చూర్ణిక – 102
అవతారిక
ఆళ్వార్ల పరమ భక్తి ఈ జన్మలో ఉపాయముల[కర్మ, జ్ఞాన, భక్తి] మూలకముగా కలిగినదా లేక అంతకముందు జన్మలలో వీటిని అంగీకరించుట వలన కలిగినదా? అన్న సందేహమును ఇంతక ముందు చెప్పిన విధముగా కాకుండా, ఇవి రెండూనూ కారణములు కావు అని ఆళ్వార్ల మాటలతోనే ప్రతిపాదించుచున్నారు.
చూర్ణిక
ఇడకిలేన్ నోన్బఴివిలేన్ కిఴ్పన్ కీళ్ నాళ్కళ్ ఎన్గైయాలే సాధనత్రయ పూర్వాభ్యాసజమ్ అల్ల
సంక్షిప్త వ్యాఖ్యానము
తిరువాయిమొళి 4.7.9 “ఇడగిలేన్” (పిడికెడు అన్నము కానీ నీరు కానీ నేను ఇవ్వను)అనియు తిరువాయిమొళి 5.7.1 “నోత్త నోబిలేన్” (కర్మ యోగము గురించి తెలియదు) అనియు తిరువాయిమొళి 3.2.6 “కిఴ్పన్” (నేను అసమర్థుడను) అనియు పెరియ తిరువందాది 82 “కీళ్ నాళ్కళ్” (గత జన్మలు అన్నియూ) అన్నట్టు ఆళ్వార్ల భక్తి ఈ జన్మలో లేక గత జన్మలలో కర్మ, జ్ఞాన మరియు భక్తి యోగముల ఆచరణ కారణముగా కలిగినది కాదు.
వ్యాఖ్యానము
అనగా
ఇడగిలేన్ –
తిరువాయిమొళి 4.7.9 “ఇడగిలేన్…” (ఆకలితో ఉన్న వారికి పిడికెడు అన్నము, దాహముతో ఉన్నవాడికి నీరు కానీ ఇవ్వను; నా పంచేంద్రియములను నిగ్రహించుకోలేక పోయాను; ఎమ్పెరుమానుని కీర్తించి తగిన సమయములలో పుష్పములను కోసి ఆరాధించు విధేయతను కలిగిన వ్యక్తిని కాను; [అయినప్పటికీ] హృదయమున కోరిక గల వాడినై చెదర్చడానికి వీలుకాని ధృడమైన అనురాగము మరియు పొంగిపొర్లునట్టి ఆప్యాయతను కలిగి అజ్ఞానముతో బలమైన పాపపు రాశిని కలిగి ఉండి భోగ్యమైనట్టి దివ్యమైన చక్రమును గల ఆ స్వామిని ఎక్కడ చూచెదను? అని వెతికెను) అన్నట్టు దానములో భాగమైన ఆకలితో ఉన్నవాడి ఆకలిని తీర్చుట దాహముగా ఉన్నవాడి దాహము తీర్చుట శ్రీ భగవద్గీత 18.5 “యజ్ఞదానతపః కర్మ” (వైదిక కర్మలైన యజ్ఞము, దానము, తపము) కర్మయోగములో భాగములైనందున నేను కర్మ యోగమును ఆచరించాను అని చెప్పవచ్చు; కానీ నేను కర్మ యోగమును ఆచరించలేదు. నేను నా ఇంద్రియములను ప్రాపంచిక సుఖాల వైపు వెళ్లకుండా నిగ్రహించుకొని ఉంటే అది జ్ఞాన యోగముగా పరిగణింపవచ్చు; కానీ నేను అది కూడా చేయలేదు. శాస్త్రములో చెప్పిన విధముగా నేను తగిన సమయాలలో పువ్వులు మొదలగు వస్తువులను సంపాదించి నియమిత పద్ధతులలో భగవానుని పూజించి స్తుతించి ఉంటే అది భక్తి యోగముగా పరిగణింపవచ్చు; కానీ నేను అది కూడా చేయలేదు.
నోన్బఴివిలేన్ –
తిరువాయిమొళి 5.7.1 “నోత్త నోబిలేన్” (కర్మ యోగము గురుంచి తెలియదు) అన్నట్టు ఫలితమును పొందాక పూర్తి అగు కర్మ యోగము నాకు లేదు. కర్మ యోగము లేదు కనుక అణువగు జీవాత్మ మరియు పరమాత్మ గురుంచి చెప్పు అట్టి జ్ఞాన యోగమూ లేదు. అందుచేత కర్మ మరియు జ్ఞాన యోగముల పరాకాష్ఠ అయిన భక్తి యోగము నాకు లేదు అని అర్ధము చేసుకొనవలెను.
ఆళ్వార్లు వీటి గురుంచి చెప్పడము చేత ఆళ్వార్ల యొక్క పరమ భక్తి అనునది ఈ జన్మలో ఆచరించిన కర్మ, జ్ఞాన, భక్తి యోగముల ఫలితము వల్ల కాదు.
కిఴ్పన్ –
తిరువాయిమొళి 3.2.6 “కిఴ్పన్ కిల్లేన్ ఎన్ఴిలన్ మున నాళాల్” (గడచిన కాలములో (ఇది మంచి కోసము చెయ్యమని) చెప్పినచో ‘నేను అసమర్థుడను’ అని తిరస్కరించాను. (చెడు కర్మలు ఆచరించకు మంచిది కాదు) అని చెప్పినప్పుడు అవి చేయకుండా ఉండేవాడిని కాను.గతంలో “కుర్యాత్” (ఇవి చేయతగినవి) అని చెప్పినప్పుడు నేను అసమర్థుడను అని ఒప్పుకోలేదు మరియు “న కుర్యాత్” (ఇవి చేయతగనివి) అని చెప్పినప్పుడు “నేను అసమర్థుడను” అని తిరస్కరించి ఈ విధముగా విధించిన పనులను వదిలిపెట్టి నిషిద్ధములను చేసితిని.
కీళ్ నాళ్కళ్ –
పెరియ తిరువందాది 82 “తెరిన్దు ఉణర్వు ఒన్ఴిన్మైయాల్ తీవినైయెన్ ఆళియన్గై అమ్మానై ఏత్తాదు అయర్తు వాళా ఇరున్దొళిన్ దేన్ కీళ్ నాళ్గళ్ ఎల్లామ్” (యాధాత్మ్య జ్ఞానము అను జ్ఞానము పూర్తిగా లేకుండుట – అజ్ఞానిగా ఉండి తన చేతిలో అందమైన ఉంగరమును ధరించిన ఎమ్పెరుమానుని కీర్తించకుండా నేను గత జన్మలు అన్నియూ వ్యర్ధము చేశాను) అని చెప్పినట్టు భగవద్విషయమను పరిశీలించునట్టి జ్ఞానము కొంచెము కూడా లేకుండా భగవానుని అనుభవించుటకు తగినట్టి కాలమంతా వృధాగా పోగొట్టుకొని పాపియైన నేను పిరాట్టిమార్లు చెప్పినది చేయక మాయా జింకను వెంబడించినట్టి వాడూ, చేతికి ఉంగరమును ధరించిన వాడూ అయిన ఆ సర్వేశ్వరునికి మంగళశాసనము చేయు భాగ్యము లేక కాలమంతా వృధా చేశాను.
ఆళ్వారులే ఇవన్నీ కృప చేయడము చేత ఈ పరమభక్తి గత జన్మలలో ఆచరించిన సాధనా మూలకముగా కలిగినది కాదు.
అడియేన్ పవన్ రామానుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-102-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org