ఆచార్య హృదయం – 101

ఆచార్య హృదయం

<< చూర్ణిక – 100

చూర్ణిక -101

అవతారిక
ఈ ఆళ్వార్ల యొక్క విలక్షణమైన భక్తిని నాయనార్లు ఇప్పుడు వివరించుచున్నారు

చూర్ణిక
ఇతు ఉభయమిన్ఴిక్కే అఴియాక్కాలత్తిలే ఒక్కపిఴన్దు తుళువినిన్ఴు కట్టమే నోయాయ్ ఉలర్ త్తి వీళ్ న్దలప్పాయ్ త్యాగ స్వీకార నిష్ఠా హానికళాక్కి సత్తా భోగవృత్త్యుపకరణమామతొన్ఴు

సంక్షిప్త వ్యాఖ్యానము
ఇది సాధనా భక్తి (భక్తియే ఉపాయముగా) మరియు సాధ్య భక్తి (కైంకర్యమునకు ఉపకరణముగా ఉండు భక్తి) వలె కాకుండా ఆళ్వార్ల పోషకము మరియు భోగ్యముగా సహాయపడు భక్తి

వ్యాఖ్యానము
అనగా – ఆళ్వార్ల భక్తి అనునది ఇంతక ముందు చెప్పినట్టుగా ఈ క్రింది వాని వలె కాకుండా

1) భగవానుని పొందుటకు ఉపాయము అయినదై తన స్వప్రయత్నముతో పొందబడునట్టిదైన భక్తి యోగము
2) భగవానుని ఉపాయముగా స్వీకరించాక ఆ భక్తి కోసము అభ్యర్ధించి అట్టి భగవానుని యొక్క కృప చేత లభించినట్టిదై కైంకర్యమునకు ఉపకరణముగా ఉండునట్టి భక్తి.

అఴియాక్ కాలత్తే –
తిరువాయిమొళి 2.3.3 “అఴియాక్ కాలత్తుళ్ళే అడిమైక్కణ్ అన్బు సెయ్ విత్తు” (నాలో అట్టి సంబంధమును తెలుసుకొనుటకు ఆస్కారమే లేనప్పుడు (నీకు – నాకు మధ్య ఉన్న శేషి – శేష సంబంధమును తలచి) నీవు అట్టి శేషత్వము పట్ల ప్రీతిని కలిగించావు)అనియు శ్రీ రామాయణము బాలకాండము 18.27 “బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధః లక్ష్మణో లక్ష్మీ సంపన్నః” (కైంకర్యమను ఐశ్వర్యమును కలిగియున్న లక్ష్మణుడు; శ్రీరాముని పట్ల చిన్నప్పటినుంచీ ఎంతో ప్రేమతో తాను ఉండేవాడు) అన్నట్టు జ్ఞానమునకు ఆస్కారము లేనట్టి బాల్య దశలో ఫలప్రాప్తి అయిన కైంకర్యమున అత్యంత ప్రీతిని తులసితో పాటు పుట్టు పరిమళము వలె కలుగచేసావు.

తళువి నిన్ఴు –
తిరువాయిమొళి 4.7.11 “తళువి నిన్ఴ కాదల్” ( స్వరూపము యొక్క సహజమైన దృఢమైనట్టి అనుభవించుటకు గల గొప్ప కోరిక) అన్నట్టు మనము దీనిని వదిలి పెడతాము అన్నప్పటికీ ఆ భక్తి వదలనిది.

కట్టమే నోయాయ్ –
తిరువాయిమొళి 7.2.4 “కట్టమే కాదల్” (ప్రేమ కష్టమైనది) అనియు తిరువాయిమొళి 9.6.7 “వేట్కై నోయ్ కూర” (అనుభవించుటకు గల కోరిక పెరుగుతూ) భోగ్యమైన ఆ భగవానుని మనసారా అనుభవించలేక ఆహారము లభించనప్పుడు దానిని “కష్టము” మరియు రోగము అని చెప్పి ద్వేషమును పెంచుకున్నట్టు.

నోయాయ్ ఉలర్ త్తి వీళ్ త్తు అలప్పాయ్ –
తిరువాయిమొళి 2.1.10 “వేవు ఆరా వేట్కై నోయ్ మెల్ ఆవి ఉళ్ ఉలరత్త” (ప్రేమ రోగముతో పీడింపబడుటచే మృదువైన నా ఆత్మ పూర్తిగా శుష్కింపబడినది) అనియు తిరువాయిమొళి 5.7.2 “ఉన్నైక్ కాణుమ్ అవావిల్ వీళిన్దు” (నిన్ను అనుభవించుటకు ప్రేమ అను ఆశలో పడి) అనియు తిరువాయిమొళి 5.8.4 “ఉన్నైక్ కాణ్బాన్ నాన్ అలప్పాయ్” (నిన్ను చూసి అనుభవించుటకు నేను రోధిస్తున్నాను) అన్నట్టు నశింపశక్యము కాని ఆత్మా ఒక ఎండుటాకు వలె ఎండిపోయి గొప్ప కోరిక రూపమున ఉండు భక్తిలో మునిగి ఒడ్డుకు చేరలేక ఏదో సముద్రములో పడినట్టుగా ఆ భగవానుని చూడాలనే తపన ఆళ్వార్లకి కలిగింపచేసినట్లు.

త్యాగ స్వీకార నిష్ఠా హానిగళాక్కి –
[త్యాగ నిష్ఠా హాని] తిరువాయిమొళి 5.8.3 “ఉన్నాల్ అల్లాల్ యావరాలుమ్ ఒన్ఴుమ్ కుఴై వేన్డేన్” (నా కోరికలు తీర్చుకొనుటకు నిన్ను తప్ప నేను మరొకరిని అభ్యర్దించెను)అన్నట్టు ఆళ్వారులు అన్ని ఉపాయములను పూర్తిగా వదిలిపెట్టి భగవానునే ఉపాయముగా స్వీకరించారు. అట్టి ఆళ్వారు అంతక ముందు విడిచిపెట్టిన ఉపాయములలో ఒకటైన [మడల్ ను స్వీకరించుట] అను ఉపాయమును స్వీకరించుటకు నెట్టబడి తిరువాయిమొళి 5.3.9 “కుదిరియాయ్ మడలూర్దుమ్”(సిగ్గులేని దానినై ఎవరు చెప్పినా వినకుండా మడల్ ను చేసెదను) అనియు తిరువాయిమొళి 5.3.10 “యామడలూర్న్దుమ్ ఎమ్ ఆళియన్ గైప్ పిరానుడైత్ తూమడల్ తన్నన్దుళాయ్ మలర్ కొణ్డు సూడువోమ్” (మా ఆడతనానికి సహజమైన సిగ్గుని ఏ మాత్రమూ లెక్కచేయకుండా అన్ని వీధులలో తిరుగుతూ మడల్ చేస్తూ చుట్టు పక్కల స్త్రీలు తమ నాలుకలతో అదేపనిగా నిందలు పలికినట్లే మేమూ అతని గురించి నిరంతరము పలుకుతూ ఈ లోకమంతా కలవరము/ఆగ్రహముతో ఆ సర్వేశ్వరుని గురించి మాట్లాడేలా చేస్తూ తన చేతిలో చక్రమును కలిగి ఉన్న ఆ మనోహరమైన దృశ్యాన్ని మనకి అనుభవింపజేసి దాని ద్వారా మనలను తన వైపు ఆకర్షించిన ఉపకారకుడైన ఎమ్పెరుమానుడు ధరించిన అప్పుడే చిగురించి తాజాదనము వల్ల సహజ పరిమళముతో మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఆకర్షణీయముగా ఉన్న తులసి మాలను పొంది దానిని మా శిరస్సులపై ధరిస్తాము); అన్నట్టు ఈ భక్తి త్యజించినట్టి ఉపాయాంతరమున మరలా ప్రవేశింపచేసి త్యాగ నిష్ఠకు హానిని కలిగించును.

[స్వీకార నిష్ఠా హాని] తిరువాయిమొళి 5.7.10 “ఆఴెనక్కు నిన్ పాదమే శరణాగత్ తన్దొళిన్దాయ్” (రక్షకము, ఉపాయము, ఉపేయము అయిన నీ దివ్య పాద పద్మములను నీవే(ఎమ్పెరుమానుడు) నాకు అనుగ్రహించావు) తిరువాయిమొళి 5.8.11 “కళల్ గళ్ అవైయే శరణాగక్ కొణ్డ” (తనకు బహిర్గతములైన శ్రీ కృష్ణుని దివ్య పాదములే ఉపాయముగా భావించి) తిరువాయిమొళి 5.9.11 “అడిమేల్ సేయుమ్ కొళ్ తెన్ కురుగూర్ చ్ చటకోపన్” జ్ఞాన రూపముగా ఉండు అట్టి సర్వేశ్వరుని దివ్యపాదములపై గల మహా విశ్వాసము) తిరువాయిమొళి 5.10.11 “నాగణై మిసై నమ్పిరాన్ శరణే శరణ్” (తిరువనంతాళ్వాన్ల పైన శయనించినట్టి స్వామి పాదములే మాకు ఉపాయము) అనియు తిరువాయిమొళి 6.10.10 “అడిక్ కీళ్ అయరన్దు పుగున్దే నే” (నీ దివ్య పాదములనే శరణుజొచ్చి వాటి కిందే అమరి ఎట్టి ఫలాపేక్ష లేకుండా కైంకర్యమునే తలచి) అన్నట్టు శరణాగతి (భగవానుడే ఉపాయము[శరణాగతి ప్రక్రియలో]) కేవలము ఒకసారి మాత్రమే చేయవలెను అని శాస్త్రమున ఉద్ఘాటించినప్పటికీ అట్టి భక్తి ఆళ్వార్లను పదే పదే పొందేట్టుగా చేసి లక్ష్మీ తంత్రము “సకృదేవాహి శాస్త్రార్ధః కృతోయన్ తారయేన్ నరమ్” (శాస్త్రము యొక్క ఉద్దేశ్యము అయిన ప్రపత్తి ఒకసారి మాత్రమే చేయతగినదై సంసార సాగరమును దాటుటకు ఉపకరించును) అనియు శ్రీ రామాయణము యుద్ధ కాండము 18.33 “సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతిచ యాచతే అభయం సర్వభూతేభ్యో దధామి ఏతత్ వ్రతం మమ” (ఎవరైతే నాకు శరణాగతి చేసి “నేను నీ దాసుడను” అని చెప్పెదరో అట్టి వారికి నేను అన్నిటి నుంచి రక్షిస్తాను. ఇదే నా దృఢమైన ప్రతిజ్ఞ). ఈ విధముగా ఒక్కసారి మాత్రమే భగవానుని ఉపాయముగా స్వీకరించుటలో స్వీకార నిష్ఠకు హాని కలిగించును.

సత్తా భోగ వృత్తి ఉపకరణమావదొన్ఴు –
భగవానుని తలచుకోకపోవడము మరియు తనకు(ఆత్మ) ఉనికి లేకపోవడము అను ఈ రెండు దశలు ఆళ్వారుకు వేర్వేరు కాకుండా రెండూ ఒక్కటే. అట్టి ఆళ్వారుకు ఈ భక్తి ఎప్పుడూ భగవానుని స్మరణకు(తలంపు) కారణము మరియు తిరువాయిమొళి 6.7.1 “ఎల్లామ్ కణ్ణన్” (అన్నియూ శ్రీ కృష్ణుడే) అని తలచునట్టి ఆళ్వారుకి ఆ విషయము అనుభవించు ప్రీతిని పైపైని వృద్ధి పొందించుటచే భోగమునకు తిరువాయిమొళి 3.3.1 “వళువిలా అడిమై సెయ్య వేణ్డునామ్” (ఏదీ విడువకుండా అన్ని రకాల కైంకర్యములను మనము చేయవలెను) అన్నట్టు వీరికి సంపూర్ణ శేషత్వమున ప్రీతి కలుగుటకు అనుకూలమైనందున కైంకర్యమునకు కూడా ఇది కారణము.

మరొక విధముగా “సత్తా భోగ వృత్తి ఉపకరణమావదొన్ఴు”కు – “నా కించిత్ కుర్వతః శేషత్వం” (కైంకర్యమును చేయని వాడు దాసుడు కాడు) కొద్దిపాటి కైంకర్యమూ చేయని వాడికి శేషత్వము లేదు అని ఆత్మ విషయమున చెప్పడము చేత కేవలము శేషత్వముతోనే గుర్తింపబడు ఆత్మ యొక్క ఉనికి(సత్తా) ఆ కించిత్ కైంకర్యములోనే ఉంటుందని, ఈ భక్తియే అతని ఉనికికి కారణమని మరియు అంతిమోపాయముగా ఈ భక్తిని ఆచరించవలెను అని చెప్పడమైనది. తిరువాయిమొళి 2.9.4 “తనక్కేయాగ” (ఆయన కొరకే) అనియు తిరువాయిమొళి 10.3.9 “ఉన్దన్ తిరువుళ్ళమ్ ఇడర్ కెడున్దోఴుమ్” (నీ యొక్క హృదయమున క్లేశములు నశించి మరియు నీవు సంతోషించినప్పుడు) అనియు స్తోత్ర రత్నము 46 “కదా ప్రహర్షయిష్యామి” (నేను నిన్ను ఎప్పుడు సంతోషపెట్టగలను?) మొదలగు చోట్ల చెప్పడము చేత భోగ్యమైనట్టి ఆత్మ తాలూకు శేషత్వమునకు ఇది కారణము.

అందుచేత ఆళ్వార్ల భక్తి స్వప్రయత్నముగా కానీ ప్రార్ధనా మూలకముగా కానీ కలిగినది కాదు అని చెప్పడమైనది. అది అతనితో పుట్టి ఆతని సత్తా మొదలగు వాటికి కారణమైనది.

అడియేన్ పవన్ రామానుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-101-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment