శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
<< మునుపటి
13. కురుగూర్ నంబి
కురుగూర్ (తిరుక్కురుగూర్), నమ్మాళ్వార్ల జన్మస్థలం.
తిరుక్కురుగూర్ క్షేత్రం యొక్క గొప్పతనం ఇంతకు ముందే చూడబడింది. నంబి అంటే గుణపూర్తి కలవాడు, అనగా అన్ని శుభ గుణాలలో పరిపూర్ణత కలవాడు. సాధారణంగా, భగవానుడు అనేక శుభ గుణాలను పరిపూర్ణంగా కలిగి ఉన్నందున, ఆయనను నంబి అని పిలుస్తారు. జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం (స్వయం మార్పు లేకపోవడం), శక్తి, తేజస్సు, వాత్సల్యం (తల్లి వంటి సహనం), స్వామిత్వం, సౌశీలం (సరళత), సౌలభ్యం (సులభంగా చేరుకోగలగడం) మొదలైనవి కొన్ని శుభ గుణాలు. తిరుక్కురుంగుడి నంబి మరియు తిరునరైయూర్ నంబి వంటి పేర్లు భగవానుని నామాలు.
ఆళ్వార్ల విషయంలో కూడా అంతే, నమ్మాళ్వార్లు శుభ గుణాలలో పరిపూర్ణులు. ఆళ్వార్లలో జ్ఞానం, భక్తి, వైరాగ్యం మరియు ఆత్మ గుణాలు ఉన్నాయి, అవి అనన్యార్హ శేషత్వం (భగవానుని పట్ల ప్రత్యేకమైన దాస్యం), అనన్య శరణత్వం (కేవలం భగవానునికి ఆశ్రయంగా కలిగి ఉండటం) మరియు అనన్య భోగ్యత్వం (ఒంటరిగా ఆశ్రయించడం) వంటి గొప్ప గుణాలు. ఆళ్వార్లు భగవానునికి శరణాగతి చెసారు, భగవానుని ఆయన పూర్తిగా అనుభవించేవారు (గుణానుభవం) మొదలైనవి. ఈ లక్షణాలు ఆళ్వార్‌లో సంపూర్ణంగా ఉన్నాయి. అందుకే ఆళ్వార్లను నంబి అని పిలుస్తారు.
భగవాన్ నంబి అనే పేరును కలిగి ఉన్నప్పటికీ, ఆచార్యులను కూడా నంబి అని పిలుస్తారు. ఆచార్యులలో, నంబి అని పిలవబడే మొదటి వ్యక్తి నమ్మాళ్వార్లు. కణ్నినుణ్ చిరుత్తాంబులో, మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్లను కురుగూర్ నంబి అని పేర్కొన్నారు.
14. జ్ఞానత్తమిళ్ క్కడల్
ఇది ఒక తమిళ పేరు.
జ్ఞానత్తమిళ్ అరసు యొక్క అర్థం గతంలో వివరించబడింది. ఇక్కడ, జ్ఞానత్తమిళ్ ప్రస్తావన అదే. జ్ఞానత్తమిళ్ అంటే తమిళ భాషలో వేదం అని అర్థం.
నమ్మాళ్వార్లు తమిళంలో వేదాన్ని అనుగ్రాహించారు. వేదం యొక్క సారాంశం తిరుమంత్రంలో (అష్టాక్షరం) కనిపిస్తుంది. అష్టాక్షరం యొక్క సారాంశం అర్థ పంచకం, అవి, సర్వోన్నత ప్రభువు శ్రీమాన్నారాయణుని నిజ స్వరూపం (పరమాత్మ స్వరూపం), శాశ్వతమైన జీవాత్మ (జీవాత్మ స్వరూపం) యొక్క నిజమైన స్వభావం, అత్యంత సముచితమైన సాధనం యొక్క నిజ స్వరూపం (ఉపాయ స్వరూపం), అనంతమైన కర్మ రూపంలో ఉండే అడ్డంకుల నిజ స్వరూపం (విరోధి స్వరూపం) మరియు పరమ లక్ష్యం యొక్క నిజ స్వరూపం (ఉపేయ స్వరూపం). వీటన్నింటిని నమ్మాళ్వార్లు తమ దివ్య ప్రబంధాలలో, ముఖ్యంగా తిరువాయ్ మొళిలో అనుగ్రాహించారు.
కడల్ అంటే సముద్రం. అందువల్ల, ఆళ్వార్లు తమిళ భాషలో దివ్య వేదం యొక్క మహాసముద్రం కావున ఆళ్వార్లను జ్ఞానత్తమిళ్ కడల్ అని పిలుస్తారు.
శ్రీమన్నాథమునులు, తిరువాయ్ మొళి తనియన్‌లో, తిరువాయ్ మొళిని ద్రావిడ వేద సాగరం అని, అంటే తమిళ వేద సముద్రమని ప్రకటించారు. అదే నమ్మాళ్వార్ల గురించి కూడా చెప్పవచ్చు.
తిరువాయ్ మొళికి అసలు మూలం నమ్మాళ్వార్లు. అందుకే, ఆళ్వార్లను ద్రావిడ వేద సాగరం (జ్ఞానత్తమిళ్ కడల్) అని కూడా పిలుస్తారు.
వీడియోలింక్: https://www.youtube.com/shorts/TFCe4VO4YnY
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – శ్రీ తేజ రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org