “దేవ కార్యమ్ సెయ్ దు” (భగవానుని సేవించుట) అని చెప్పినట్టు ఆ భగవానునికి తిరువారాధనమును సమర్పించుట.
ఉళ్ళమ్ తూయరాయ్ –
తిరుచ్ఛన్ద విరుత్తం 75 “ఒన్ఴి నిన్ఴు నత్తవమ్ సెయ్దు ఊళి ఊళి తోఴెల్లామ్ నిన్ఴు నిన్ఴవన్ గుణన్గళ్ ఉళ్ళి ఉళ్ళమ్ తూయరాయ్” (మనస్సుని లగ్నము చేసి ఎమ్పెరుమానుని కల్యాణ గుణములను తదేకముగా ధ్యానిస్తూ ఎట్టి ఫలాపేక్ష లేకుండా నిర్మలమైన హృదయముతో తపస్సు చేయడము) అని చెప్పినట్టు నిత్య కర్మానుష్ఠానముతో మొదలుకొని భగవదారాధనము వరకు రోజు వారీ అనుష్ఠానములను మూడు త్యాగములతో (ఫల, సంగ, కర్త్రుత్వ) చేసి ఆ భగవానుని కల్యాణ గుణముల ధ్యానముతో జ్ఞాన యోగములో నిమగ్నమగుటకు కావాల్సిన యోగ్యతను మరియు పాప రహిత స్వచ్ఛమైన హృదయమును కలిగి ఉండుట.
వారిప్ పున్పుల్వగత్తినుళ్ ఇళైప్పినై అడైయవే విళక్కినైక్ కణ్డు –
“ప్రకీర్ణే విషయారణ్యే ప్రదావన్తమ్ ప్రమాదినమ్ జ్ఞానాన్కుశేన గృహ్ణీయాత్ వశ్యమ్ ఇంద్రియ దన్తినమ్” (విశాలమైన విషయారణ్యమున పరిగెడుతూ దొరికిన వారిని చంపు ఇంద్రియ రూపమగు ఏనుగును త్యాజ్యోపాదేయ వివేక జ్ఞాన రూపమైన అంకుశముతో వశపరుచుకొనినట్టు) అన్నట్టు ఇంద్రియములను జ్ఞానము ద్వారా నిగ్రహించుకొనవలెను. ముదల్ తిరువందాది 47 “వారి సురుక్క మదక్ కళిరు ఐందినైయుమ్ చేరి తిరియామల్ సెన్నిఴ్లి” (మదగజముల వంటి పంచేంద్రియములు; భోగము వంటి నీటిని తగ్గించి శబ్ద, రస, రూప విషయముల వంటి వీధుల యందు తిరగకుండా ఉంచుట)అన్నట్టు ఎలా అయితే మద గజములను జలమును తగ్గించి నియంత్రించినట్టు(నిలువరించినట్టు) ఏనుగుల వంటి ఇంద్రియములకు ప్రాపంచిక విషయ సుఖాలను తగ్గించి నియంత్రించవలెను.
అంతేకాక తిరుచ్ఛన్ద విరుత్తం 76 “పున్ పుల వళి అడైత్తు అరక్కు ఇలచ్చనై సెయ్ దు నన్ పుల వళి తిఴన్దు జ్ఞాన నల్చుడర్ కొళీయై” (శబ్దము మొదలగు ప్రాపంచిక విషయములను గ్రహించుటకు ఇంద్రియములు అనుసరించు హేయమైన మార్గమును అడ్డగించి వాటి తాలూకు వాసన కూడా అనుసరించుటకు వీలు లేనంతగా మూసి ఉంచాలి. అప్పుడు జ్ఞానమనబడు చిచ్చును వెలిగించుటకు సరియైన భగవద్విషయమును ఇంద్రియములు చేరుటకై మార్గమును తెరిచి ఉంచాలి) అన్నట్టు ఒకడు అల్పమైన, క్షణికమైన దోషములను కలిగిన హేయ విషయముల వెంట పడు ఇంద్రియముల మార్గమును అడ్డుకొని అవి హేయములు అని తలచి వాటి వాసనను కూడా పూర్తిగా తొలగించి ఇంద్రియములను భగవానుని ఉత్క్రుష్టమైన విషయములలో నిమగ్నము చేయవలెను. అనగా జ్ఞానము అను దీపమును వెలిగించవలెను.
అనగా శ్రోత్రాది ఇంద్రియములు శబ్దాది విషయముల వైపు పోకుండా లోపలి నుంచి అని చెప్పినట్టు ఇంద్రియ నిగ్రహమును కలవారై అని తిరువెళుక్కూతిరుక్కై “అయిమ్పులన్ అగత్తినుళ్ సెఴుత్తు” (ఇంద్రియములను లోపలే ఉంచి వాటిని నిగ్రహించుకొనుట) అని చెప్పినట్టుగా
తిరుక్కున్దాడ్గమ్ 18 “ఇళైప్పినై ఇయక్కమ్ నీక్కి” లో చెప్పినట్టు
– యోగ సూత్రము “అవిద్యా అస్మిత రాగ ద్వేష అభినివేశః పంచ క్లేశః” (అయిదు రకాల విషాదములు – తమస్సు, గర్వము, కామము, ద్వేషము మరియు అతి ప్రేమ)లో చెప్పినట్టు అయిదు రకముల విషాదములను తొలగించి
– శ్రీ భగవద్గీత 6.11 “శుచౌ దేశే ప్రతిష్టాప్య స్ధిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్చిృతమ్ నాతినీచమ్ చేలాజినకుశోత్తరమ్” (ఒకరు ఒక పవిత్రమైన ప్రదేశములో మరీ ఎత్తుగా కాకుండా మరీ పల్లముగా కాకుండా దృఢమైన(చెక్క మొదలైన వాటితో చేసిన) ఆసనాన్ని స్థిరముగా స్థాపించుకోవాలి. దానిపైన పట్టు వస్త్రము, జింక చర్మము మరియు దర్భ గడ్డిని ఒకదానిపై ఒకటి [వ్యతిరేక క్రమములో అంటే మొదట ఆసనము పై గడ్డి, దానిపై జింక చర్మము ఆ పై పట్టు వస్త్రము]ను పరచాలి.) అని చెప్పినట్టు అట్టి ఆసనము పైన కూర్చుని.
– శ్రీ భగవద్గీత 6.13 “సమమ్ కాయశీరోగ్రీవమ్ ధరయన్ అచలమ్ స్ధిరః సమ్ప్రేక్ష్య నాసికాగ్రం స్వమ్ దిశశ్ చానవలోకయన్”(శరీరము, శిరస్సు, మెడను దృఢముగా కదలకుండా ఉంచి, ఎటు వైపూ చూడకుండా ముక్కు కొన భాగము పైనే దృష్టిని ఉంచి) అని చెప్పినట్టు ఒకడు ఆతని దృష్టిని తన ముక్కు కోన భాగమున ఉంచి[తరువాతి శ్లోకములో]
-ఇంద్రియములను దేని పైనా ఉంచక లోపలే ఉంచి
– ధ్యానించవలసిన ఆ భగవానుని పట్ల భక్తితో తదేకముగా ఆయన గురించే ధ్యానించుచూ
– శాస్త్రములో గుర్తించిన విధానము ప్రకారము ప్రకాశిస్తున్న జ్ఞానముతో తనంత తానుగా ప్రకాశించు ఆత్మ యొక్క సత్య లక్షణమును దర్శిస్తూ
– సత్కర్మలలో నిమగ్నమై పాపముల నుంచి విముక్తుడై
ఈ ప్రక్రియను అనుసరించడము ద్వారా స్వచ్ఛమైన హృదయాన్ని పొందిన వ్యక్తికి భగవానుని దర్శనము కోసము యోగము ద్వారా పొందిన జ్ఞానము మొదట ఆత్మ యొక్క సహజ స్వరూపమును చూచుటకు తద్వారా పురోగతిని సాధించుటకు ఉపకరించును.
“విళక్కినై విదియిల్ కాణ్బార్” అను వాక్యము భగవానుని దర్శించడమే అని మన పూర్వాచార్యులు వివరించినప్పటికీ, భగవానుని ధ్యానించడము, ఆయనని దర్శించడము అనేవి ఒకదాని తరువాత ఒకటి చెప్పబడడము చేత నాయనార్లు దీనిని ఆత్మ విషయములోనే వివరించారని మనము పరిగణింపవలెను. ఇంతక ముందు సూత్రము 23 “విదియిల్ కాణుమ్ ప్రధమ మధ్యమ దశైగళై” లో ఆత్మ యొక్క విషయములోనే కృప చేసియున్నారు. అన్వయ భేదములు ఉండుట సహజమే కదా!
యోగ నీది నణ్ణి –
తిరుచ్ఛన్ద విరుత్తం 63 “యోగనీది నణ్ణువార్గళ్” (ధ్యానము ద్వారా నిన్ను పొందుటకు కోరిక గలవారు) అన్నట్టు యోగము ద్వారా పొందుచున్నారు.
అఴమ్ తిగళు మఴైయోర్ మనన్దన్నుళ్ అమరన్దు ఉఴైయుమ్ అరుమ్ పెరుమ్ సుడరైక్ కణ్గళ్ సివన్దిల్ పడియే మనవుట్కొణ్డు –
భగవానుని తెలుసుకొనుటకు
పెరుమాళ్ తిరుమొళి 1.7 “మఴమ్ తిగళుమ్ మనమ్ ఒళిత్తు వన్జ మత్తియైమ్ పులంగళ్ అడక్కి ఇడర్ బారత్ తున్బమ్ తుఴన్దు ఇరుముప్పొళుదు యేత్తి ఎల్లై ఇల్లాత్ తొల్ నెఴిక్కణ్ నిలై నిన్ఴ తొణ్డరాన అఴమ్ తిగళుమ్ మనత్తవర్ తమ్ గదియై” (తమ మనస్సులలో హేయ గుణములైన హత్య, క్రోధము, హింస, అసత్యము మొదలగు వాటిని వాసనలతో సహా నిర్మూలించుకొని ప్రాపంచిక విషయముల పట్ల పరిగెట్టకుండా ఇంద్రియములను నియంత్రించుకొని విషాదమునకు దారి తీయు కొండంత కర్మను తొలగించుకొని పూర్వులు చెప్పిన గొప్ప మార్గములను వదలకుండా ఇతరుల పట్ల దయ కలిగి ఉంటూ ఎమ్పెరుమానుని నిత్యమూ అయిదు సార్లు ఆరాధిస్తూ ఉన్న ఆ స్వామిని అనుసరించు వారికి ఆయన గొప్ప శరణత్వమును ప్రసాదిస్తాడు) అన్నట్టు హింస, క్రోధము, క్రౌర్యముతో వృద్ధి చెందుతున్నట్టి మనస్సును వాసనతో సహా నిర్మూలించి వంచనను తీసివేసి ఇంద్రియములను ప్రాపంచిక విషయముల వైపుకు వెళ్లకుండా అణిచి ఎక్కువ దుఃఖమును కలిగించు పాపములను నశింపజేసి ఆ భగవానుని మూడు వేళలా స్తోత్రము చేసి అంతక మునుపు మనోస్థితి అయిన ఒకరి వలన ఉద్రేకమును పొందకుండా ఉన్నట్టి శ్రీ వైష్ణవులు అయినవారు ప్రకాశించునట్టి మనస్సుగల వారికి పరమ ప్రాప్యమైనట్టి ఆ సర్వేశ్వరుడు;
బ్రాహ్మణుల యొక్క హృదయములను తనకు నివాస స్థానముగా గల నిత్యసూరి నాయకుడు అని పెరుమాళ్ తిరుమొళి 7.3.7 “మఴైయోర్ మనమ్ తన్నుళ్ విణ్ణుళార్ పెరుమానై” (బ్రాహ్మణుల మనస్సులలో నివసిస్తున్న వైకుంఠాధిపతి) అని చెప్పినట్టుగా ఎటువంటి అపేక్ష లేకుండా నిత్యమూ గొప్ప తాపమును కలిగిన సాధువుల హృదయములలో నివసించు ఆ స్వామి
పెరియ తిరుమొళి 2.1.1 “మాధవ మానవర్ తన్గళ్ సిందై అమర్న్దు ఉఴైగిన్ఴ ఎన్దై” (గొప్ప తపస్సుకు కల వారి హృదయములలో నిత్యమూ నివసిస్తున్న అట్టి ఎమ్పెరుమానుడు నాకు స్వామి)లో చెప్పినట్టుగా ఆభరణములతో అలంకరించబడి అత్యంత ప్రకాశవంతమైన దివ్య మంగళ విగ్రహమును దయతో కలిగిన సర్వేశ్వరుడు
పెరుమాళ్ తిరుమొళి 2.7 “ఆరమార్వన్ అరంగన్ ఎన్నుమ్ అరుమ్ పెరుంజుడర్ ఒన్ఴినైచ్ చేరుమ్ నెన్జినర్”(హారమును వక్షః స్థలమున కలవాడు తేజ స్వరూపుడు అయినట్టి భగవానునితో ఎవరి మనస్సు ఏకమవుతుందో అట్టి వారు) అని చెప్పినట్టు
తిరువాయిమొళి 8.8.1 “కణ్గళ్ సివన్దు” లో చెప్పినట్టు నల్లని మేఘము వంటి దివ్య రూపమును కలిగి అందమైన అవయవములతో ఆయుధములు మరియు ఆభరణములతో ఉన్నట్టి ఎమ్పెరుమానుని జ్ఞానులైన ఋషులు తమ హృదయాలలో నిలుపుకుంటారు అనియు పెరియ తిరుమొళి 7.3.1 “కత్తవల్ తమ్ మనవుట్కొణ్డు” (యుక్తులైన వారి హృదయములలో ఉండు) అని చెప్పినట్టుగా
అట్టి భగవానుని ఈ విధముగా ధ్యానించి
నిరంతరమ్ మఴవామై తొడక్కఴ స్మృతియాయ్ –
విరామము లేని అట్టి ధ్యానము తిరుచ్ఛన్ద విరుత్తం 101 “నిరన్దరమ్ నినైప్పదాగ ” (ఎప్పుడూ అలోచిస్తూ) మరియు మరపు పెరియ తిరుమొళి 3.5.4 “మన్ను సేవడిక్కే మఴవామై వైత్తాయ్” (నీవే నన్ను నీ వద్దకు కృపతో రప్పించుకొని నీ యొక్క శ్రీపాదములను మరువకుండా చేసినావు) అనియు తిరుచ్ఛన్ద విరుత్తం 78 “సోర్విలాద కాదలాల్ తొడక్కఴ మనత్తరాయ్” (తక్కువ తనము లేని ఆప్యాయతతో మరియు ఎట్టి విఘూతము లేని వారి మనస్సులలోని ఆలోచనలలో) అన్నట్టు అన్ని వేళలా ప్రాపంచిక సుఖములలో బంధింపపడకుండా ఉండే ప్రేమతో భగవానుని విశ్లేషము వల్ల దుఃఖము మరియు సంశ్లేషము వల్ల ఆనందముతో ఉండి ఛాందోగ్య ఉపనిషత్తు “సత్వ శుద్ధౌ దృవా స్మృతిః” (మనస్సు స్వచ్ఛమైనచో నిరంతర ధ్యానము కలుగును) అన్నట్టు ఎట్టి విరామము లేకుండా ధ్యానింపవలసిన ఆ భగవానుని నిరంతరమూ ధ్యానించుట.
కనవిల్ మిక్క దర్శన సమమాయ్ –
ఇరణ్డామ్ తిరువందాది 81 “కనవిల్ మిగక్ కణ్డేన్” (ప్రత్యక్షముగా కాకుండా న మనస్సుతో నేను ఆయనని స్పష్టముగా దర్శించాను) అన్నట్టు ఇంద్రియములచే బాధింపపడకుండా మనస్సులో నిక్షిప్తమైన జ్ఞానముతో ఆయనని స్పష్టముగా చూడగలుగుట అనునది ఆయనని సాక్షాత్తుగా దర్శించిన దానితో సమానము. శ్రీభాష్యము లఘు సిద్ధాంతము “సా చ స్మృతిర్ దర్శన సమాకారా” (అట్టి స్మృతి ప్రత్యక్ష సాక్షాత్కారము వంటిది).
ఆగత్తుప్ పుల్గుమ్ అత్యర్త ప్రియమాయ్ –
ప్రత్యక్ష సాక్షాత్కారముతో సమానమైన అట్టి స్మృతి ఒక స్త్రీని ఆలింగనము చేసుకోవడము వంటిది. తిరువాయిమొళి 10.4.6 “నాల్దోఴుమ్ జ్ఞానత్తాల్ ఆగత్తణైప్పార్కు” (తమ హృదయాలలో ఆయనని నింపుకొని భక్తిరూపపన్న జ్ఞానముతో ఆయననే స్మరిస్తూ ఆయనని అనుభవిస్తున్న ముముక్షువులు) అనియు ముదల్ తిరువందాది 32 “ఆగత్తు అణైప్పార్ అణైవరే” (తనంతట తానుగా ఆ సర్వేశ్వరుడు తన నిర్హేతుక కృపతో వేంచేసినప్పుడు ఆయనను తలుచుకునేవారు ఆయనని పొందుతారు) అనియు తిరువాయిమొళి 1.2.4 “ఎల్లయిల్ అన్నలమ్ పుల్గు పత్తు” (ఆనందము కలిగిన ఆ సర్వేశ్వరుని భక్తితో ఆశ్రయింపుము) అనియు ముదల్ తిరువందాది 50 “ఆర్వమ పురియ పరిసినాల్ పుల్గిల్”(ప్రేమ మార్గమున ఆరాధించినచో)అన్నట్టు స్మరింపబడు మాధుర్యమును కలిగిన భగవానుని విషయమున అత్యంత ప్రియమైనదై శ్రీ భగవద్గీత 7.17″ప్రియోహి జ్ఞానినోత్యార్ధమ్ అహం స చ మమ ప్రియః” (అట్టి జ్ఞానికి నేను ఆప్తుడను, అతడు కూడా నాకు ఆప్తుడు)
వైగుమ్ సిఴప్పు విట్టుక్ కుత్తేవళ్ ఎన్నాద అనన్య ప్రయోజనమాయ్ –
– పెరియ తిరువందాది 53 “నిన్ పుగళిల్ వైగుం తమ్ సిందైయిలుమ్ మత్తినిదో నీయవర్కు వైగుందమ్ ఎన్దరుళుమ్ వాన్” (నీ కల్యాణ గుణములను అవిచ్ఛిన్నముగా అనుభవించుట కంటే నీవు ఇచ్చే వైకుంఠము భోగ్యము ఆగునా?)
– తిరువాశిరియం 2 “ఉలగుపదైత్తుణ్డ ఎన్దై అఴై కళల్ సుడర్ పూమ్ తామరై సూడుదఴ్కు అవావార్ ఉయిరురుగి ఉక్క నేరియ కాదల్ అన్బిలిన్బీన్ తేఴాల్ అముద వెళ్ళత్ తానామ్ సిఴప్పు విట్టు ఒరు పొరుట్కు అసైవోర్ అసైగ తిరువోడు మరువియ ఇయఴ్కై మాయప్ పెరు విఴల్ ఉలగమ్ మూన్ఴినోడు నల్ వీడు పెఴినుమ్ కోళ్వదెణ్ణుమో తెళ్ళయోర్ కుఴిప్పే” – పరత్వము, సౌలభ్యము మొదలగు కల్యాణ గుణములచే పరిపూర్ణుడైన సర్వేశ్వరుని యొక్క నిరతిశయ భోగ్యములైన శ్రీపాదములను అనుభవించుట అను గొప్ప కోరిక వలన ఆత్మ ఒక ద్రవ్య పదార్ధముగా మారి ఒకే వస్తువుగా చూచుటకు వీలుకాక సంగ, కామ మొదలగు అవస్థలను పొందినట్టి భక్తి వలన వృద్ధి పొందునట్టి నిరతిశయమైన రసము అనుభవించుట అను లాభమును వదులుకొని క్షుద్రమైన కామ్యములను పొందదలచినవారు వాటి కోసము బాధపడుచుండగా, గొప్ప ఐశ్వర్యమును, ఆత్మానుభవమును అంత మాత్రమే కాకుండా పరమ పురుషార్ధమైన మోక్షమును పొందుటకు సమర్థులైన, సారాసార వివేకము కల వారి హృదయమున వాటిని సేకరింపవలెను అను తలంపు కలుగునా?
– పెరియ తిరువందాది 58 “ఉనదు పాలే పోల్ సీరిల్ పళుత్తొళిన్దేన్ మేలాల్ పిఴప్పిన్మై పెత్తు అడిక్కీళ్ కుత్తే వలన్దు మఴిప్పిన్మై యాన్ వేణ్డుమ్ మాడు” (పాల వలె భోగమైన నీ కల్యాణ గుణములను అనుభవించాక మళ్ళీ జన్మ లేనట్టి నిత్యమూ నీ శ్రీపాద కైంకర్యమును చేయు శ్రీ వైకుంఠమును కాదు నేను కోరుకునేది; ఐశ్వర్యములా నాకు లభించిన జ్ఞానమును పోగొట్టుకోకుండా ఉండుటయే న కోరిక.
ఈ పాశురములలో చెప్పినట్టు ఈ భక్తి స్వతంత్ర విషయముగా పరమ భోగ్యమై అట్టి ధ్యానము ఒకరిని పరమపదమునందు ఉండు అనుభవము పట్ల ఉదాసీనముగా ఉండేలా చేస్తుంది కాబట్టి అట్టి భక్తి ప్రయోజనముగా పరిగణింపబడుతుంది. ఇది అనన్య ప్రయోజనము. (ఏ ఇతర ప్రయత్నము కోసము చేయనిది).
వేదానోపాసన సేవ ధ్యానాదిగళ్ ఎన్ఴు సొల్లుమదు సాధ్య సాధన భక్తియాగ శాస్రృ సిద్ధమ్ –
అట్టి భక్తి[యోగము] వేదనము, ఉపాసనము, సేవ, ధ్యానము మొదలగు వాటితో తెలియబడును మరియు కర్మ[యోగము], జ్ఞాన[యోగము] తాలూకు సంస్కారములు కలిగియున్న మనస్సుగల వానికి మాత్రమే కలుగునది. ఆత్మ సిద్ధి “ఉభయ పరికర్మిత స్వంతస్య” (కర్మ మరియు జ్ఞానముచే అలంకరించబడిన వాడి యొక్క మనస్సుకు) అన్నట్టు ఈ చేతనునిచే సాధింపవలసినదై భగవంతునికి అనుగ్రహము కలుగుటకు ఉపాయము అగుటచే ఆతనిని పొందుటకు సాధనమగు భక్తిగా వేదాంత శాస్త్రమున మరియు దాని అర్ధములను నిర్ణయించునట్టి ఇతిహాసములలో చెప్పబడినది.
అడియేన్ పవన్ రామానుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-99-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org