ఆచార్య హృదయం – 103

ఆచార్య హృదయం

<< చూర్ణిక – 102

చూర్ణిక – 103

అవతారిక
ఆళ్వార్ల వేరొక దివ్య పాశురమును ఆధారముగా చేసుకొని నాయనార్లు దీనినే మరింత స్పష్ట పరుచుచున్నారు.

చూర్ణిక
ఇప్పిఴప్పే సిల నాళిల్ ఎన్ఴపోదే ఇరణ్డుమ్ కళియుమ్

సంక్షిప్త వ్యాఖ్యానము
తిరువాయిమొళి 2.3.8 “ఇప్ పిఴప్పే సిల నాళిల్ ఎయ్దినన్”(ఈ జన్మలోనే అతి తక్కువ వ్యవధిలోనే నేను పొందాను) అని ఆళ్వార్లు చెప్పడము వలన ఈ జన్మలో, గత జన్మలలో సాధనా త్రయములో (కర్మ, జ్ఞాన, భక్తి యోగములు) అభినివేశము కలదు అన్న విషయము నిరశింపబడినది.

వ్యాఖ్యానము
తిరువాయిమొళి 2.3.8 “కుఴిక్కొళ్ జ్ఞానగళాల్ ఎనై ఊళి సెయ్ తవముమ్ కిఴిక్కొణ్డు ఇప్ పిఴప్పే సిల నాళిల్ ఎయ్దినన్ యాన్” (వెన్న దొంగలించుట మొదలగు ఆతని లీలకు నెను ఆకర్షితుడనై ఆతనిని అనుసరించు హృదయమును కలిగిన వాడినై అతి తక్కువ సమయములోనే ఈ జన్మలోనే మంచి ఉపాయము(అనగా భగవానుని కృప) వలన ఎలాంటి ప్రయాస లేకుండా ఫలితమును పొందాను. జన్మతో దుఃఖములను వైరాగ్యముతో మరియు జ్ఞాన యోగము (వేదన, ధ్యాన, ఉపాసన మరియు సద్విద్యా, దహర విద్య మొదలగు ప్రక్రియల రూపముగా ఉండును)అనుసరించడము ద్వారా చాలా కాలము తరువాత దీనిని పొందవచ్చు. లగ్వత్రి స్మృతి “జన్మాన్తర సహస్రేషు” (చాలా వేల జన్మల తరువాత) అనియు శ్రీ భగవద్గీత 7.19 “బహునామ్ జన్మనామ్ అంతే” (అనేక జన్మల తరువాత) చాలా కాలము చేసిన తపస్సు యొక్క ఫలము (భక్తి యోగము)  ద్వారా యమ, నియమ మొదలగు వాటి జ్ఞానము వివిధ అవస్థల ద్వారా తెలియబడును; అట్టి జ్ఞానము లెక్కలేనన్ని కల్పములలో కొనసాగి (శ్రవణ, మనన, ధృవా స్మృతి) ద్వారా భక్తి యోగముగా పరిణితి చెంది; భక్తి యోగము రూపములో ఉండు ఈ తపస్సు ఉత్క్రుష్టమైన ఫలమునకు దారి తీయును; “అట్టి గొప్ప ఫలము ఎటువంటి ప్రయత్నమూ లేకుండా సిద్ధోపాయమైన ఆ భగవానుని వలన నాకు ఈ జన్మలోనే అతి తక్కువ సమయములోనే దొరికినది” అని ఆళ్వారు చెప్పడము చేత గత జన్మలలో కానీ ఈ జన్మలో కానీ సాధన త్రయము వల్ల కాదు అన్న శంక తొలగినది; “ఇప్ పిఴప్పే” అనునది గత జన్మలలో చేసిన అభ్యాసము మరియు “సిల నాళిల్” ఈ జన్మలో వెచ్చించిన సుదీర్ఘ ప్రయత్నములను తొలగించుటకే ఆళ్వార్లు చెప్పారు.

మరొక విధముగా – ఇంతక ముందు సూత్రము “ఇడగిలేన్….” లో చెప్పిన పాశురములు గత జన్మల్లో ప్రయత్నము ద్వారా సాధన త్రయము రూపములో ఆళ్వార్లకు లభించినవి కావు అని నిర్ధారణ చేసాయి. కానీ “అవి లేనట్లయితే ఈ జన్మలో అభ్యాసము చేసి ఉండవచ్చు కదా?” అన్న శంక ఉత్పన్నమగును. “ఇప్ పిఴప్పే”తో ప్రారంభమయ్యే ఆయన దివ్య సూక్తులను ఉటంకించడము ద్వారా ఆళ్వార్లకు గత జన్మలలోను, ప్రస్తుత జన్మలోనూ అట్టి ప్రవేశము లేదని నిరూపించబడి ఆ రెండు శంకలూ (సందేహములు) తొలగినవి.

కానీ ఈ అన్వయము కంటే పూర్వము(ముందు) చెప్పిన అన్వయమే ఆచార్య హృదయమునకు వ్యాఖ్యానమైన పెరియ పడితో సరిపోవును.

అడియేన్ పవన్ రామానుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-103-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment