ఆచార్య హృదయం

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే  నమః శ్రీ వానాచల మహామునయే  నమః

శ్రియః పతి, సర్వేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుడి పట్ల అత్యంత అభినివేశం కలిగిన నమ్మాళ్వారులనే ఆచార్య శబ్దం సూచిస్తుంది . అట్టి నమ్మాళ్వారుల తిరుముఖము నుండి వెలువడిన ద్రావిడ ప్రబంధము ఈ లోకమున ఉన్న సంసారులను సన్మార్గగాములను చేయుటకు దోహదపడింది. “హృదయము” అనగా మనస్సు. “ఆచార్య హృదయము” అనగా నమ్మాళ్వారుల దివ్యమయిన తిరువుళ్ళము.

అట్టి నమ్మాళ్వారుల కీర్తిని ఈ లోకమునకు తెలియచెప్పుటకు శ్రీ పిళ్ళై లోకాచార్యుర్యులనబడు వారి తమ్ములు మరియు శ్రీ వడక్కు తిరువీధిపిళ్ళైల కుమారులు అయిన శ్రీ అళగియ మనవాళ ప్పెరుమాళ్ నాయనార్లు ఈ “ఆచార్య హృదయం” అను ప్రబంధమును రచించిరి. నాయనార్లు ఈ ప్రబంధమున ఆళ్వారుల మరియు ఋషుల వాక్కులనే విస్తారముగా పొందు పరిచిరి. ఈ ప్రబంధము శ్రీవైష్ణవ సంప్రదాయమున మిక్కిలి ఆదరణీయము మఱియు ఆరాధ్య గ్రంధముగా గొప్ప పేరును గడించింది.

విశద్వాఖ్ శిఖామణి అయిన వరవరమునులు అనబడు శ్రీ మణవాళ మహామునులు ఈ ప్రబంధమునకు అద్భుతమైన వ్యా ఖ్యానమును కృప చేసినారు .ఆ వ్యాఖ్యానమే లేకపోతే మనకి ఈ ప్రబంధమున కూర్చిన విశేషార్థములను అర్థము చేసుకునే యోగ్యత లభించి ఉండేదే కాదు.

ప్రస్తుతము జరుగుచున్న ఈ అనువాదము శ్రీమాన్ బి .ఆర్ పురుషోత్తమనాయుడు అనువారు తమిళమున వ్రాసిన సరళ వ్యాఖ్యానమును అవసరమయిన చోట్ల ఉదహరించడం జరిగినది.

ఈ ప్రబంధము మిక్కిలి క్లిష్టతరము మఱియు అనువాద కాఠిన్యము సంతరించుకుని ఉండడం చేత, దాసుడు ఆళ్వారాచార్యుల నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల ద్వారా ఈ అనువాదమునకు న్యాయము చేకూర్చుటకై ప్రయత్నిస్తున్నాడు 

అడియేన్ పవన్ రమనుజ డసన్

మూలము : https://granthams.koyil.org/acharya-hrudhayam-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org