భగవత్ రామానుజుల చరమోపదేశములు

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

ఎమ్పెరుమానార్, ఉడయవర్, శ్రీ భాష్యకారర్, కోయిల్ అన్నన్, గోదాగ్రజర్, యతిరాజర్, యతీంద్రర్ మొదలైన పేర్లతో ప్రసిద్ధి చెందిన భగవత్ రామానుజులు మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రధాన ఆచార్యులు.సంస్కృత వేదం మరియు ద్రావిడ (తమిళ) వేదాల సహాయంతో, శ్రీమన్నారాయణుని సర్వోత్కృష్టతపై దృష్టి సారించే ఈ శాశ్వత సంప్రదాయాన్ని వారు పోషించారు. వారు మనకు తొమ్మిది అద్భుతమైన గ్రంథాలను అనుగ్రహించారు; అవి:

  • శ్రీ భాష్యం – వేద వ్యాసుని బ్రహ్మ సూత్రానికి వ్యాఖ్యానం
  • వేదాంత దీపం – శ్రీ భాష్యం యొక్క సంక్షిప్త రూపం
  • వేదాంత సారం – శ్రీ భాష్యం యొక్క సూక్ష్మ సంక్షిప్త రూపం
  • వేదాంత సంగ్రహం – ఇతర సంప్రదాయాలకు చెందిన పండితులచే అపార్థం చేసుకోబడిన మరియు వక్రీకరించబడిన ఉపనిషత్తులందలి ముఖ్యమైన భాగాలను విశదీకరించే ఒక గ్రంథం.
  • శ్రీ గీతా భాష్యం – శ్రీమద్ భగవద్గీతకు వ్యాఖ్యానం – https://githa.koyil.org
  • నిత్య గ్రంథం – భగవానునికి ప్రతిరోజూ తిరువారాధనము చేయుటకు మార్గదర్శక గ్రంథం
  • శరణాగతి గద్యం – భగవత్ రామానుజులు శ్రీరంగంలో శ్రీ రంగనాచ్చియార్ మరియు శ్రీ రంగనాథునికి శరణాగతి చేసే అందమైన గ్రంథం.
  • శ్రీరంగ గద్యం – భగవద్ రామానుజులు ఎవరికి శరణాగతి చేస్తారో, ఆ శ్రీరంగనాథుని మహత్యాన్ని చాటిచెప్పే ఒక అద్భుత గ్రంథం.
  • శ్రీవైకుంఠ గద్యం – నిత్య నిలయమైన శ్రీ వైకుంఠం యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరించే ఒక సుందర గ్రంథం.

భగవద్ రామానుజులు వివిధ సమయాలలో అనేక మందికి అనేక ఉపదేశాలను (నిర్దేశములు)అందించారు.విరోధి పరిహారాలు, గురుపరంపర ప్రభవం 6000 పడి, రామానుజార్య దివ్య చరిత్ర, ప్రపన్నామృతం మొదలైన గ్రంథాలలో ఇవి చేర్చబడ్డాయి. విరోధ పరిహారాల గ్రంథ కలాక్షేపంలో భాగంగా, మనమందరం అలాంటి అనేక రకాలను చూశాము.అటువంటి ఉపదేశాల సముదాయం ఒకటి ‘ప్రపన్నామృతం’లో విశదీకరించబడింది.మేము ఈ అంశంపై ఆంగ్లంలో క్లుప్త ప్రసంగాలను అందిస్తూ వస్తున్నాము; శ్రీ వెంకటేశ పైడి మరియు శ్రీమతి విద్య శ్రీనివాసన్ ఆ ప్రసంగాలను లిఖితరూపంలోకి మార్చి, వ్యాసాల పరంపరగా ఇక్కడ క్రమబద్ధీకరిస్తున్నారు.

వీడియో లింక్: https://www.youtube.com/live/nqJw14J-jOM?si=4O38o4b2rj4W0Mbp

అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్

ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ఉషా రామానుజ దాసి

https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.

ఆంగ్లంలో: https://granthams.koyil.org/bhagavath-ramanujas-final-instructions-english/

ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org

Leave a Comment