చూర్ణిక – 100
అవతారిక
సాధన భక్తి వలె కాకుండా ఉపేయ రూపముగా భగవత్కైంకర్యమునకు ఒక ఉపకరణముగా(పనిముట్టు) ఉండునది మరియు భగవానుని ప్రార్ధించుట వలన ప్రపన్నులకు లభించునట్టి భక్తి విశేషమును నాయనార్లు వివరించుచున్నారు.
చూర్ణిక
స్వీకృత సిద్ధసాధనర్ ఇత్తై సాధ్యమాక ఇరక్క ప్రాప్తిక్కు మున్నే సిద్ధిక్కుమ్
సంక్షిప్త వ్యాఖ్యానము
సిద్ధోపాయమైన భగవానుని పొందుటకు ప్రయత్నించు వారు పరిపూర్ణావస్థలో ఉండు ఇట్టి భక్తి కొరకు ప్రార్ధించెదరు. భగవానుని పొందుటకు ముందే దీనిని వారు పొందుతారు.
వ్యాఖ్యానము
స్తోత్ర రత్నము 22 “త్వత్పాదమూలమ్ శరణం ప్రపద్యే” (నీ దివ్య శ్రీపాద పద్మములను ఉపాయముగా నేను దృఢముగా ఒప్పుకుంటున్నాను) అనియు శరణాగతి గద్యము 5 “త్వత్పాదారవింద యుగళమ్ శరణం అహం ప్రపద్యే” (దివ్యమైన నీ శ్రీ పాదపద్మములను ఉపాయముగా నేను దృఢముగా ఒప్పుకుంటున్నాను)అన్నట్టు సిద్ధోపాయమైన భగవానుని ఉపాయముగా ఎవరైతే స్వీకరించారో ఈ భక్తి అనునది భోజనము చేయుటకు ఆకలి లాగా కైంకర్యమున ఉపకరణముగా ఉండు ప్రాప్యమైన కైంకర్యము వలె ఇది కూడా మనకి ప్రాప్యమని తలచి స్తోత్ర రత్నము 54 “భగవన్ భక్తిమపి ప్రయచ్ఛ మే”(నీ పట్ల మధురమైన భక్తిని కూడా కృపతో అనుగ్రహించు) అనియు శరణాగతి గద్యము 14 “స్థానత్రయోదిత పరభక్తి యుక్తమ్ మామ్ కురుష్వ” (పరభక్తి, పరజ్ఞాన, పరమ భక్తి అను మూడు చోట్ల(8, 11, 18 అధ్యాయములలో)భగవద్గీతలో చెప్పినట్టుగా అట్లాంటి వాడిగా నన్ను చేయుము) అనియు శరణాగతి గద్యము 15 “పరభక్తి పరజ్ఞాన పరామభక్త్యేక స్వాభావం మామ్ కురుష్వ” (నాకు పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అనే ప్రాధమిక అవస్థ కలిగేట్టు చేయుము) అని చెప్పినట్టు అట్టి వారికి భగవానుని చేరుటకు ముందే శరీరమును విడిచిన తరువాత అట్టి భక్తి కలుగును. శరణాగతి గద్యము 20 “ఇమామ్ ప్రకృతిమ్ స్థూల, సూక్ష్మ రూపమ్ విసృజ్య..” (ఎలా అయితే చిరిగిన బట్టలను పడేస్తామో స్థూల మరియు సూక్ష్మ శరీరములను విడిచిపెడతాము)[పూర్తి వివరణ కొరకు ఈ సూత్రము యొక్క వ్యాఖ్యానమును చూడుము].
అడియేన్ పవన్ రామానుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-100-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org