ఆళ్వార్ తిరునగరి   వైభవము – ప్రాచీన చరిత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవర మునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః పూర్తి శ్రేణి ఆళ్వార్ తిరునగరిని  శ్రీకురుగాపురిక్షేత్రం అని , ఆదిక్షేత్రమని కూడా అంటారు. జగత్పతి అయిన శ్రీమన్నారాయణుడు తన లీల కోసం సృష్టించిన గొప్ప దివ్యదేశమిది. సృష్టి ఆదిలో భగవానుడు,  చతుర్ముఖబ్రహ్మను సృష్టించి అతని ద్వారా ఈ జగత్తును సృష్టించాలని సంకల్పిస్తాడు. ఆ బ్రహ్మ సృష్టికార్యాన్ని పూర్తిచేసుకొని, భగవానుడి దర్శనం పొందాలనే కోరికతో వెయ్యి సంవత్సరాల కఠోరతపస్సు చేసి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 90

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 89 కోయిల్ విరహంతో బాధపడుతున్న జీయర్ ఈ విధంగా ఆళ్వార్ తిరునగరిలో జీయర్ ఉండగా, మార్గళి మాసం (ధనుర్మాసం) ఆసన్నమైంది. ఎమ్పెరుమానార్ల తిరుప్పావై గొప్పతనాన్ని విని జీయర్, సేవించలేక పోతున్నానే అని బాధ పడ్డారు. [తిరుప్పావైతో ఎమ్పెరుమానార్లకు ప్రగాఢ అనుబంధం ఉండేది; వారిని తిరుప్పావై జీయర్‌ గా సూచిస్తారు, జీయర్ వారిని ఎంబెరుమానార్ల తిరుప్పావై అని పిలుస్తారు]; … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 89

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 88 జీయర్ను ఆశ్రయించిన మహాబలి వాణనాథరాయన్ మధురలో జీయర్ ఉన్న కాలంలో , ఆ ప్రాంతపు రాజైన మహాబలి వాణనాథ రాయులు జీయర్ తిరువడి సంబంధం కోరి వారి దివ్య పాదాలను ఆశ్రయించారు. జీయర్ ఆ రాజుపై తమ విశేష కృపను కురిపించి, వారికి పంచ సంస్కారములు గావించి తమ పాదాల యందు ఆశ్రయం కలిపించారు. జీయర్ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 88

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 87 శ్రీ గోవింద దాసరప్పన్ ల మధురకవి నిష్ఠ ఒక రోజు మఠంలో, గోష్ఠి సమావేశమై ఉండగా, అందరికీ తెలిసినప్పటికీ, జీయర్ “దేవుమ్ మఱ్ఱు అరియెన్” (ఆచార్యుడు తప్పా మరొక దేవుడిని నేనెరుగను) అన్న వాఖ్యం శ్రీ గోవింద దాసరప్పకు మాత్రమే సరిపోతుందని, అతని విశిష్ఠతను గుర్తిస్తూ అన్నారు. ఈ క్రింది పాశురములో చెప్పినట్లు.. సాక్షాన్నారాయణో దేవః … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 87

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 86 అణ్ణన్, కాంచీపురం నుండి బయలుదేరి, జీయర్ దివ్య తిరువడి దర్శనం పొందాలనే గొప్ప ఆర్తితో కావేరి ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీరంగంలోని ప్రముఖులందరూ వారి రాక కబురు విని ఎంతో ఆనందించారు. ఆలయ అర్చకులు, ఆలయ ఉద్యోగులందరు కలిసికట్టుగా వెళ్లి అణ్ణన్ ను స్వాగతించి, వారిని తిరుమాలిగకు చేర్చారు. అణ్ణన్ తిరుమాలిగకు జీయర్ కూడా వచ్చి, అతనిపైన … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 86

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 85 పేరారుళాళన్ పెరుమాళ్ళ కోసం సాలైక్కిణఱు (బావి) నుండి తిరుమంజన తీర్థం తీసుకువచ్చే కైంకర్యం చేసిన స్వామియణ్ణన్ స్వామి అణ్ణన్ (కందాడై అణ్ణన్) పేరారుళాళన్ పెరుమాళ్ళ తిరువారాధన కోసం సాలైక్కిణఱు (బావి) నుండి తిరుమంజనం (పవిత్ర జలం) తీసుకురావాలని ఆశించారు. ఉడైయవర్లు చేసిన ఆ కైంకర్యం ముదలియాండాన్ పరమానందంతో చేశారు. కందాడై తోళప్పర్ (ముదళియాండన్ మనుమడు) కోరికతో … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 85

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 84 కందాడై అణ్ణన్ ను ఆశ్రయించిన అయోధ్య రామానుజ అయ్యంగార్లు రామానుజ దాసర్ అయోధ్య రామానుజ అయ్యంగార్ని చూసి, “దేవర్వారి సూచనల మేరకు, బద్రికాశ్రమంతో పాటు ఇతర దివ్య దేశాలలో కైంకర్య నిర్వహించు విధానాలను చిన్న రామానుజ అయ్యంగారుకి నేర్పించి, వారి చేత అక్కడ అన్ని కైంకర్యాలు నిర్వహింపజేశాను. అడియేన్ దేవరి వారిని దర్శించుకోవడంతో పాటు, కందాడై … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 84

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 83 తిరుమలకు బయలుదేరిన కందాడై అణ్ణన్ జీయర్ దయతో కందాడై అణ్ణన్ ను ఆదరించి, “దేవర్వారు తిరువేంకటేశ్వరునికి మంగళాశాసనం చేయ లేదు కదా?” అని అడిగారు. అక్కడ దగ్గరలో ఉన్న అప్పిళ్ళై, “కావేరిని దాటి వెళ్ళని కందాడై అణ్ణన్, అని ప్రసిద్ధికెక్కిన వారు వీరే కదా?” (వీరు శ్రీరంగనాధుని పరమ భక్తుడు) అని అన్నారు. దానికి జీయర్ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 83

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 82 కోయిల్లోని మరి కొన్ని సంఘటనలు తిరువెంకటేశ్వరుడు తిరుమలలో కైంకర్యం చేయమని తిరుమలై అయ్యంగార్లను ఆదేశించిన రోజున, జీయర్ తిరువాయ్మొళి 3.3 పదిగం ‘ఒళివిలాక్కాలం ఉడనాయ్ మన్ని వళువిలా అడిమై శెయ్య వేండుం నామ్’ (ఆటంకాలు లేకుండా నిష్కల్మశమైన కైంకర్యం చేయాలి) కాలక్షేపం చేస్తున్నారు. వారు కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా దుఃఖంతో రోధిస్తున్నారు. అంతకు ముందు రేత్రి, … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 82

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 81 తనియన్ అవతరించిన మాసం, సంవత్సరం మొదలైన వివరణలు తనియన్, వాళి తిరునామాలు ఆవిర్భవించిన నెల తిథుల గురించి అయోధ్య రామానుజ అయ్యంగార్లు ఇళైయాళ్వార్ పిళ్ళైని అడిగారు. ఇలైయాళ్వార్ పిళ్ళై ఈ క్రింది పాశురముల రూపంలో వివరించారు. నల్లదోర్ పరితాబి వరుడందన్నిల్ నలమాన ఆవణియిన్ ముప్పత్తొన్ఱిల్ శొల్లరియ శోదియుడన్ విళంగువెళ్ళిత్ తొల్కిళమై వళర్పక్క నాలానాళిల్ శెల్వమిగు పెరియ … Read more