ఆచార్య హ్రుదయం – 23

ఆచార్య హ్రుదయం << చూర్ణిక 22 అవతారికఈ విధముగా స్వరూప యాధాత్మ్య జ్ఞాన దశ యందు కనపడు పారతంత్య్రము, స్వరూప జ్ఞాన దశ యందు కనపడు శేషత్వము మొదలగు వాటిని తిరస్కరించడమును ఈ చూర్ణికలో వివరించుచున్నారు. చూర్ణికముళైత్తెళున్ద సూర్యతుల్య యాధాత్మ్య చరమమ్ వితియిల్ కాణుమ్ ప్రధమమధ్యమదశైకళై ప్పకల్విళక్కుమ్ మిన్మినియుమ్ ఆక్కుమ్ సంక్షిప్త వివరణఉదయించే సూర్యుని వలే ఆత్మ యొక్క సహజ స్వరూపమునకు చరమ దశలైన పారతంత్య్ర, భోగ్యతలు మరియు ప్రధమ, మధ్యమ దశలు అయిన శేషత్వ, భోక్తృత్వములను … Read more

ఆచార్య హ్రుదయం – 22

ఆచార్య హృదయం << చూర్ణిక 21 అవతారిక నాయనార్లు ఈ సూత్రమును(ఇంతక ముందు చూర్ణికలో చెప్పబడిన) స్వరూప యాధాత్మ్యమును తెలుపు తిరుమంత్రమున చూపించుచున్నారు. ఈ సూత్రమును అర్థము చేసుకొనుటకు తిరుమంత్రార్ధము యొక్క సంక్షిప్త వివరణ దోహద పడుతుంది. ముముక్షుప్పడి అను రహస్య గ్రంధములో తిరుమంత్ర ప్రకరణము చదివినచో నిగూడార్ధములు తేటతెల్లము అవును. చూర్ణికజ్ఞానచతుర్ధికళిన్ మేలేయిఴే ఆనన్దషష్ఠికళిక్కు ఉదయమ్ సంక్షిప్త వివరణభోక్తృత్వమును(అనుభవించు వాడు) తెలుపు జ్ఞానము (ప్రణవమున మకారమందు కలదు) మరియు శేషత్వమును తెలుపు లుప్త చతుర్థికి తరువాత … Read more

ఆచార్య హ్రుదయం – 21

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 20 అవతారికఆత్మ స్వరూప జ్ఞాన విషయమున స్వరూప జ్ఞానమనీ, స్వరూప యాధాత్మ్య జ్ఞానమనీ భేదమున్నది. అందులో ఈ ఆత్మ తాలూకు శేషత్వము (శేషముగా ఉండుట) మరియు జ్ఞాతృత్వము(తెలుసుకొనువాడై ఉండుట) నారాయణ సూక్తములో “పతిమ్ విశ్వస్య” (సర్వలోక నాయకుడు) అనియు “అచ్చిద్రమ్ యస్వామి”(నేను సర్వేశ్వరునికే చెందిన వాడను) అనియు బృహదారణ్యక ఉపనిషత్ లో ” న హి విజ్ఞాతుర్ విజ్ఞాతేర్ విపరిలోభో విద్యాతే” (జ్ఞానమును కలిగి ఉన్న ఆత్మకు వినాశము లేదు) … Read more

ఆచార్య హ్రుదయం – 20

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 19 అవతారికశాస్త్రమునందు ప్రావీణ్యము కలియుగ ఉండు శాస్త్రజ్ఞులు తమ స్వప్రయత్నము, భగవానుని కృప మీద ఆధారపడి ఉండు స్థితికి గల కారణము మరియు శాస్త్ర సారమునందు ప్రావీణ్యము కలిగి ఉండు సారజ్ఞులు కేవలము భగవానుని కృప మీదనే ఆధారపడి ప్రవర్తించు స్థితికి గల కారణములను ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణికఇవై స్వరూపత్తై ఉణర్న్దు ఉణర్న్దు ఉణర్వుమ్ ఉణర్వై ప్పెఴ వూర మిక  ఉణర్వుమ్ ఉణ్డామ్ సంక్షిప్త వివరణక్రమ క్రమముగా వృద్ధిని పొందిన … Read more

ఆచార్య హ్రుదయం – 19

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 18 అవతారికఇప్పుడు(ఇక మీద) శాస్త్ర తాత్పర్యము(సారము)ను అనుసరించు ముముక్షువులు నడవడిక మరియు శాస్త్రమును అనుసరించు వారి నడవడికలు తెలుపుచున్నారు. చూర్ణికశాస్త్రికళ్ తెప్పక్కైయరైప్పోలే ఇర్ణడైయుమ్ ఇడుక్కి ప్పిఴవి క్కడలై నీన్ద, సారజ్ఞర్ విట్టత్తిల్ ఇరుప్పారైప్పోలే ఇరుకైయుమ్ విట్టు కరైకుఴుకుమ్ కాలమ్ ఎణ్ణువర్కళ్ సంక్షిప్త వివరణశాస్త్రజ్ఞులు(శాస్త్రమును అనుసరించువారు) నదిని దాటడానికి ప్రయత్నించు వారిలా తమ రెండు చేతులతో ఈదునట్టు సంసార సముద్రమును ఈదుటకై ప్రయత్నించగా; శాస్త్ర తాత్పర్యమును అనుసరించువారు పడవ మీద కూర్చుని … Read more

ఆచార్య హ్రుదయం – 18

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 17 అవతారికఇట్టి శాస్త్రము మరియు శాస్త్ర తాత్పర్యమగు తిరుమంత్రమును అభ్యసించుటకు అందరికీ అధికారము కలదా? లేక యోగ్యత కలిగిన ఎవరికో కొందరికి మాత్రమే అధికారము కలదా? అన్న ప్రశ్నకు సమాధానమును ఇక్కడ చెప్పుచున్నారు. చూర్ణికతోల్పురైయే పోమతుక్కు ప్పళుతిలా యోగ్యతైవేణుమ్ మనముడైయీర్ ఎన్గిఴ శ్రద్ధయే అమైన్ద మర్మస్పర్శిక్కు నానుమ్ నమరుమ్ ఎన్నుమ్బడి సర్వరుమ్ అధికారికళ్ సంక్షిప్త వివరణశరీర విషయమున ప్రవర్తించు శాస్త్రమునకు అనేక యోగ్యతలు కావలెను. ఆత్మ విషయమున ప్రవర్తించు తిరుమంత్రమునకు … Read more

ఆచార్య హ్రుదయం – 17

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 16 అవతారిక ఆ సర్వేశ్వరుడు ఈ సంసారములోని చేతనులను(బద్ద జీవాత్మలను) ఉజ్జీవించుటకు(ఉద్దరించుటకు) దయతో శాస్త్రమును, మరియు శాస్త్ర సారమైన తిరుమంత్రమును బయలుపరిచెను అని ఇంతక ముందు చెప్పబడినది. అయితే ఈ రెండిటిని ఎలా ప్రకాశింపచేసాడు? వాటికి అర్హులు ఎవరు? అను ప్రశ్నలకు సమాధానములు ఇక్కడ చెప్పుచున్నారు. చూర్ణికమునివరై యిడుక్కియుమ్ మున్నీర్ వణ్ణనాయుమ్ వెళియిట్ట శాస్త్ర తాత్పర్యజ్గళుక్కు విశిష్ఠనిష్కృష్టవేషజ్గళ్ విషయమ్ సంక్షిప్త వివరణమునుల ద్వారా ప్రకాశింపచేసిన శాస్త్రమునకు లక్ష్యము(శ్రోతలు)చేతనుల యొక్క దేహ … Read more

ఆచార్య హృదయం – 16

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 15 అవతారిక శాస్త్రార్థములను ప్రతిపాదించిన ఆ సర్వేశ్వరుడు తన మనస్సున అట్టి శాస్త్రమును అభ్యసించుటకు ఎన్నో యోగ్యతలు మరియు ఎంతో శ్రమ కావలసినందున ఎంతో కృపతో తానే సకల శాస్త్ర సారమైన మరియు శాస్త్రాభ్యాసము వలే క్లిష్టతరమైనది కానిది, ఎట్టి యోగ్యత అపేక్షించనిది అయిన తిరుమంత్రాన్ని ప్రకాశింపజేసిన వైనాన్ని ఇక మీద నాయనార్లు వివరించనున్నారు. చూర్ణిక చతుర్విధమాన దేహ వర్ణ ఆశ్రమ అధికార ఫల మోక్ష సాధన గతి యుగధర్మ … Read more

ఆచార్య హృదయం – 15

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 14 అవతారిక సత్త్వ రజస్తమో గుణముల చేత బద్ధులైన చేతనుల పట్ల వాత్సల్యముతో ఆ సర్వేశ్వరుడు శాస్త్రములను బయలుపరచినప్పటికీ, తాను వారి రుచిని బట్టి ఫల సాధనములను ప్రసాదించునట్టి బంధక శాస్త్రములను కూడా చూపించినట్లైనచో వారు ఈ సంసారములోనే మునిగిపోవురు కదా? అను ప్రశ్నకి సమాధానముగా “అవి కూడా క్రమక్రమముగా వారి యందు మోక్షమున రుచిని తద్వారా మోక్షమునకు కారణములు కాగలవు అని నాయనార్లు చెప్పుచున్నారు. చూర్ణిక అతుతానుమ్ ఆస్తిక్యమ్ … Read more

ఆచార్య హృదయం – 14

ఆచార్య హ్రుదయమ్ << చూర్ణిక 13 అవతారిక జీవులతో అనాదియైన, నిత్యమైన సహజ సంబంధమును(శేష-శేషి) కలిగి ఉన్న పరమాత్మ కేవలము మోక్షమును మాత్రము తెలియజెప్పు శాస్త్రమును కాక విషయ వాంఛలను, ప్రాపంచిక సుఖములను, స్వర్గాది సుఖములను కలుగజేయు శాస్త్రములను కూడా బయలుపరుచుటకు గల కారణము ఏమి అను ప్రశ్నకు సమాధానమును ఈ చూర్ణిక లో వివరింపబడుచున్నది. చూర్ణిక వత్సలైయాన మాతా పిళ్ళై పెగణియామల్ మణ్ తిన్నవిట్టు ప్రత్యౌషదమ్ ఇడుమాపోలే ఎవ్వుయిర్కుమ్ తాయిరుక్కుమ్ వణ్ణమాన ఇవనుమ్ రుచిక్కీడాక పన్దముమ్ … Read more