శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
నమ్మాళ్వార్ అనే దివ్య నామము యొక్క గొప్పతనం.
శఠకోప స్వామిని నమ్మాళ్వార్ అని పిలుస్తారు. మనవాళ మామునిగళ్ (వరవరముని స్వామి), ఉపదేశరత్తినమాలై 50వ పాశురంలో “నమ్పెరుమాళ్ నమ్మాళ్వార్ నంజీయార్ నంపిళ్ళై ఎన్బర్ అవరవర్ తమ్ ఏత్తత్తాల్” అని వివరించారు.ఈ వాక్యంలో నలుగురు వ్యక్తులను చూపించారు. నమ్పెరుమాళ్ (శ్రీ రంగనాథ స్వామి), నమ్మాళ్వార్ (శఠకోప స్వామి), నంజీయర్ (వేదాంతి జీయర్) మరియు నంపిళ్లై (కలివైరి దాసర్ స్వామి). ఈ నలుగురు వ్యక్తులను ‘నమ్’ అనే ఉపసర్గతో కీర్తించారు.
‘నమ్’ అంటే మనది. ‘మన’ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా, అనురాగాన్ని, గొప్ప అనుబంధాన్ని చూపబడుతుంది. ఇక్కడ “మా స్వామీ”, “మా ప్రభువు” అని చెప్పినప్పుడు అనుబంధం ప్రదర్శించబడుతుంది.
పైన పేర్కొన్న పాశురంలో, వరవరముని స్వామి ఈ నలుగురు వ్యక్తుల పట్ల గొప్ప అనుబంధం ఉందని చెప్పారు. ఈ పాశురాన్ని రెండు విధాలుగా వివరించవచ్చు. మొదటి వివరణ ఏమిటంటే, నమ్పెరుమాళ్ళు ‘నమ్మాళ్వార్, నంజీయర్, నంపిళ్లై’ అని అన్నారు. అంటే శ్రీ రంగనాథుడు శఠకోప స్వామిని మన ఆళ్వార్ (నమ్ ఆళ్వార్) అని ముద్దుగా పిలుచుకుంటారు. అదేవిధంగా, వేదాంతి జీయర్, కలివైరి దాసర్‌ను మా పిళ్లై (నమ్ పిళ్లై) అని పిలిచారు. మరొక వివరణ ఏమిటంటే, చాలా మంది మహానుభావులు శ్రీ రంగనాథస్వామిని ‘నమ్పెరుమాళ్’ (మా పెరుమాళ్), శఠకోప స్వామిని ‘నమ్మాళ్వార్’ (మా ఆళ్వార్), వేదాంతి జీయర్‌ను ‘నమ్ జీయర్’ (మా సన్యాసి లేదా మన గొప్ప వ్యక్తి) మరియు కలివైరి దాసర్ స్వామిని ‘నమ్ పిళ్లై’ (మా పిళ్లై)గా గుర్తించారు. పిళ్లై అంటే గొప్ప వ్యక్తి అని అర్థం.
ఏది ఏమైనప్పటికీ, ‘నమ్’ అనే పదం గొప్ప అనురాగాన్ని, గొప్ప అనుబంధాన్ని చూపుతుంది. వారి గొప్పతనం మరియు వారు మనందరికీ చేసిన గొప్ప అనుగ్రహం కారణంగా ఆ అభిమానం నమ్మాళ్వారుల పట్ల చూపబడింది. అందుకే ఆయనను నమ్మాళ్వార్ అని అంటారు.
తదుపరి పోస్ట్ నుండి, నమ్మాళ్వారుల యొక్క మిగిలిన 32 దివ్య నామముల అర్థాలను మనం తెలుసుకుందాం.
వీడియోలింక్: https://www.youtube.com/watch?v=SQ2B–k3_ME&list=PLcJLpGJlP9mrfsv5if9t3WpxR9FHvMMru&index=18
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/06/13/nammazhwar-divine-names-nammazhwar-english/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ప్రసూన రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org