ఆచార్య హృదయం – 98

ఆచార్య హృదయం

<< చూర్ణిక 97

చూర్ణిక – 98

అవతారిక
క్రిందటి చూర్ణికలో చెప్పిన దానిని నాయనార్లు ఈ చూర్ణికలో కృపతో విశదీకరించుచున్నారు

చూర్ణిక
ఇరుళ్ తుయక్కు మయక్కు మఴప్పు ఎన్గిఴ అనుదయ సంశయ విపర్యయ విస్మృతికళ్ అత్తు మలర్మిశై ఎళుకిఴ జ్ఞానత్తే కాతల్ అన్బు వేట్కై అవా ఎన్ఴుమ్ సంగ కామ అనురాగ స్నేహాది అవస్థానామన్గళోడే పరభక్తిదశై ఆక్కుగై

సంక్షిప్త వ్యాఖ్యానము
ఆళ్వార్లను అజ్ఞానము, సంశయము, విపర్యయము(దోషము), విస్మృతి(మరపు) వంటి వాటి నుంచి విముక్తులను చేసి ప్రేమ, కామ, బంధము మొదలగు వాటితో తెలియబడునట్టిది మరియు జ్ఞానము యొక్క పరిపాక దశ అయిన పరమ భక్తిని ప్రసాదించుట.

వ్యాఖ్యానము

మయర్వఴ మదినల అరుళుగై –
వీటి నుండి విముక్తులై ఉండుట

– ఇరుళ్(అంధకారము) తో తెలియబడు జ్ఞాన అనుదయము(అజ్ఞానము) తిరువాయిమొళి 10.6.1 “ఇరుళ్ తరు మా జ్ఞాలత్తు” (తమస్సును ఇచ్చు ఈ విశాల ప్రపంచములో) అనియు పెరియ తిరుమొళి 11.4.8 “ఇరుళ్ తీరున్దు ఇవ్వైయమ్ మగిళ” (అజ్ఞానమును తొలగింపజేసి లోకమును సుఖముగా ఉంచుట)
– తుయక్కు(సంశయము) తో తెలియబడు సంశయము తిరువాయిమొళి 1.9.6 “తుయక్కన్ మయక్కన్” (సంశయములను/ దోషములను భాగవతులు కాని వారిలో కలిగించువాడు)  అన్నట్టు చూసినది ఏమిటి అని నిర్ధారణ చేయలేని స్థితి. “స్ధాణుర్వా పురుషోవా” (అది స్తంభమా లేక మనిషా?)
– మయక్కు తో తెలియబడు విపర్యయము అనునది ఒక వస్తువును మరొక వస్తువుగా గోచరించునట్లు చేయును అనగా తాడు పాములా గోచరించుట, ఆల్చిప్ప ముత్యములా గోచరించుట.
– మఴప్పు తో తెలియబడు విస్మృతి తిరువాయిమొళి 1.10.10 “మఴప్పుమ్ జ్ఞానముమ్” (మరవుట మరియు గుర్తించుకొనుట) అనియు “మఴప్పఴ ఎన్నుళ్ళే మన్నినాన్” (ఆతనిని మర్చిపోలేనట్టుగా న హృదయములోకి ప్రవేశించి ఎప్పటికీ అక్కడే వేంచేసి ఉండుట) అనునది పాత విషయముల మరియు వాటి తాలూకు సంగతుల అనుభవములో కలుగు అజ్ఞానము

జ్ఞానము యొక్క ఈ నాలుగు సంకోచ స్థితుల నుండి విముక్తులై

తిరువాయిమొళి 1.1.2 “మననగమలమ్ అఴ మలర్ మిసైయేళుదరుమ్” (కామము, క్రోధము మొదలగు వికారములు లేని వికసించిన బుద్ధి) అని చెప్పినట్టు స్వచ్ఛమైన బుద్ధితో వికసించునట్టి తీరుతో ప్రకాశించుచూ ఉపాయమైనట్టి భగవానుని పట్ల జ్ఞాన వికాసమును పొంది ముదల్ తిరువందాది 67 “తామరైయాల్ కేల్వన్ ఒరువనైయే నోక్కుమ్ ఉణర్వు” ( ప్రకాశించుచున్న పద్మముపై ఉన్న శ్రీ మహాలక్ష్మి యొక్క పతి అయిన నారాయణుని విషయము మాత్రమే జ్ఞానము) అని చెప్పినట్టు అట్టి శుద్ధమైన జ్ఞానము ఇక మీద వివరింపబోవు భక్తిలా వికసించును.

ఈ ప్రేమాతిశయ భక్తి అనేక చోట్ల కాదల్ (ప్రేమ), అన్బు (వాత్సల్యము), వేట్కై (ఆయనని పొందుటకు గల త్వర), అవా (కోరిక) గా వివరింపబడినవి.

– తిరువిరుత్తం 59 “ఉళప్ పెరుమ్ కాదల్” ( నా హృదయములో ఏర్పడిన గొప్ప కోరిక)
– తిరువాశిరియం 2 “నేరియ కాదల్” (జ్ఞానము వలన ఏర్పడిన ప్రేమ/వాత్సల్యము (భక్తి రూపముగా))
– ఇరండామ్ తిరువందాది 56 “కాణక్ కళి కాదల్” (ఎమ్పెరుమానుని అర్చించుటకు గల ఉత్క్రుష్టమైన కోరిక)
– తిరువాయిమొళి 5.5.10 “కళియ మిక్కదోర్ కాదల్” (తొలగింప శక్యము కాని గొప్ప ప్రేమ)
– తిరువాయిమొళి 5.3.4 “కాదల్ కడల్ పురైయ” (సముద్రము వంటి నిండైన భక్తి)
– తిరువాయిమొళి 7.3.6 “కాదల్ కడలిల్ మిగప్ పెరిదాల్” (సముద్రము కంటే విస్తారమైన ప్రేమ)
– తిరువాయిమొళి 7.3.8 “కాదల్ ఉరైక్కిల్ నీళ్ విసుమ్బుమ్ కళియప్ పెరిదాల్” (మనము చెప్పుకోవాలంటే అది పరమపదము కంటే విస్తారమైనది)
– తిరువాయిమొళి 6.8.2 “మెయ్ అమర్ కాదల్” (ఆతని దివ్య మంగళ విగ్రహమును విస్తారముగా అనుభవించుటకు కావలసిన గొప్ప కోరిక )
– తిరువిరుత్తమ్ 2 “అన్బు సూట్టియ” (ప్రేమ మల్లికను ఇచ్చిన వారు)
– తిరువాశిరియం 2 “అన్బిల్ ఇన్బు” ( ఆనందమును ప్రసాదించు కోరిక (ఎమ్పెరుమానుని చేరుటకు))
– పెరియ తిరువందాది 8 “అన్బే పెరుగుమ్ మిగ” (ప్రేమ ఎంతో గొప్పగా పెరుగుతోంది)
– తిరువాయిమొళి 6.10.2 “ఆఴా అన్బు” (అంతులేని ప్రేమ)
– తిరువాయిమొళి 2.1.10 “వేవారా వేట్కై నోయ్” (ప్రేమ రోగముతో పీడింపబడి పూర్తిగా ఎండిపోయినది)
– తిరువాయిమొళి 9.6.1 “పెరుగుమాల్ వేట్కైయుమ్” (వాత్సల్యము అమితముగా పెరిగినది)
– తిరువాయిమొళి 10.3.2 “అవియిన్ పరమల్ల వేట్కై” (సహించలేనంతగా నాకు కోరిక పెరిగినది)
– తిరువిరుత్తమ్ 64 “అవా ఒరుక్కా వినైయెడుమ్” (మనము పొందవలసినది తెలుసుకొనుటకు మన యొక్క పాపములు మరియు స్వభావములే విరోధములు)
– తిరువిరుత్తమ్ 84 “కాణ్బాన్ అవావున్” (నిన్ను ఆరాధించుటకు నేను కోరుకున్నాను)
– తిరువాశిరియం 2 “సూడుదఴ్కు అవా” (నీ పాద పద్మములను ధరించుట అను కోరికతో)
తిరువాయిమొళి 10.10.10 “అదనిల్ పెరియ ఎన్ అవా” (చిత్, అచిత్, ఈశ్వర అను మూడు తత్త్వముల కంటే నా కోరిక గొప్పది)

ఈ విధముగా పలు చోట్ల చెప్పబడిన కాదల్, అన్బు, వేట్కై, అవా అనునవి ప్రేమకు విత్తనము లాంటివై మరియు ప్రాపంచిక విషయానుభవములో సంగముగా చెప్పబడి మొదటి మెట్టుయై కామము సంగములో తదుపరి దశయై శ్రీ భగవద్గీత 2.62 “సంగాత్ సన్జాయతే కామః” (సంగము వలన కామము అధికముగా కలుగును. ఆ విషయానుభవము జరగనిచో ఒకనికి బాధకముగా అనిపించును) ఆ విషయానుభవము జరగనిదే ఒకరిని కుదురుగా ఉండనీయదు. తదుపరి దశ అయిన అనురాగము (విషయానికి దూరమైన కారణము వలన కలుగు బాధ)మరియు చిట్టచివరిది అయిన స్నేహము (కోరిక) విషయానుభవములో ఎట్టి అవాంతరములను సహింపనిది. ఇవి ఒక్కొక్క దశలో ఒక్కొక్క పేర్లను కలిగి భగవానుని విడిచి ఉండుట సాధ్యము కాని స్థితి అయిన పరమ భక్తికి దారి తీయును. కాదల్, అన్బు, వేట్కై, అవా అనునవి సంగము మొదలగు వాటిని ఒక క్రమ పద్ధతిలో సూచించినప్పటికీ అవి భిన్న క్రమములలో ఒక వరుస ప్రకారము జరిగినప్పటికీ ఆళ్వార్లకి ఈ అంశములు అన్నీ అన్ని వేళలా ఉండుట వలన ఒక్కొక్క భావమునకు అనుగుణముగా చెప్పబడిన ఈ భిన్న పదముల ప్రయోగమునకు ఎట్టి దోషమూ లేదు.

దీనితో మయర్వఴ మదినల అరుళుగై ఈ విధముగా చెప్పబడినది –

– జ్ఞాన సంకోచ దశలు అయిన అనుదయ, సంశయ, విపర్యయ మరియు విస్మృతి అను అజ్ఞాన స్థితులను తొలగించుట
– స్నేహము యొక్క మొదటి దశ సంగమునకు దారి తీయునది ప్రకాశవంతమైన జ్ఞానము మరియు విషయముల పైన దృష్టి ఉంచునట్టి ప్రేమ మొదలగుగా చెప్పబడు దశలకు దారి తీయును.
– చివరిగా అట్టి జ్ఞానము భక్తిగా పరిణితి చెంది ప్రేమ యొక్క పరమోత్క్రుష్ట దశ అయిన పరమ భక్తిగా మారుట.

దీనితో ఈ క్రిందవి అన్నీ వివరింపబడినవి.

– చూర్ణిక 92లో ఆళ్వార్ల గొప్పతనము గూర్చి సందేహమునకు గల కారణము
– అట్టి గొప్పతనమునకు గల కారణము – భగవానుని నిర్హేతుక కృప
– అట్టి నిర్హేతుక కృపకు గల శక్తి
– ఆళ్వార్లు కృప చేయబడుటకు గల కారణము లోకోద్ధరణకై
– కృప అనగా మయర్వఴ మదినల అరుళుగై మరియు
– అట్టి కృప ఎలా బయలుపరచబడినది

అడియేన్ పవన్ రామానుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-98-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment