ఆచార్య హృదయం – 95

ఆచార్య హృదయం

<< చూర్ణిక 94

చూర్ణిక  95

అవతారిక
“నిత్య సంసారియైన ఒకడు భగవానుని దివ్య కటాక్షమునకు పాత్రుడైనప్పుడు అన్ని పాపములు నశించి గొప్ప ప్రభావము ఏ విధముగా కలుగును?” అన్న సందేహమునకు నాయనార్లు భగవానుని దివ్య కటాక్షము యొక్క వైభవమును కృప చేయుచున్నారు.

చూర్ణిక
శ్రమణి విదుర ఋషిపత్నికళై ప్పూత్తరాక్కిన పుణ్డరీకాక్షన్ నెడునోక్కు శాప మిళిన్దెన్న ప్పణ్డుమిఴే

సంక్షిప్త వ్యాఖ్యనము
శ్రీ శబరి, శ్రీ విధురాళ్వాను మరియు ఋషి పత్నులను పవిత్రులను చేసినట్టి ఆ పుండరీకాక్షుని దివ్యమైన దీర్ఘమైన కటాక్షము తప్పక పాపములను నిర్మూలించును.

వ్యాఖ్యానము
అనగా – కబందుడు చెప్పిన తరువాత శ్రీ రామాయణము బాల కాండము 1.57 “శ్రమణీమ్ ధర్మ నిపుణామ్ అభిగచ్ఛ” (ధర్మ శాస్త్రమున నేర్పరి అయినట్టి శబరి వద్దకు వెళ్లెను) అనియు శ్రీ రామాయణము బాల కాండము 1.57 “సోభ్యగచ్ఛన్మహా తేజాశ్చ శబరీమ్” (ఎంతో ప్రకాశవంతమైన శ్రీ రాముడు శబరి వద్దకు వెళ్లెను) అన్నట్టు శ్రీ రాముడు తానే స్వయముగా వెళ్లి బోయ కుటుంబములో పుట్టిన శబరిని స్వీకరించెను. “నీ సుందరమైన దివ్య దృష్టిచే నా లక్ష్యమునకు గల విరోధములు తొలగి నేను పవిత్రురాలను అయ్యాను” అని తానే పలికినది. శ్రీ రామాయణము అరణ్య కాండము 74.12 “చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన పాదమూలమ్ గమిష్యామి యానహం పర్యచారిషమ్” (రఘు వంశములో పుట్టిన వాడా! నేను నీ దివ్య కటాక్ష వీక్షణముల వలన పవిత్రురాలను అయ్యాను. ఓ శత్రువులను జయించిన వాడా! ఏ స్థానము నుండి తిరిగి వెనక్కి రారో నేను అట్టి స్థానమును పొందబోతున్నాను).

ఎలా అయితే వరద నీరు సహజముగా లోతట్టు ప్రాంతాల వైపు ప్రవహించునో, గొప్ప పరంపరలో పుట్టినప్పటికీ గర్వముగా ఉండుట అను లక్షణము లేకుండా మహాభారతము ఉద్యోగ పర్వము “నివాసాయ యయౌ వేశ్మ విదురస్య మహాత్మనః”(గొప్ప వాడైన విదురుని ఇంటికి శ్రీ కృష్ణుడు వెళ్లెను) అని అన్నట్టు కృష్ణుడు తానే స్వయముగా విదురుని ఇంటికి వెళ్లి అనియు మహాభారతము ఉద్యోగ పర్వము “విదురాన్నాని బుబుజే శుచీని గుణవన్దిచ” (గొప్ప గుణములను కలిగి ఎటువంటి ప్రత్యుపకారమును కోరనట్టి విదురుని వద్ద కృష్ణుడు భోగమును స్వీకరించెను) అని అన్నట్టు విదురునిచే స్పృశింపబడిన అన్నమును ఎంతో ఆతురుతలో తాను స్వీకరించెను. అట్టి విదురుని పైన శత్రువు అయిన దుర్యోధనుడు కోపమును చూపినప్పటికీ మహాభారతము ఉద్యోగ పర్వము “భీష్మ ద్రోణావతిక్రమ్య మాంచైవ మధుసూదన కిమర్తమ్ పుండరీకాక్ష భుక్తమ్ వృషల భోజనమ్” (ఓ మధుసూదన! ఓ పుండరీకాక్ష! నన్ను, భీష్ముని, ద్రోణుని మరచి తక్కువ వాడైన విదురుని భోజనము ఎలా స్వీకరించితివి?) అని అన్నట్టు తాను (దుర్యోధనుడు) కృష్ణుని పుండరీకాక్ష అని పిలిచెను. అట్లాంటి కృష్ణుడు విదురుని సంసార దోషములను తొలగించి ఆతనిని తన దివ్య కటాక్షముతో పవిత్రుడు అయ్యేట్టు చేసెను.

నాచ్చియార్ తిరుమొళి 12.6 “వేర్తుప్ పసిత్తు వయిఴసైన్దు వెణ్డడిసిల్ ఉణ్ణుమ్ బోతు ఈదెన్ఴు పార్తిత్తిరున్దు నెడునోక్కుక్ కొళ్ళుమ్” (ఆకలితో అలసిపోయి అలమటిస్తూ ఉండగా, ఋషి పత్నులు తెచ్చు భోజనము కొరకు వేచి యుండెను) అన్నట్టు భోజనము కొరకు నిరీక్షించు సమయమున తన చల్లని చూపుతో ఋషి పత్నులలో ఒకరికి వెంటనే మోక్షమును అనుగ్రహించెను. శ్రీ భాగవతము 10.23.35 “తత్రైకా విదృతా భర్తాృ భగవంతమ్ యతాశృతమ్ హృదోపగుహ్య విజహౌ దేహమ్ కర్మానుబంధనమ్” (ఆ స్త్రీలలో ఒకరిని తన భర్త బలవంతముగా అక్కడే ఉంచెను. ఇతరులు శ్రీ కృష్ణుని వర్ణిస్తున్నప్పుడు తాను విని తన హృదయములో హత్తుకొని కర్మ మూలకముగా వచ్చు తన శరీరమును విడిచిపెట్టెను) అన్నట్టు తక్కిన వారిని పవిత్రులను చేసి తద్వారా పాప నిర్మూలనము కాబడి ఆ తరువాత మోక్షమును పొందితిరి. అట్టి సర్వేశ్వరుని దివ్య కటాక్ష ప్రభావము చేత సమస్త పాపములు నివృత్తి కాబడి అట్టి పాప ఫలమును అనుభవించడము వల్లనే ఆ పాపాలు నశింపబడి తిరుప్పావై 22 “అంగణ్ ఇరణ్డుమ్ కోన్డు ఎన్గళ్ మేల్ నోక్కుదియేల్ ఎన్గళ్ మేల్ శాబమ్ ఇళిన్దు” (సూర్య చంద్రుల వంటి నీ నేత్రములతో నీవు మమ్మల్ని చూస్తే మా దుఃఖములు అన్నీ పోవును)

అన్ని పాపములు నశించుటకు ఆ భగవానుని కటాక్ష వీక్షణములే సమర్ధవంతమైనవి కావడము చేత ఏదైయితే ఆ చూపులకు పాత్రమవ్వునో అన్ని పాపముల నుండి అది విముక్తి కాబడును తిరువాయిమొళి 1.9.9 “అమలన్గళాగ” (పవిత్రము అవ్వడము) అని చెప్పడమైనది.

అడియేన్ పవన్ రామానుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-95-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment