అనధ్యయన కాలం
శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః అధ్యయనం అంటే చదవడం, నేర్చుకోవడం, పునఃపునః ఉచ్చరించడం / పఠించడం. వేదం ఆచార్యుల ద్వారా శ్రవణం చేస్తూ, అదే విధంగా అధ్యయనం చేయబడుతుంది. వేద మంత్రాలు నిత్య అనుష్ఠానాలలో భాగంగా క్రమం తప్పకుండా జపించబడతాయి. అనధ్యయనం అంటే అధ్యయనం చేయకుండా, పఠనం చేయకుండా విరమించటం అని అర్థం. సంవత్సరంలో కొన్ని కాలాలలో వేద పఠనం చేయరాదు. ఆ కాలాన్ని స్మృతి, ఇతిహాసాలు, పురాణాలు … Read more